Chicken Recipe: క్యాబెజీ చికెన్ కర్రీ, ఆ రెండూ కలిపి తినడం వల్ల ఎన్ని లాభాలో
క్యాబేజ్ చికెన్ కర్రీ... వెజ్, నాన్ వెజ్ కలిపి వండే ఈ కర్రీ రుచిలో అదిరిపోతుంది.
చికెన్ కర్రీలో క్యాబేజీ ఏంటి? అనుకోకండి. ఈ కర్రీని ఓసారి తిని చూస్తే అప్పుడు తెలుస్తుంది, మేము ఇంత ప్రత్యేకంగా ఈ రెసిపీని ఎందుకు చెప్పామో. ఈ రెండు తినడం వల్ల అంతే పోషకాలు కూడా అధికం. చికెన్ తినడం వల్ల కండరాలు బలంగా తయారవుతాయి. దీన్నే మనం కండపుష్టి అంటాం. గుండె ఆరోగ్యానికి చికెన్ అవసరం. ఇందులో నియాసిన్ ఉంటుంది. తక్కువ ఆయిల్‌తో దీన్ని వండి తింటే చాలా మంచిది. రోగనిరోధక శక్తి పెంచేందుకు కూడా ఇది సహాయపడుతుంది. జలుబును త్వరగా తగ్గిస్తుంది. మిరియాలపొడి, చికెన్ కలిపి చేసిన సూప్ లేదా కూర తింటే జలుబుకు ఉపశమనం కలుగుతుంది. ఇందులో ఉండే అమినో ఆమ్లాలు పిల్లలు పొడవు పెరిగేలా చేస్తాయి.
ఇక క్యాబేజీ విషయానికి వస్తే కేలరీలు తక్కువగా ఉండి, పోషకాలు అధికంగా ఉండే కూరగాయ ఇది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీన్ని తరచూ తినడం వల్ల శరీరంలో వాపులు, నొప్పుల్లాంటివి తగ్గుతాయి. విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. దీన్ని తరచూ తినడం వల్ల క్యాన్సర్ రాకుండా ఉంటుందని అధ్యయనాలు చెప్పాయి. ఈ కూరగాయ జీర్ణప్రక్రియకు మేలు చేస్తుంది. బీపీని నియంత్రిస్తుంది. ఇందులో ఉండే ఆంథోసైనిన్ సమ్మేళనాలు గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటాయి.
ఆరోగ్యపరంగా మనకెంతో మేలు చేసే చికెన్, క్యాబేజీ కలిపి తింటే మరిన్ని పోషకాలు అందడం ఖాయం.
కావాల్సిన పదార్థాలు
చికెన్ ముక్కలు (బోన్ లెస్) - అరకిలో
క్యాబెజీ తరుగు - ఒక కప్పు
ఎర్ర రంగు క్యాప్సికమ్ తరుగు - పావు కప్పు
ఉల్లిపాయ తరుగు - అరకప్పు
అల్లం వెల్లుల్లి పేస్టు - మూడు టీస్పూనులు
మిరియాల పొడి - ఒక టీస్పూను
గరం మసాలా - ఒక టీస్పూను
కరివేపాకు - గుప్పెడు
ఉప్పు - రుచికి తగినంత
నూనె - వండడానికి సరిపడా
కారం - ఒక స్పూను
పసుపు - అర స్పూను
పచ్చిమిర్చి - రెండు
తయారీ ఇలా
1. చికెన్ కర్రీని ప్రతిసారి ఒకేలా తినితిని బోరుకొట్టిన వారికి క్యాబేజీ చికెన్ కర్రీ బాగా నచ్చుతుంది.
2. బోన్ లెస్ చికెన్‌ను ఈ కర్రీ కోసం తీసుకోవాలి. మీడియం సైజులో ముక్కలు కోసుకోవాలి.
3. చికెన్ ను శుభ్రం కడిగి పక్కన పెట్టుకోవాలి. క్యాబేజీ తరుగును కూడా కడిగా పక్కన పెట్టుకోవాలి.
4. స్టవ్ మీద కళాయి పెట్టి ఆయిల్ వేయాలి. నూనె వేడెక్కాక ఉల్లిపాయ తరుగు, పచ్చి మిర్చి వేసి వేయించాలి.
5. అల్లం వెల్లుల్లి పేస్టు కూడా కలపాలి. పసుపు, కారం వేయాలి.
6. ఇప్పుడు చికెన్ ముక్కలు వేసి బాగా కలపాలి.
7. చికెన్ ముక్కలు కాస్త వేగాక క్యాబెజీ తరుగు, క్యాప్సికమ్ తరుగు వేసి బాగా ఉడికించాలి.
8. అడుగుంటుతున్నట్టు అనిపిస్తే నీళ్లు వేసి కలపాలి.
9. ఉప్పు, కరివేపాకు వేసి మూత పెట్టాలి.
10. చికెన్, క్యాబేజీ బాగా ఉడికాక మిరియాల పొడి చల్లాలి. కూర బాగా ఉడికాక ఆపేయాలి. అంటే క్యాబెజీ చికెన్ కర్రీ సిద్ధమైనట్టే.
Also read: ఐస్‌క్రీముల్లో వాడే ఈ ద్రావకం ఎంత ప్రమాదకరమో తెలుసా?
Also read: వాతావరణ ఉష్ణోగ్రత పెరిగితే తీవ్ర మానసిక సమస్యలు, అధ్యయనంలో షాకింగ్ ఫలితం