High Court Jobs: తెలంగాణ హైకోర్టులో 20 కోర్టు మాస్టర్ ఉద్యోగాలు, అర్హతలు ఇవే!
ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తుకు అర్హులు. ఇంగ్లిష్ టైపింగ్ తెలిసి ఉండాలి. ప్రభుత్వం నిర్వహించే టైపింగ్ టెక్నికల్ పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. జనవరి 21 నుంచి దరఖాస్తు ప్రారంభంకానుంది.
తెలంగాణ హైకోర్టులో కోర్టు మాస్టర్స్/ హైకోర్టు జడ్జిల వ్యక్తిగత కార్యదర్శి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా మొత్తం 20 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఖాళీల్లో ఓసీలకు 9 పోస్టులు, బీసీలకు 5 పోస్టులు, ఎస్సీలకు 2, ఎస్టీలకు 4 పోస్టులు కేటాయించారు. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఇంగ్లిష్ టైపింగ్ తెలిసి ఉండాలి. ప్రభుత్వం నిర్వహించే టెక్నికల్ పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. ఈ ఖాళీల భర్తీకి జనవరి 21 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఫిబ్రవరి 11 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మార్చిలో నిర్వహించే పరీక్షల ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లు ఫిబ్రవరి 20 నుంచి అందుబాటులో ఉండనున్నాయి.
పోస్టుల వివరాలు..
* హైకోర్టులో కోర్టు మాస్టర్స్/ హైకోర్టు జడ్జిల వ్యక్తిగత కార్యదర్శి
➥ ఖాళీల సంఖ్య: 20
అర్హతలు: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ (ఆర్ట్స్/సైన్స్/కామర్స్/లా) ఉత్తీర్ణులై ఉండాలి.
ఇతర అర్హతలు..
➥ ప్రభుత్వం నిర్వహించే టైపింగ్ టెక్నికల్ పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. నిమిషానికి 180 పదాలు టైప్ ఇంగ్లిష్ షార్ట్ పరీక్ష ఉత్తీర్ణత ఉండాలి, అలాగే ఇంగ్లిష్ షార్ట్ హ్యాండ్ 150 పదాలు టైప్ పరీక్ష పాసైనవారు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
➥ ప్రభుత్వం నిర్వహించే టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ (ఇంగ్లిష్- నిమిషానికి 45 పదాలు) పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 11.01.2023 నాటికి 18-34 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలపాటు వయోసడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు ఫీజు: రూ.600. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.400 చెల్లిస్తే సరిపోతుంది. ఆన్‌లైన్ ద్వారా మాత్రమే పరీక్ష ఫీజు చెల్లించాలి.
ఎంపిక విధానం: స్కిల్ టెస్ట్(షార్ట్‌హ్యాండ్), ఇంటర్వ్యూ, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా.
పరీక్ష విధానం..
➥ మొత్తం 100 మార్కులకు ఎంపిక విధానం ఉంటుంది. వీటిలో స్కిల్‌టెస్ట్ (టైపింగ్)కు 90 మార్కులు, ఇంటర్వ్యూకు 10 మార్కులు కేటాయిస్తారు. వీటిలో నుంచి 1:3 నిష్పత్తిలో ఎంపికచేసిన అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించి ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు.
➥అర్హత మార్కులను ఓసీలకు 45%, బీసీలకు 40%, ఎస్సీ-ఎస్టీలకు 35% గా నిర్ణయించారు.
జీతభత్యాలు: రూ.54,220 - రూ.1,33,630.
ముఖ్యమైన తేదీలు..
➥ నోటిఫికేషన్ల వెల్లడి: 11.01.2023.
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 21.01.2023.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 11.02.2023. (11.59 PM)
➥ పరీక్ష హాల్‌టికెట్ల డౌన్‌లోడ్: 20.02.2023.
➥ కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష తేది: మార్చిలో పరీక్ష నిర్వహిస్తారు.
Also Read:
1904 కోర్టు ఉద్యోగాల దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?
తెలంగాణ హైకోర్టు జిల్లా కోర్టులతో పాటు హైదరాబాద్‌లోని వివిధ న్యాయస్థానాల్లో ఖాళీగా ఉన్న పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడిన సంగతి తెలిసిందే. వీటిద్వారా మొత్తం 1,904 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఖాళీల్లో ఆఫీస్ సబార్డినేట్-1226, జూనియర్ అసిస్టెంట్-275, ప్రాసెస్ సర్వర్-163, రికార్డ్ అసిస్టెంట్-97, ఫీల్డ్ అసిస్టెంట్-77, ఎగ్జామినర్-66 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి జనవరి 11 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్న అభ్యర్థులు జనవరి 31 వరకు తమ దరఖాస్తులు సమర్పించవచ్చు. రాతపరీక్ష ద్వారా ఉద్యోగ ఎంపికలు చేపట్టనున్నారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
హైకోర్టులో 176 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు, జనవరి 21 నుంచి దరఖాస్తులు!
తెలంగాణ హైకోర్టులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడ్డాయి. మొత్తం 176 ఖాళీల భర్తీకి 9 నోటిఫికేషన్లను హైకోర్టు విడుదల చేసింది. వీటిలో హైకోర్టు సబార్డినేట్–50 పోస్టులు, సిస్టమ్ అసిస్టెంట్–45 పోస్టులు, ఎగ్జామినర్–17 పోస్టులు, అసిస్టెంట్–10 పోస్టులు, స్టెనో–2 పోస్టులు, అసిస్టెంట్ లైబ్రేరియన్–2 పోస్టులు, కంప్యూటర్ ఆపరేటర్–20 పోస్టులు, ట్రాన్స్‌లేటర్–10 పోస్టులు, కోర్టు మాస్టర్/ హైకోర్టు జడ్జిల వ్యక్తిగత కార్యదర్శులు–20 పోస్టులు ఉన్నాయి.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..