అన్వేషించండి

Coconut Water vs Lemon Water : కొబ్బరి నీరు vs నిమ్మరసం.. ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు ఏది తాగితే మంచిది?

Coconut Water or Lemonade : సమ్మర్​లో డీహైడ్రేషన్​కి గురి అవ్వడం ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఆ సమయంలో కొబ్బరి నీరు తాగితే మంచిదా? లేక నిమ్మరసం మంచి ఫలితాలు ఇస్తుందా? చూసేద్దాం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • వేడిలో శరీరాన్ని హైడ్రేట్​గా ఉంచుకోవడం చాలా ముఖ్యం.
  • కొబ్బరి నీళ్లు ఎలక్ట్రోలైట్స్ అందించి, డీహైడ్రేషన్​ను త్వరగా తగ్గిస్తాయి.
  • నిమ్మరసం రోజువారీ హైడ్రేషన్​కు, రోగనిరోధక శక్తి పెంచడానికి మంచిది.
  • తక్షణ ఉపశమనానికి కొబ్బరి నీళ్లు, చవకైన హైడ్రేషన్​కు నిమ్మరసం ఉత్తమం.

Coconut Water or Lemon Water for Dehydration : భారతదేశంలో వేడి రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హ్యూమిడిటీ ఎక్కువగా ఉండటం వల్ల ఉష్ణోగ్రత కంటే ఇంకా ఎక్కువగా వేడి అనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో డీహైడ్రేషన్, హీట్ స్ట్రోక్, కిడ్నీ సమస్యలు వంటి ప్రమాదాలు పెరుగుతున్నాయి. అందుకే ఈ సమయంలో శరీరాన్ని హైడ్రేటెడ్​గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. హైడ్రేషన్ కోసం ఎక్కువమంది నీటితో పాటు.. వివిధ రకాల డ్రింక్స్ తీసుకుంటారు. ముఖ్యంగా కూల్ డ్రింక్స్ వద్దనుకునేవారు కొబ్బరి నీరు, నిమ్మరసం వంటివి తాగుతారు. మరి ఈ రెండింటిలో ఏది మంచిదో చూసేద్దాం. 

కొబ్బరి నీరు తాగితే..

కొబ్బరి నీళ్లను నేచురల్ ఎనర్జీ డ్రింక్​గా చెప్తారు. కొబ్బరి నీళ్లలో పొటాషియం, సోడియం, మెగ్నీషియం, కాల్షియం వంటి పోషకాలు ఉంటాయి. ఇవి శరీరానికి నేచురల్ ఎలక్ట్రోలైట్ డ్రింక్​లా పనిచేసి.. శరీరంలోని నీటి లోపాన్ని త్వరగా పూర్తి చేస్తాయి. అలాగే తక్కువ కేలరీలు ఉంటాయి. 

ఎప్పుడు తాగితే మంచిదంటే.. 

కొబ్బరి నీళ్లు ఎండలో తిరిగిన తర్వాత, వ్యాయామం చేసిన తర్వాత, తేలికపాటి డీహైడ్రేషన్ ఉన్నప్పుడు తీసుకుంటే మంచిది. ఓ గ్లాస్ లేదా 100 ఎమ్​ఎల్ తీసుకుంటే సరిపోతుంది. ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్తున్నారు నిపుణులు. 

నిమ్మరసంతో తాగితే 

నిమ్మరసాన్ని రోజువారీ హైడ్రేషన్ డ్రింక్​గా చెప్పవచ్చు. దీనిని ఇంట్లోనే సింపుల్​గా తయారు చేసుకోవచ్చు. దీనిలో విటమిన్ C, ఉప్పు వేసుకుంటే సోడియం, కొంత పొటాషియం ఉంటాయి. ఇవి శరీరానికి తక్షణమే రిఫ్రెష్​మెంట్ ఇస్తాయి. ఇమ్యూనిటీ పెంచడంలో కూడా హెల్ప్ చేస్తాయి. 

నిమ్మరసం ఎప్పుడు తాగితే మంచిది?

రోజంతా హైడ్రేటెడ్​గా ఉండాలనుకుంటే నిమ్మరసం ఎప్పుడైనా తాగవచ్చు. వేడి ఎక్కువగా ఉన్న రోజుల్లో కూడా దీనిని సాల్ట్ వేసుకుని తయారు చేసుకోవచ్చు. పైగా తక్కువ ఖర్చుతో డీహైడ్రేషన్ దూరం చేసుకోవచ్చు. 

డీహైడ్రేషన్ తగ్గించాలనుకుంటే ఏది బెస్ట్.. 

మీరు రోజువారీ హైడ్రేషన్ కావాలనుకుంటే తక్కువ ఖర్చులో నిమ్మరసం చేసుకోవచ్చు. ఎండలో తిరిగి వెంటనే డీహైడ్రేషన్ లక్షణాల నుంచి రికవరీ అవ్వాలంటే.. ఎలక్ట్రోలైట్స్ కోసం కొబ్బరి నీరు తీసుకోవచ్చు. అయితే వీటిని తాగేప్పుడు రుచి కోసం షుగర్ వేసుకోకపోవడమే మంచిది. ఈ రెండూ కూడా ప్యాక్ట్ డ్రింక్స్ అందుబాటులో ఉంటాయి. కానీ వాటిని తాగకపోవడమే బెస్ట్. చక్కగా నిమ్మరసాన్ని ఇంట్లో తయారు చేసుకోండి. కొబ్బరి తాజాగా కొట్టించి తాగండి.

వేసవిలో హైడ్రేషన్ కోసం తాగాలనుకుంటే రెండూ మంచివే. కానీ డీహైడ్రేషన్ ఎక్కువ అయితే ORS తీసుకోవాలి. ఈ రెండింటీ కంటే అది బెస్ట్ ఫలితాలు ఇస్తుంది. అలాగే రోజూ తాగేందుకు సులభంగా, చవకగా కావాలనుకుంటే నిమ్మరసం బెస్ట్. ఎండలో తిరిగిన తర్వాత లేదా అలసటగా ఉన్నప్పుడు కొబ్బరి నీరు మంచి ఆప్షన్. 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Chewing Gum Beetroot Juice : బీట్‌రూట్ జ్యూస్ తాగి చూయింగ్ గమ్ నమిలితే బీపీ తగ్గుతుందా? పరిశోధకులు ఏం చెప్పారంటే
బీట్‌రూట్ జ్యూస్ తాగి చూయింగ్ గమ్ నమిలితే బీపీ తగ్గుతుందా? పరిశోధకులు ఏం చెప్పారంటే
Multani Mitti for Hair : ముల్తానీ మట్టి తలకు అప్లై చేయవచ్చా? లాభాలు, నష్టాలు ఇవే
ముల్తానీ మట్టి తలకు అప్లై చేయవచ్చా? లాభాలు, నష్టాలు ఇవే
Breastfeeding Diet : తల్లిపాలు ఇచ్చే సమయంలో అతిగా తినకూడదా? డైట్‌లో చేర్చుకోవాల్సిన, తీసేయాల్సిన ఫుడ్స్ ఇవే
తల్లిపాలు ఇచ్చే సమయంలో అతిగా తినకూడదా? డైట్‌లో చేర్చుకోవాల్సిన, తీసేయాల్సిన ఫుడ్స్ ఇవే
Wearing Slippers at Home : ఇంట్లో చెప్పులు వేసుకుని నడవాలా? లేక చెప్పులు లేకుండా నడవాలా? ఆరోగ్యానికి ఏది మంచిదో తెలుసా?
ఇంట్లో చెప్పులు వేసుకుని నడవాలా? లేక చెప్పులు లేకుండా నడవాలా? ఆరోగ్యానికి ఏది మంచిదో తెలుసా?

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Budget Friendly Bikes: మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
TDP MP Chintakayala Vijay: న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
Embed widget