అన్వేషించండి

Okra Water : బెండకాయలు నీటిలో నానబెట్టి ఉదయాన్నే తాగితే షుగర్ తగ్గుతుందా? నెలరోజులు తాగితే కలిగే లాభాలు ఇవే

Drinking Okra Water for 30 Days : బెండకాయలను కోసి రాత్రుళ్లు నీటిలో నానబెట్టి ఉదయాన్నే తాగితే ఆరోగ్యానికి ఎన్నో లాభాలు పొందవచ్చంటన్నారు. నెలరోజులు దీనిని ఫాలో అయితే కలిగే లాభాలు ఏంటో చూసేద్దాం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • బెండకాయ నీరు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, మలబద్ధకం తగ్గిస్తుంది.
  • ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.
  • చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరిచి, రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
  • బరువు తగ్గడానికి, గుండె ఆరోగ్యానికి కూడా ఇది మేలు చేస్తుంది.

Bhindi Water Benefits : బెండకాయలు, బెండకాయ నీరు కూడా ఆరోగ్యానికి చాలామంచిది. బెండకాయ నీరు అంటే తాజా బెండకాయలను ముక్కలుగా కోసి.. రాత్రంతా నీటిలో నానబెట్టి.. ఉదయం ఆ నీటిని తాగడం. ఈ సింపుల్ డ్రింక్‌కి ఈ మధ్యకాలంలో మంచి గుర్తింపు వచ్చింది. ఎందుకంటే పరగడుపునే దీనిని తాగడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందుతాయి. 

బెండకాయలో ఉండే ఫైబర్, యాంటీఆక్సిడెంట్స్, విటమిన్స్, మినరల్స్ అన్నీ కలిసి శరీరానికి అనేక లాభాలు ఇస్తాయి. ముఖ్యంగా ఉదయం ఖాళీ కడుపుతో తాగితే పోషకాలను శరీరం బాగా అబ్జార్వ్ చేస్తుంది. అయితే దీనిని రెగ్యులర్​గా నెలరోజులు తాగితే (Okra Water for 30 Days) ఏమవుతుందో.. శరీరంలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయో తెలుసుకుందాం. 

మెరుగైన జీర్ణక్రియ

బెండకాయలో ఉండే సాల్యూబుల్ ఫైబర్, మ్యూసిలేజ్ అనే జెల్‌లాంటి పదార్థం జీర్ణవ్యవస్థకు చాలా మేలు చేస్తుంది. దీనివల్ల ఆహారం సాఫీగా జీర్ణమవుతుంది. మలబద్ధకం తగ్గుతుంది. ఎసిడిటీ, గ్యాస్, బ్లోటింగ్ సమస్యలు దూరమవుతాయి. అలాగే గట్‌లో ఉన్న మంచి బ్యాక్టీరియాకు ఆహారంగా పనిచేస్తుంది. దీంతో గట్ హెల్త్ మెరుగుపడుతుంది.

బ్లడ్ షుగర్ కంట్రోల్‌

బెండకాయ నీరు డయాబెటిస్ ఉన్నవారికి చాలా ఉపయోగకరంగా ఉండొచ్చు. దీనిని తాగడం వల్ల కార్బోహైడ్రేట్స్ నెమ్మదిగా జీర్ణమవుతాయి. రక్తంలో చక్కెర ఒక్కసారిగా పెరగదు. అంతేకాకుండా ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుపడుతుంది. కొన్ని పరిశోధనల ప్రకారం బెండకాయలో ఉండే ఫ్లావనాయిడ్స్, పాలీఫినాల్స్ షుగర్ లెవల్స్ తగ్గించడంలో సహాయపడతాయని తెలిపాయి. 

చర్మం ఆరోగ్యానికై..

బెండకాయలో ఉన్న యాంటీఆక్సిడెంట్స్ చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. స్కిన్ హైడ్రేషన్ పెరుగుతుంది. మొటిమలు తగ్గవచ్చు. చర్మానికి మంచి గ్లో వస్తుంది. వృద్ధాప్య లక్షణాలు ఆలస్యమవుతాయి. లోపల నుంచే స్కిన్‌ను మాయిశ్చరైజ్ చేసేలా పనిచేస్తుంది.

ఇమ్యూనిటీ బూస్టర్

బెండకాయలో విటమిన్ C, క్వెర్సెటిన్ వంటి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ పదార్థాలు ఉంటాయి. ఇవి శరీరంలోని ఇన్‌ఫ్లమేషన్ తగ్గిస్తాయి. ఇమ్యూన్ సిస్టమ్ బలపడుతుంది. జలుబు, జ్వరం వంటి సమస్యలు కూడా దూరమవుతాయి. 

మరెన్నో ప్రయోజనాలు.. 

ఇవే కాకుండా బెండకాయ నీటిని నెల రోజులు తీసుకుంటే శరీరానికి మరెన్నో ప్రయోజనాలు అందుతాయి. బెండకాయలో కాలరీలు తక్కువగా ఉంటాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారికి మంచి ఆప్షన్. గుండె ఆరోగ్యానికి ఉపయోగపడే ఫైబర్ ఇందులో ఎక్కువగా ఉంటుంది. దీనిలోని ఫోలేట్ గర్భిణులకు కూడా మంచిది. అలాగే శరీరంలోని టాక్సిన్స్ బయటకు పంపడానికి హైల్ప్ చేస్తుంది. జుట్టు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

బెండకాయ నీటితో ప్రయోజనాలు ఉన్నాయని రోజంతా తాగకూడదు. రోజుకు 1 గ్లాస్ తీసుకుంటే సరిపోతుంది. షుగర్ పేషెంట్స్ మందులు వాడుతున్నట్లయితే వైద్యుల సూచనల ప్రకారం తీసుకుంటే మంచిది. అలర్జీలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. నిపుణుల సలహాలు తీసుకోవాలి. 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Castor Oil for Hair : ఆముదం జుట్టుకు అప్లై చేస్తున్నారా? జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఈ 5 పదార్థాలతో కలిపి రాయండి
ఆముదం జుట్టుకు అప్లై చేస్తున్నారా? జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఈ 5 పదార్థాలతో కలిపి రాయండి
Korean Glass Skin Drink : కొరియన్ గ్లాస్ స్కిన్ కోసం ఈ మ్యాజిక్ డ్రింక్ తాగాలా? నిమ్మ-కీరదోసకాయ జ్యూస్‌తో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
కొరియన్ గ్లాస్ స్కిన్ కోసం ఈ మ్యాజిక్ డ్రింక్ తాగాలా? నిమ్మ-కీరదోసకాయ జ్యూస్‌తో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
Independence Day Quiz Questions : ఆగస్టు 15పై పోటీ పరీక్షల్లో అడిగే ముఖ్యమైన GK ప్రశ్నలు.. సమాధానాలు ఇవే
ఆగస్టు 15పై పోటీ పరీక్షల్లో అడిగే ముఖ్యమైన GK ప్రశ్నలు.. సమాధానాలు ఇవే
Independence Day Speech : స్వాతంత్య్ర దినోత్సవ 2026 ప్రసంగం.. స్కూల్ స్పీచ్ పోటీలో గెలవాలంటే ఈ టిప్స్ పాటించండి
స్వాతంత్య్ర దినోత్సవ 2026 ప్రసంగం.. స్కూల్ స్పీచ్ పోటీలో గెలవాలంటే ఈ టిప్స్ పాటించండి

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Embed widget