TS Court Jobs: 1904 కోర్టు ఉద్యోగాల దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?
ఈ పోస్టుల భర్తీకి జనవరి 11 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్న అభ్యర్థులు జనవరి 31 వరకు తమ దరఖాస్తులు సమర్పించవచ్చు.
![TS Court Jobs: 1904 కోర్టు ఉద్యోగాల దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే? ts high court activated online application link for the posts of junior assistant, field assistant, examiner, record assistant, process server and office subordinate, apply now TS Court Jobs: 1904 కోర్టు ఉద్యోగాల దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/12/96c18b2d21a48ba6654c3f2852785c981673509098177522_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
తెలంగాణ హైకోర్టు జిల్లా కోర్టులతో పాటు హైదరాబాద్‌లోని వివిధ న్యాయస్థానాల్లో ఖాళీగా ఉన్న పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడిన సంగతి తెలిసిందే. వీటిద్వారా మొత్తం 1,904 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఖాళీల్లో ఆఫీస్ సబార్డినేట్-1226, జూనియర్ అసిస్టెంట్-275, ప్రాసెస్ సర్వర్-163, రికార్డ్ అసిస్టెంట్-97, ఫీల్డ్ అసిస్టెంట్-77, ఎగ్జామినర్-66 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి జనవరి 11 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్న అభ్యర్థులు జనవరి 31 వరకు తమ దరఖాస్తులు సమర్పించవచ్చు. రాతపరీక్ష ద్వారా ఉద్యోగ ఎంపికలు చేపట్టనున్నారు.
పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లు ఫిబ్రవరి 15న వెలువనున్నాయి. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచనున్నారు. ఆయా ఉద్యోగాలకు కంప్యూటర్ ఆధారిత పరీక్షను మార్చిలో నిర్వహిస్తారు. పరీక్ష తేదీలను త్వరలో వెల్లడించనున్నారు. ఖాళీలు, అర్హతలు ఇతర వివరాల్లో అభ్యర్థులకు ఏమైనా సందేహాలుంటే నివృత్తికి హెల్ప్‌డెస్క్ ఫోన్ నెంబరు 040-23688394 ద్వారా లేదా ఈ-మెయిల్: tshc@telangana.gov.in ద్వారా సంప్రదించవచ్చు. పని దినాల్లో మాత్రమే హెల్ప్‌డెస్క్ అందుబాటులో ఉంటుంది.
Court Jobs - Online Application Link
పోస్టుల వివరాలు ఇలా...
తెలంగాణ జిల్లా కోర్టుల్లో 1226 ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు
తెలంగాణ రాష్ట్ర హైకోర్టు తెలంగాణ జ్యుడీషియల్ మినిస్టీరియల్& సబార్డినేట్ సర్వీసులో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది. దీని ద్వారా మొత్తం 1,226 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏడో తరగతి నుంచి పదో తరగతి మధ్య ఏదైనా పరీక్ష లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణత కలిగి ఉండాలి. పదో తరగతి కంటే ఎక్కువ విద్యార్హత కలిగిన అభ్యర్థులు అనర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తుచేసుకోవాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
తెలంగాణ జిల్లా కోర్టుల్లో 275 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు
తెలంగాణ రాష్ట్ర హైకోర్టు తెలంగాణ జ్యుడీషియల్ మినిస్టీరియల్ & సబార్డినేట్ సర్వీసులో జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది. దీనిద్వారా వివిధ జిల్లా కోర్టుల్లో మొత్తం 275 పోస్టులను భర్తీ చేయనున్నారు. డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాతపరీక్ష ద్వారా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
తెలంగాణ జిల్లా కోర్టుల్లో 163 ప్రాసెస్ సర్వర్ పోస్టులు
తెలంగాణ రాష్ట్ర హైకోర్టు తెలంగాణ జ్యుడీషియల్ మినిస్టీరియల్ & సబార్డినేట్ సర్వీసులో ప్రాసెస్ సర్వర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది. దీనిద్వారా వివిధ జిల్లా కోర్టుల్లో మొత్తం 163 పోస్టులను భర్తీ చేయనున్నారు. పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. స్థానిక భాషపై పట్టు ఉండాలి. రాతపరీక్ష ద్వారా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
తెలంగాణ జిల్లా కోర్టుల్లో 97 రికార్డ్ అసిస్టెంట్ పోస్టులు
తెలంగాణ రాష్ట్ర హైకోర్టు తెలంగాణ జ్యుడీషియల్ మినిస్టీరియల్ & సబార్డినేట్ సర్వీసులో రికార్డ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది. దీనిద్వారా వివిధ జిల్లా కోర్టుల్లో మొత్తం 97 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాతపరీక్ష ద్వారా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
తెలంగాణ జిల్లా కోర్టుల్లో 77 ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు
తెలంగాణ రాష్ట్ర హైకోర్టు తెలంగాణ జ్యుడీషియల్ మినిస్టీరియల్ & సబార్డినేట్ సర్వీసులో ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది. దీనిద్వారా వివిధ జిల్లా కోర్టుల్లో మొత్తం 77 పోస్టులను భర్తీ చేయనున్నారు. డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాతపరీక్ష ద్వారా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
తెలంగాణ జిల్లా కోర్టుల్లో 66 ఎగ్జామినర్ పోస్టులు
తెలంగాణ రాష్ట్ర హైకోర్టు తెలంగాణ జ్యుడీషియల్ మినిస్టీరియల్ & సబార్డినేట్ సర్వీసులో ఎగ్జామినర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది. దీనిద్వారా వివిధ జిల్లా కోర్టుల్లో మొత్తం 66 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇంటర్మీడియట్ లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాతపరీక్ష ద్వారా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)