News
News
X

TS High Court Recruitment: తెలంగాణ జిల్లా కోర్టుల్లో 77 ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు, అర్హతలివే!

డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు జనవరి 11 నుంచి 31 వరకు ఆన్‌‌లైన్ విధానంలో తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రాతపరీక్ష ద్వారా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.

FOLLOW US: 
Share:

తెలంగాణ రాష్ట్ర హైకోర్టు తెలంగాణ జ్యుడీషియల్ మినిస్టీరియల్ & సబార్డినేట్ సర్వీసులో ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది. దీనిద్వారా వివిధ జిల్లా కోర్టుల్లో మొత్తం 77 పోస్టులను భర్తీ చేయనున్నారు. డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్న అభ్యర్థులు జనవరి 11 నుంచి 31 వరకు ఆన్‌‌లైన్ విధానంలో తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రాతపరీక్ష ద్వారా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.

వివరాలు..

★ ఫీల్డ్ అసిస్టెంట్  పోస్టులు 

మొత్తం ఖాళీలు: 77

జిల్లాల వారీగా ఖాళీలు..  

➥ భద్రాద్రి కొత్తగూడెం: 05     

➥ కోర్టు ఆఫ్ ద ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జి ఫర్ సీబీఐ కేసెస్, హై దరాబాద్:  01     

➥ సిటీ సివిల్ కోర్టు, హైదరాబాద్: 11     

➥ జోగులాంబ గద్వాల: 03     

➥ జగిత్యాల: 05     

➥ జయశంకర్ భూపాలపల్లి: 04     

➥ కామారెడ్డి: 02    

➥ కుమ్రం భీం ఆసిఫాబాద్: 01     

➥ మంచిర్యాల: 04     

➥ మేడ్చల్-మల్కాజిగిరి: 07     

➥ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు, హైదరాబాద్: 01     

➥ ములుగు: 01     

➥ నాగర్ కర్నూలు: 03

➥ నారాయణపేట: 03

➥ పెద్దపల్లి: 02

➥ రాజన్న సిరిసిల్ల: 02

➥ రంగారెడ్డి: 10

➥ సిద్దిపేట: 04

➥ సూర్యాపేట: 03

➥ వికారాబాద్: 02

➥ వనపర్తి: 01

➥ యాదాద్రి భువనగిరి: 02

అర్హత: బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమాన ఉత్తీర్ణతతో పాటు స్థానిక భాషలు తెలిసి ఉండాలి. నిర్ణీత విద్య, సాంకేతిక అర్హతల కంటే ఎక్కువ అర్హత ఉన్న అభ్యర్థులు, ధ్రువపత్రాల పరిశీలన సమయంలో సంబంధిత పత్రాలను అందజేయాలి.

వయోపరిమితి:  01.07.2022 నాటికి 18-34 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాల వయో సడలింపు వర్తిస్తుంది. 

జీత భత్యాలు:  నెలకు రూ.24,280-రూ.72,850 చెల్లిస్తారు..

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుచేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: రూ.600. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.400 చెల్లిస్తే సరిపోతుంది.

ఎంపిక విధానం: సీబీటీ లేదా ఓఎంఆర్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

పరీక్ష విధానం: మొత్తం 100 మార్కులకు  కంప్యూటర్ ఆధారిత పరీక్ష(సీబీటీ)/ ఓఎంఆర్ విధానంలో రాత పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 100 ప్రశ్నలుంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు. వీటిలో జనరల్ నాలెడ్జ్- 60 ప్రశ్నలు-60 మార్కులు, జనరల్ ఇంగ్లిష్- 40 ప్రశ్నలు-40 మార్కులు ఉంటాయి. పరీక్ష వ్యవధి 2 గంటలు.

ముఖ్యమైన తేదీలు..

🔰 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 11.01.2023.

🔰 ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 31.01.2023.

🔰 హాల్‌టికెట్ డౌన్‌లోడ్ ప్రారంభ తేదీ: 15.02.2023.

🔰 కంప్యూటర్ ఆధారిత పరీక్ష తేదీ: 2023, మార్చిలో,

Notification

Website

Also Read:

తెలంగాణ జిల్లా కోర్టుల్లో 1226 ఆఫీస్ సబార్డినేట్ ఖాళీలు, అర్హతలివే!
తెలంగాణ రాష్ట్ర హైకోర్టు తెలంగాణ జ్యుడీషియల్ మినిస్టీరియల్& సబార్డినేట్ సర్వీసులో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది. దీని ద్వారా మొత్తం 1,226 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏడో తరగతి నుంచి పదో తరగతి మధ్య ఏదైనా పరీక్ష లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణత కలిగి ఉండాలి. పదో తరగతి కంటే ఎక్కువ విద్యార్హత కలిగిన అభ్యర్థులు అనర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో  జనవరి 11 నుంచి 31వ తేదీ లోగా దరఖాస్తుచేసుకోవాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్ పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

తెలంగాణ జిల్లా కోర్టుల్లో 275 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, అర్హతలివే!
తెలంగాణ రాష్ట్ర హైకోర్టు తెలంగాణ జ్యుడీషియల్ మినిస్టీరియల్ & సబార్డినేట్ సర్వీసులో జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది. దీనిద్వారా వివిధ జిల్లా కోర్టుల్లో మొత్తం 275 పోస్టులను భర్తీ చేయనున్నారు. డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్న అభ్యర్థులు జనవరి 11 నుంచి 31 వరకు ఆన్‌‌లైన్ విధానంలో తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రాతపరీక్ష ద్వారా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

Published at : 04 Jan 2023 10:08 PM (IST) Tags: TS High Court Recruitment TS High Court TS High Court Notification TS District Courts Jobs Filed Assistant Posts

సంబంధిత కథనాలు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంచారా!

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంచారా!

APPSC Mains Exam Schedule: 'గ్రూప్-1' మెయిన్స్ షెడ్యూలు విడుదల, ఏ పరీక్ష ఎప్పుడంటే?

APPSC Mains Exam Schedule: 'గ్రూప్-1' మెయిన్స్ షెడ్యూలు విడుదల, ఏ పరీక్ష ఎప్పుడంటే?

APPSC Group1 Prelims Results: గ్రూప్-1 ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే! మెయిన్స్‌కు 6,455 మంది ఎంపిక!

APPSC Group1 Prelims Results: గ్రూప్-1 ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే! మెయిన్స్‌కు 6,455 మంది ఎంపిక!

Post Office Jobs: పోస్టాఫీసుల్లో కొలువుల జాతర, 40 వేలకుపైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెల్లడి! తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?

Post Office Jobs: పోస్టాఫీసుల్లో కొలువుల జాతర, 40 వేలకుపైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెల్లడి! తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?

NLC Apprenticeship: నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్‌లో 626 అప్రెంటిస్ ఖాళీలు, అర్హతలివే!

NLC Apprenticeship: నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్‌లో 626 అప్రెంటిస్ ఖాళీలు, అర్హతలివే!

టాప్ స్టోరీస్

Nizamabad News KTR : దేశానికి బీజేపీ చేసిందేమీ లేదు - ఎన్నికలకు ఎప్పుడయినా రావొచ్చన్న కేటీఆర్ !

Nizamabad News KTR : దేశానికి బీజేపీ చేసిందేమీ లేదు - ఎన్నికలకు ఎప్పుడయినా రావొచ్చన్న కేటీఆర్ !

CBI Case Avinash Reddy : సీబీఐ ఎదుట హాజరైన అవినాష్ రెడ్డి - ముందుగా వైఎస్ విజయలక్ష్మితోనూ భేటీ !

CBI Case Avinash Reddy :  సీబీఐ ఎదుట హాజరైన అవినాష్ రెడ్డి - ముందుగా వైఎస్ విజయలక్ష్మితోనూ భేటీ !

Minister Harish Rao : వరంగల్ హెల్త్ సిటీ దేశానికే ఒక మోడల్, దసరా నాటికి నిర్మాణం పూర్తి- మంత్రి హరీశ్ రావు

Minister Harish Rao :  వరంగల్ హెల్త్ సిటీ దేశానికే ఒక మోడల్, దసరా నాటికి నిర్మాణం పూర్తి- మంత్రి హరీశ్ రావు

Mylavaram Politics : మైలవరంలో వసంత సైలెంట్ అయ్యారా? సైలెంట్ గా వర్క్ చేస్తున్నారా?

Mylavaram Politics : మైలవరంలో వసంత సైలెంట్ అయ్యారా? సైలెంట్ గా వర్క్ చేస్తున్నారా?