Bajra vs Maize Roti: సజ్జ రొట్టె లేెదా జొన్న రొట్టె... ఈ రెండింటిలో బరువు తగ్గేందుకు ఏది తింటే బెటర్?
బరువు తగ్గాలనుకునేవారు అన్నం మానేసి రొట్టెలు తినేందుకు ఇష్టపడతారు. కేవలం చపాతీలు మాత్రమే తినాలా వాళ్లు?
![Bajra vs Maize Roti: సజ్జ రొట్టె లేెదా జొన్న రొట్టె... ఈ రెండింటిలో బరువు తగ్గేందుకు ఏది తింటే బెటర్? Bajra or Maize Roti ... Which of the two is better to eat for weight loss? Bajra vs Maize Roti: సజ్జ రొట్టె లేెదా జొన్న రొట్టె... ఈ రెండింటిలో బరువు తగ్గేందుకు ఏది తింటే బెటర్?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/03/ae041d5cdb5aa781e9a571ce5e337a3e_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
బరువు తగ్గాలనుకుంటున్నవారి మొదటి ఛాయిస్ చపాతీలు. కేవలం చపాతీలే తినడం కూడా కష్టమే. అందుకే చాలా ప్రాంతాల్లో సజ్జలతో, జొన్న పిండితో కూడా రొట్టెలు చేసుకుని తింటుంటారు. అయితే బరువు తగ్గేందుకు సజ్జ రొట్టెలు, జొన్న రొట్టెల్లో ఏది ఉత్తమం? ఈ రెండూ ఆరోగ్యంపై చూపే ప్రభావం గురించి తెలుసుకుంటే... ఏది మంచిదో మీరే నిర్ణయించుకోగలరు.
సజ్జ రొట్టెలు
సజ్జల్లో మాంసకృత్తులు, ఫైబర్, అవసరమైన ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు ఇది గ్లూటెన్ రహిత ఆహారం. డయాబెటిస్ ఉన్న వారు కూడా సజ్జరొట్టెలను తింటే చాలా ఆరోగ్యం. ఎందుకంటే ఇందులో ఉండే అధిక ఫైబర్ కంటెంట్ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నిర్వహించడంలో సహాయపడుతుంది. ఇందులో అధిక మొత్తం ప్రోటీన్ కూడా ఉంటుంది. దీని వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు, మలబద్ధకం వంటివి దరిచేరవు. అంతేకాదు వివిధ రకాల కార్బోహైడ్రేట్ల సమ్మేళనంగా ఉండే సజ్జ రొట్టెలు జీర్ణం కావడానికి చాలా సమయం తీసుకుంటాయి. కాబట్టి వీటిని తినడం వల్ల ఆకలి త్వరగా వేయదు. తద్వారా బరువు తగ్గొచ్చు. అయితే ఇది అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది. డయాబెటిస్ ఉన్న వారు అధికంగా తినకుండా మితంగా తినాల్సిన అవసరం ఉంది. సజ్జల్లో ఉండే ఫైటో కెమికల్స్, పాలీ ఫెనాల్స్ శరీరంలో క్యాన్సర్ కణితులు పెరగకుండా అడ్డుకుంటాయి.
జొన్న రొట్టెలు
గోధుమపిండితో చేసే చపాతీలకు మంచి ప్రత్యామ్నాయం జొన్నరొట్టెలు. దీనిలో ఐరన్, ఫాస్పరస్, జింక్, వివిధ విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. అలాగే జొన్న పిండి కంటి చూపుకు చాలా మంచిదని పలు అధ్యయనాలు చెప్పాయి. క్యాన్సర్ రాకుండా అడ్డుకోవడంలో, రక్తహీనతను నివారించంలో కూడా సహాయపడుతుంది. ఇది కూడా సజ్జల్లాగే గ్లూటెన్ రహిత పిండి. బరువు తగ్గడానికి ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇందులో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు ఉంటాయి. కాబట్టి ఆహారం విచ్చిన్నమై జీర్ణం కావడానికి సమయం పడుతుంది. పొట్ట నిండుగా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది కాబట్టి ఇతర ఆహారం తీసుకోవాలనిపించదు.
ఏది ఉత్తమం?
జొన్నలు, సజ్జలు... రెండూ గ్లూటెన్ రహితమైనవే అయినా త్వరగా బరువు తగ్గాలనుకునేవారికి సజ్జ పిండితో చేసిన రొట్టెలు మంచివి. కేలరీలు కూడా జొన్న కన్నా, సజ్జల్లో తక్కువ. అయితే అధికంగా తింటే మాత్రం మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంది. అయితే మితంగా తింటే ఏ ప్రమాదమూ లేదు.
ఇక జొన్న పిండితో చేసిన రొట్టెలు కూడా అధికంగా రోజులో రెండుపూటలా తినడం వంటివి చేయకూడదు. దీని వల్ల కొందరిలో రక్తంలో గడ్డలు ఏర్పడే అవకాశం ఉంది. ఎక్కువ మొత్తంలో తింటే జీర్ణం కావడం కష్టమవుతుంది. దీని వల్ల ఉబ్బరం, గ్యాస్, డయేరియా వంటి సమస్యలు రావచ్చు. మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి మీకు ఏం రొట్టెలు మంచివో మీరే అంచనా వేసుకోండి.
గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.
Also read: యాంగ్జయిటీ లక్షణాలు తగ్గాలంటే వ్యాయామం చేయాల్సిందే... కొత్త అధ్యయన ఫలితం
Also read: బిడ్డకు తల్లి పాలే పడకపోవడం నిజంగా శాపమే, ఈ సమస్య లక్షణాలు ఎలా ఉంటాయంటే...
Also read: ఆవలింతలు వస్తున్నాయా... అయితే మెదడు మీకేదో చెప్పాలనుకుంటోంది
Also read: అతిగా నీళ్లు తాగితే ఎంత ప్రమాదమో తెలుసా?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)