అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

నిరుద్యోగులకు అలర్ట్, హైకోర్టు ఉద్యోగాల దరఖాస్తు ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?

పోస్టుల భర్తీకి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ జనవరి 21న ప్రారంభమైంది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఫిబ్రవరి 11 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

తెలంగాణ హైకోర్టులో ఉద్యోగాల భర్తీకి జనవరి 11న నోటిఫికేషన్లు వెలువడిన సంగతి తెలిసిందే. మొత్తం 176 ఖాళీల భర్తీకి 9 నోటిఫికేషన్లను హైకోర్టు విడుదల చేసింది. అయితే ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ జనవరి 21న ప్రారంభమైంది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఫిబ్రవరి 11 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపట్టనున్నారు. పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లు ఫిబ్రవరి 20 నుంచి అందుబాటులో ఉండనున్నాయి. పరీక్ష తేదీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.

హైకోర్టులో 176 ఖాళీల్లో హైకోర్టు సబార్డినేట్‌–50 పోస్టులు, సిస్టమ్‌ అసిస్టెంట్‌–45 పోస్టులు, ఎగ్జామినర్‌–17 పోస్టులు, అసిస్టెంట్‌–10 పోస్టులు, స్టెనో–2 పోస్టులు, అసిస్టెంట్‌ లైబ్రేరియన్‌–2 పోస్టులు, కంప్యూటర్‌ ఆపరేటర్‌–20 పోస్టులు, ట్రాన్స్‌లేటర్‌–10 పోస్టులు, కోర్టు మాస్టర్‌/ హైకోర్టు జడ్జిల వ్యక్తిగత కార్యదర్శులు–20 పోస్టులు ఉన్నాయి. 

Online Application

పోస్టుల వివరాలు..

1) కోర్టు మాస్టర్స్/ హైకోర్టు జడ్జిల వ్యక్తిగత కార్యదర్శులు: 20 పోస్టులు 
తెలంగాణ హైకోర్టులో కోర్టు మాస్టర్స్/ హైకోర్టు జడ్జిల వ్యక్తిగత కార్యదర్శి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా మొత్తం 20 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఖాళీల్లో ఓసీలకు 9 పోస్టులు, బీసీలకు 5 పోస్టులు, ఎస్సీలకు 2, ఎస్టీలకు 4 పోస్టులు కేటాయించారు. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఇంగ్లిష్ టైపింగ్ తెలిసి ఉండాలి. ప్రభుత్వం నిర్వహించే టెక్నికల్ పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. ఈ ఖాళీల భర్తీకి జనవరి 21 నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఫిబ్రవరి 11 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మార్చిలో నిర్వహించే పరీక్షల ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లు ఫిబ్రవరి 20 నుంచి అందుబాటులో ఉండనున్నాయి. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

2) ట్రాన్స్‌లేటర్‌ (తెలుగు, ఉర్దూ): 10 పోస్టులు
తెలంగాణ హైకోర్టు ట్రాన్స్‌లేటర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 10 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో 8 పోస్టులు తెలుగు ట్రాన్స్‌లేటర్ పోస్టులు కాగా, 2 ఉర్దూ ట్రాన్స్‌లేటర్ పోస్టులు ఉన్నాయి. ఖాళీల్లో ఓసీలకు 3 పోస్టులు, బీసీలకు 2 పోస్టులు, ఎస్సీలకు 2, ఎస్టీలకు 1 పోస్టు కేటాయించారు. మూడేళ్లు లేదా ఐదేళ్ల లా డిగ్రీ అర్హతతోపాటు సంబంధిత విభాగంలో డిప్లొమా లేదా సర్టిఫికేట్ కోర్సు అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు జనవరి 21 నుంచి ఫిబ్రవరి 11 వరకు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

3) కంప్యూటర్‌ ఆపరేటర్‌: 20 పోస్టులు
తెలంగాణ హైకోర్టు కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 20 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఖాళీల్లో ఓసీలకు 10, బీసీలకు 6, ఎస్సీలకు 3, ఎస్టీలకు 1 పోస్టు కేటాయించారు. ఏదైనా డిగ్రీతోపాటు టైపింగ్(హయ్యర్‌గ్రేడ్) సర్టిఫికేట్ ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు ఉన్న అభ్యర్థులు జనవరి 21 నుంచి ఫిబ్రవరి 11 వరకు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, టైపింగ్ టెస్ట్ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

4) అసిస్టెంట్‌ లైబ్రేరియన్‌: 02 పోస్టులు
తెలంగాణ హైకోర్టు అసిస్టెంట్ లైబ్రేరియన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 2 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఖాళీల్లో ఓసీలకు 1, ఎస్సీలకు 1 పోస్టు కేటాయించారు. ఏదైనా డిగ్రీతోపాటు టైపింగ్(హయ్యర్‌గ్రేడ్) సర్టిఫికేట్ ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు ఉన్న అభ్యర్థులు జనవరి 21 నుంచి ఫిబ్రవరి 11 వరకు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, టైపింగ్ టెస్ట్ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

5) స్టెనో: 02 పోస్టులు
తెలంగాణ హైకోర్టు అప్పర్ డివిజన్ స్టెనో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 2 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఖాళీల్లో ఓసీలకు 1, బీసీలకు 1 పోస్టు కేటాయించారు. ఏదైనా డిగ్రీతోపాటు టైపింగ్(హయ్యర్‌గ్రేడ్), ఇంగ్లిష్ షార్ట్‌హ్యాండ్ సర్టిఫికేట్ ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. కంప్యూటర్ డిగ్రీ/డిప్లొమా ఉన్నవారికి ప్రాధాన్యం. సరైన అర్హతలు ఉన్న అభ్యర్థులు జనవరి 21 నుంచి ఫిబ్రవరి 11 వరకు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, టైపింగ్ టెస్ట్ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

6) అసిస్టెంట్‌: 10 పోస్టులు
తెలంగాణ హైకోర్టు  అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 10 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఖాళీల్లో ఓసీలకు 5, బీసీలకు 2, ఎస్సీలకు 2, ఎస్టీలకు 1  పోస్టు కేటాయించారు. ఏదైనా డిగ్రీ ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు జనవరి 21 నుంచి ఫిబ్రవరి 11 వరకు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, టైపింగ్ టెస్ట్ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

7) ఎగ్జామినర్‌: 17 పోస్టులు
తెలంగాణ హైకోర్టు ఎగ్జామినర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 17 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఖాళీల్లో ఓసీలకు 10, బీసీలకు 3, ఎస్సీలకు 3, ఎస్టీలకు 1 పోస్టు కేటాయించారు. ఏదైనా డిగ్రీ ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు జనవరి 21 నుంచి ఫిబ్రవరి 11 వరకు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, టైపింగ్ టెస్ట్ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

8)  సిస్టమ్‌ అసిస్టెంట్‌: 45 పోస్టులు
తెలంగాణ హైకోర్టు  సిస్టం అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 45 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఖాళీల్లో ఓసీలకు 23, బీసీలకు 13, ఎస్సీలకు 6, ఎస్టీలకు 3 పోస్టులు కేటాయించారు. సంబంధిత విభాగాల్లో ఇంజినీరింగ్ డిగ్రీ/డిప్లొమా/బీఎస్సీ డిగ్రీతోపాటు కంప్యూటర్ హార్డ్‌వేర్, నెట్‌వర్కింగ్, ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్‌వేర్ అనభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు జనవరి 21 నుంచి ఫిబ్రవరి 11 వరకు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, టైపింగ్ టెస్ట్ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

9) ఆఫీస్ సబార్డినేట్: 50 పోస్టులు
తెలంగాణ హైకోర్టు ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 50 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఖాళీల్లో ఓసీలకు 26, బీసీలకు 14, ఎస్సీలకు 7, ఎస్టీలకు 3 పోస్టులు కేటాయించారు. అభ్యర్థులు 7వ తరగతి/10వ తరగతి లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి. సరైన అర్హతలున్నవారు జనవరి 21 నుంచి ఫిబ్రవరి 11 వరకు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, టైపింగ్ టెస్ట్ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

ముఖ్యమైన తేదీలు..

➥ నోటిఫికేషన్ల వెల్లడి: 11.01.2023.

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 21.01.2023.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 11.02.2023. (11.59 PM)

➥ పరీక్ష హాల్‌టికెట్ల డౌన్‌లోడ్: 20.02.2023.

➥  కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష తేది: మార్చిలో పరీక్ష నిర్వహిస్తారు.

Website

Also Read:

తెలంగాణ జిల్లా కోర్టుల్లో 1904 ఖాళీలు - పోస్టులు, అర్హతల పూర్తి వివరాలు ఇలా!
తెలంగాణ హైకోర్టు  జిల్లా కోర్టులతో పాటు హైదరాబాద్‌లోని వివిధ న్యాయస్థానాల్లో ఖాళీగా ఉన్న పలు ఉద్యోగాల భర్తీకి 6 ప్రకటనలు జారీ చేసింది. వీటిద్వారా  మొత్తం 1,904 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఖాళీల్లో ఆఫీస్ సబార్డినేట్-1226, జూనియర్ అసిస్టెంట్-275,  ప్రాసెస్ సర్వర్-163, రికార్డ్ అసిస్టెంట్-97, ఫీల్డ్ అసిస్టెంట్-77, ఎగ్జామినర్-66 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి జనవరి 11న ప్రారంభమైంది. జనవరి 31 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. రాతపరీక్ష ద్వారా ఉద్యోగ ఎంపికలు చేపట్టనున్నారు.  

పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను ఫిబ్రవరి 15 నుంచి అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. ఆయా ఉద్యోగాలకు కంప్యూటర్ ఆధారిత పరీక్షను మార్చిలో నిర్వహించనున్నారు. పరీక్ష తేదీలను త్వరలో వెల్లడించనున్నారు. ఖాళీలు, అర్హతలు ఇతర వివరాల్లో అభ్యర్థులకు ఏమైనా సందేహాలుంటే నివృత్తికి హెల్ప్‌డెస్క్ ఫోన్ నెంబరు 040-23688394  ద్వారా లేదా ఈ-మెయిల్: tshc@telangana.gov.in ద్వారా సంప్రదించవచ్చు. పని దినాల్లో మాత్రమే హెల్ప్‌డెస్క్ అందుబాటులో ఉంటుంది.

Online Application

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
Elon Musk News: భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
Dogs Barasala: కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
Vasamsetti Subhash: తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లిపెర్త్ టెస్ట్‌లో లబుషేన్ తో కామెడీ చేసిన యశస్వి జైస్వాల్161 పరుగులతో దుమ్మురేపిన యశస్వి జైస్వాల్నిర్మల్‌లో బిగ్ అలర్ట్! అక్కడికి మళ్లీ పెద్దపులి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
Elon Musk News: భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
Dogs Barasala: కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
Vasamsetti Subhash: తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
Telangana News: ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
Comedian Ali: టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
Samantha: చైతూకి ఖరీదైన గిఫ్టుల కోసం బోలెడంత ఖర్చు చేసిన సమంత - మంట పెట్టిన బాలీవుడ్ హీరో ర్యాపిడ్ ఫైర్
చైతూకి ఖరీదైన గిఫ్టుల కోసం బోలెడంత ఖర్చు చేసిన సమంత - మంట పెట్టిన బాలీవుడ్ హీరో ర్యాపిడ్ ఫైర్
Crime News: 'అక్కా.. టీచర్ మా ఒంటిపై చేతులు వేస్తున్నారు' - గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌పై అవగాహనతో బట్టబయలైన కీచక టీచర్ నిర్వాకం
'అక్కా.. టీచర్ మా ఒంటిపై చేతులు వేస్తున్నారు' - గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌పై అవగాహనతో బట్టబయలైన కీచక టీచర్ నిర్వాకం
Embed widget