IPL, 2022 | Match 68 | Brabourne Stadium, Mumbai - 20 May, 07:30 pm IST
(Match Yet To Begin)
RR
RR
VS
CSK
CSK
IPL, 2022 | Match 69 | Wankhede Stadium, Mumbai - 21 May, 07:30 pm IST
(Match Yet To Begin)
MI
MI
VS
DC
DC

Anxiety: యాంగ్జయిటీ లక్షణాలు తగ్గాలంటే వ్యాయామం చేయాల్సిందే... కొత్త అధ్యయన ఫలితం

మానసిక ఆందోళనతో బాధపడేవారికి వ్యాయామం వల్ల ఉపశమనం కలుగుతుంది అని చెబుతోంది కొత్త అధ్యయనం.

FOLLOW US: 

జీవితంలో ఒత్తిళ్ల కారణంగా అనేక మంది మానసిక సమస్యల బారిన పడుతున్నారు. వాటిలో ఒకటి యాంగ్జయిటీ. దీనితో బాధపడేవారికే ఇదెంతగా బాధిస్తుందో తెలుస్తుంది. ఓ కొత్త అధ్యయనం యాంగ్జయిటీతో బాధపడేవారికి శుభవార్త మోసుకొచ్చింది. ఆ సమస్య లక్షణాలు తగ్గాలంటే రోజూ కనీసం అరగంట సేపు వ్యాయామం చేయాలి. ఈ పరిశోధన తాలూకు వివరాలు ‘జర్నల్ ఆఫ్ ఎఫెక్టివ్ డిజార్డర్స్’అనే జర్నల్ లో ప్రచురించారు. 

యాంగ్జయిటీ లక్షణాలతో బాధపడుతున్న 286 మంది రోగులపై ఈ అధ్యయనం సాగింది. వారిలో సగం మంది పదేళ్ల నుంచి యాంగ్జయిటీతో బాధపడుతున్నారు. వీరిలో 70శాతం మంది మహిళలు. వీరందరినీ 12 వారాల పాటూ మితంగా లేదా శ్రమతో కూడిన వ్యాయామ సెషన్లలో పాల్గొనేలా చేశారు అధ్యయన కర్తలు. ఆ తరువాత పరిశీలిస్తే వారిలో ఆందోళన లక్షణాలు గణనీయంగా తగ్గినట్టు ఫలితాలు వచ్చాయి. అలాగే అధిక ఆందోళన బాధపడేవారు 12 వారాల వ్యాయామం తరువాత తక్కువ ఆందోళన పడే స్థాయికి చేరుకున్నారు. దీన్ని బట్టి రోజూ వ్యాయామం చేసేవారిలో ఈ రుగ్మత లక్షణాలు తగ్గుతున్నట్టు నిర్ధారణ అయ్యింది.  అలాగే ఇంట్లో ఒంటరిగా వ్యాయామం చేసేకన్నా, నలుగురైదుగురు కలిసి సమూహాలుగా వ్యాయామం చేస్తే ఇంకా మంచి ఫలితాలు వస్తాయని కూడా చెబుతున్నారు పరిశోధకులు. 

ఈ అధ్యయనాన్ని స్వీడన్ కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ గోథెన్‌బర్గ్ లో నిర్వహించారు. రోజూ వ్యాయామం చేయలేకపోతే వారానికి మూడు సార్లు, గంట పాటూ వ్యాయామం చేసినా మంచి ఫలితాలు ఉంటాయి. ఏరోబిక్ వ్యాయామాలు యాంగ్జయిటీ లక్షణాలను తగ్గించడంలో ముందుంటాయి. 

ప్రస్తుతం యాంగ్జయిటీకి చికిత్స చేసేందుకు కాగ్నిటివ్ బిహేవరియల్ థెరపీ, సైకోట్రోపిక్ మందులును సూచిస్తున్నారు. అయితే ఈ మందులు కొన్ని దుష్ప్రభావాలను కూడా కలిగిస్తాయి. కాబట్టి మందుల వాడేకన్నా ఇలా వ్యాయామం ద్వారా యాంగ్జయిటీ సమస్యను తగ్గించుకోవడం మంచిది. 

గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.

Also read: బిడ్డకు తల్లి పాలే పడకపోవడం నిజంగా శాపమే, ఈ సమస్య లక్షణాలు ఎలా ఉంటాయంటే...

Also read: ఆవలింతలు వస్తున్నాయా... అయితే మెదడు మీకేదో చెప్పాలనుకుంటోంది

Also read: అతిగా నీళ్లు తాగితే ఎంత ప్రమాదమో తెలుసా?

Also read: సిపాయిల తిరుగుబాటులో ప్రాణాలు కోల్పోయిన ఓ బ్రిటిష్ ఆఫీసర్... అతని ఆత్మ ఇంకా అక్కడే ఉందుంటున్న స్థానికులు

Also read: వెండి పట్టీలు... ఆభరణాలే కాదు, ఆరోగ్యాన్నందించే అస్త్రాలు కూడా

Also read: చలికాలపు అనారోగ్యాలకు చెక్ పెట్టే వెల్లుల్లి సూప్ ... వారానికోసారి తాగినా చాలు

Also read: కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం వీరికే ఎక్కువ... ఈ లక్షణాలు కనిపిస్తే తేలికగా తీసుకోవద్దు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌  చేయండి.
Published at : 03 Jan 2022 09:21 AM (IST) Tags: Exercise New study Anxiety symptoms ఎక్సర్ సైజ్

సంబంధిత కథనాలు

Umbrella: వానలో ఈ గొడుగేసుకుంటే తడిసిపోతాం, ధర మాత్రం రూ.లక్షపైనే

Umbrella: వానలో ఈ గొడుగేసుకుంటే తడిసిపోతాం, ధర మాత్రం రూ.లక్షపైనే

Natural Painkillers: ఈ ఆహారపదార్థాలలో పెయిన్ కిల్లర్స్ లక్షణాలు అధికం, నొప్పిని తగ్గిస్తాయి

Natural Painkillers: ఈ ఆహారపదార్థాలలో పెయిన్ కిల్లర్స్ లక్షణాలు అధికం, నొప్పిని తగ్గిస్తాయి

Wall Sit: గోడ కుర్చీ శిక్ష కాదు ఆరోగ్యానికి రక్ష, రోజుకు అయిదు నిమిషాలు వేస్తే ఎన్ని ప్రయోజనాలో

Wall Sit: గోడ కుర్చీ శిక్ష కాదు ఆరోగ్యానికి రక్ష, రోజుకు అయిదు నిమిషాలు వేస్తే ఎన్ని ప్రయోజనాలో

Parenting: ఎంత కోపం వచ్చినా మీ పిల్లలతో ఈ మాటలు అనవద్దు, వారి మనసులో ఉండిపోతాయి

Parenting: ఎంత కోపం వచ్చినా మీ పిల్లలతో ఈ మాటలు అనవద్దు, వారి మనసులో ఉండిపోతాయి

High Cholesterol: అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్నారా? ఈ ఒక్క కూరగాయ తింటే చాలు, అంతా కరిగిపోతుంది

High Cholesterol: అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్నారా? ఈ ఒక్క కూరగాయ తింటే చాలు, అంతా కరిగిపోతుంది

టాప్ స్టోరీస్

Nikhat Zareen Profile: ఓవర్‌నైట్ గెలుపు కాదిది - నిఖత్ జరీన్‌ది 12 ఏళ్ల శ్రమ!

Nikhat Zareen Profile: ఓవర్‌నైట్ గెలుపు కాదిది - నిఖత్ జరీన్‌ది 12 ఏళ్ల శ్రమ!

CM Jagan Davos Tour : సీఎం జగన్ దావోస్ పర్యటన, పెట్టుబడులే టార్గెట్!

CM Jagan Davos Tour : సీఎం జగన్ దావోస్ పర్యటన, పెట్టుబడులే టార్గెట్!

Sirivennela HBD: నిన్ను తలుచుకోని నిమిషం, నీ పాట ధైర్యం చెప్పని క్షణముందా సీతారాముడూ!

Sirivennela HBD: నిన్ను తలుచుకోని నిమిషం, నీ పాట ధైర్యం చెప్పని క్షణముందా సీతారాముడూ!

NTR Birthday Special: బాక్సాఫీస్ కుంభస్థలాన్ని బద్దలు కొట్టిన కొమురం భీముడు- బృందావనంలో అందాల రాముడు

NTR Birthday Special: బాక్సాఫీస్ కుంభస్థలాన్ని బద్దలు కొట్టిన కొమురం భీముడు- బృందావనంలో అందాల రాముడు