అన్వేషించండి

High Court Jobs: తెలంగాణ హైకోర్టులో 20 కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు, అర్హతలు ఇవే!

ఏదైనా డిగ్రీతోపాటు టైపింగ్(హయ్యర్‌గ్రేడ్) సర్టిఫికేట్ ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు జనవరి 21 నుంచి ఫిబ్రవరి 11 వరకు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

తెలంగాణ హైకోర్టు కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 20 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఖాళీల్లో ఓసీలకు 10, బీసీలకు 6, ఎస్సీలకు 3, ఎస్టీలకు 1 పోస్టు కేటాయించారు. ఏదైనా డిగ్రీతోపాటు టైపింగ్(హయ్యర్‌గ్రేడ్) సర్టిఫికేట్ ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు ఉన్న అభ్యర్థులు జనవరి 21 నుంచి ఫిబ్రవరి 11 వరకు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, టైపింగ్ టెస్ట్ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. 

పోస్టుల వివరాలు..

* కంప్యూటర్ ఆపరేటర్: 20 పోస్టులు

అర్హతలు: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ (ఆర్ట్స్/సైన్స్/కామర్స్/లా) ఉత్తీర్ణులై ఉండాలి. 

ఇతర అర్హతలు.. 

➥ టైపింగ్ రైటింగ్(హయ్యర్ గ్రేడ్) పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. ఇంగ్లిష్‌లో నిమిషానికి 45 పదాలు టైప్ చేయగలగాలి. 

➥ ఏడాది పీజీడిప్లొమా-కంప్యూటర్ ప్రోగ్రామింగ్/కంప్యూటర్ అప్లికేషన్స్ కోర్సు చేసి ఉండాలి. లేదా బీసీఏ డిగ్రీ కలిగి ఉండాలి.

వయోపరిమితి: 11.01.2023 నాటికి 18-34 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలపాటు వయోసడలింపు వర్తిస్తుంది. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

దరఖాస్తు ఫీజు: రూ.600. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.400 చెల్లిస్తే సరిపోతుంది. ఆన్‌లైన్ ద్వారా మాత్రమే పరీక్ష ఫీజు చెల్లించాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష, టైపింగ్ టెస్ట్, ఇంటర్వూ, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా.

పరీక్ష విధానం..

➥ మొత్తం 100 మార్కులకు ఎంపిక విధానం ఉంటుంది. వీటిలో రాతపరీక్షకు 50 మార్కులు, టైపింగ్ టెస్ట్‌కు 40 మార్కులు, వైవా-వాయిస్‌కు 10 మార్కులు కేటాయిస్తారు. వీటిలో నుంచి 1:3 నిష్పత్తిలో అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించి ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు.

➥ మొత్తం 50 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 50 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు. ఇందులో జనరల్ నాలెడ్జ్ నుంచి 25 ప్రశ్నలు-25 మార్కులు, కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి 25 ప్రశ్నలు-25 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 60 నిమిషాలు.

➥ మొత్తం 40 మార్కులకు టైపింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. 

➥ అర్హత మార్కులను ఓసీలకు 45%, బీసీలకు 40%, ఎస్సీ-ఎస్టీలకు 35% గా నిర్ణయించారు.  

జీతభత్యాలు: రూ.38,890 - రూ.1,12,510. 

ముఖ్యమైన తేదీలు..

➥ నోటిఫికేషన్ వెల్లడి: 11.01.2023.

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 21.01.2023.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 11.02.2023. (11.59 PM)

➥ పరీక్ష హాల్‌టికెట్ల డౌన్‌లోడ్: 20.02.2023.

➥  కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష తేది: మార్చిలో పరీక్ష నిర్వహిస్తారు.

Notification

Website 

Also Read:

 తెలంగాణ హైకోర్టులో ట్రాన్స్‌లేటర్ ఉద్యోగాలు, అర్హతలు ఇవే!
తెలంగాణ హైకోర్టు ట్రాన్స్‌లేటర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 10 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో 8 పోస్టులు తెలుగు ట్రాన్స్‌లేటర్ పోస్టులు కాగా, 2 ఉర్దూ ట్రాన్స్‌లేటర్ పోస్టులు ఉన్నాయి. ఖాళీల్లో ఓసీలకు 3 పోస్టులు, బీసీలకు 2 పోస్టులు, ఎస్సీలకు 2, ఎస్టీలకు 1 పోస్టు కేటాయించారు. మూడేళ్లు లేదా ఐదేళ్ల లా డిగ్రీ అర్హతతోపాటు సంబంధిత విభాగంలో డిప్లొమా లేదా సర్టిఫికేట్ కోర్సు అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు జనవరి 21 నుంచి ఫిబ్రవరి 11 వరకు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

తెలంగాణ హైకోర్టులో 20 కోర్టు మాస్టర్ ఉద్యోగాలు, అర్హతలు ఇవే!
తెలంగాణ హైకోర్టులో కోర్టు మాస్టర్స్/ హైకోర్టు జడ్జిల వ్యక్తిగత కార్యదర్శి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఇంగ్లిష్ టైపింగ్ తెలిసి ఉండాలి. ప్రభుత్వం నిర్వహించే టెక్నికల్ పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. ఈ ఖాళీల భర్తీకి జనవరి 21 నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఫిబ్రవరి 11 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మార్చిలో నిర్వహించే పరీక్షల ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లు ఫిబ్రవరి 20 నుంచి అందుబాటులో ఉండనున్నాయి. 
నోటిఫికేషన్, ఎంపిక వివరాల కోసం క్లిక్ చేయండి.. 

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu with Bloomberg: త్వరలో మోదీ కేబినెట్‌లోకి చంద్రబాబు - బ్లూమ్‌బెర్గ్ డౌట్ - సీఎం రియాక్షన్ ఏమిటంటే ?
త్వరలో మోదీ కేబినెట్‌లోకి చంద్రబాబు - బ్లూమ్‌బెర్గ్ డౌట్ - సీఎం రియాక్షన్ ఏమిటంటే ?
Tollywood IT Raids: టాలీవుడ్ డబ్బు గోడౌన్లన్నీ గుర్తించేసిన ఐటీ - ఇండస్ట్రీలోని వ్యక్తులే సమాచారం ఇచ్చారా ?
టాలీవుడ్ డబ్బు గోడౌన్లన్నీ గుర్తించేసిన ఐటీ - ఇండస్ట్రీలోని వ్యక్తులే సమాచారం ఇచ్చారా ?
New Income Tax Bill: కొత్త ఆదాయ పన్ను చట్టంతో సామాన్యుడికి ఒరిగేది ఏంటి? - ఎలాంటి మార్పులు వస్తాయి!
కొత్త ఆదాయ పన్ను చట్టంతో సామాన్యుడికి ఒరిగేది ఏంటి? - ఎలాంటి మార్పులు వస్తాయి!
Viral News: అండర్‌వేర్‌లో సిగరెట్ లైటర్స్ - శంషాబాద్‌లో ఎయిర్‌పోర్టులో మహిళ అరెస్ట్ - వాటితో ఏం చేయాలనుకుంది ?
అండర్‌వేర్‌లో సిగరెట్ లైటర్స్ - శంషాబాద్‌లో ఎయిర్‌పోర్టులో మహిళ అరెస్ట్ - వాటితో ఏం చేయాలనుకుంది ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Electric Wires Falling Down Baby Incident | అల్లవరం మండలంలో ప్రాణాలకే ప్రమాదంగా మారిన విద్యుత్ వైర్లు | ABP DesamGautam Adani Maha Kumbh Mela 2025 | ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళాలో పాల్గొన్న అదానీ | ABP DesamJawan Karthik Passed Away | కశ్మీర్ లో ఉగ్రదాడి...కాల్పుల్లో తెలుగు జవాన్ మృతి | ABP DesamSaif Ali Khan Discharged From Hospital | ఐదురోజుల తర్వాత ఇంటికి వచ్చిన సైఫ్ అలీఖాన్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu with Bloomberg: త్వరలో మోదీ కేబినెట్‌లోకి చంద్రబాబు - బ్లూమ్‌బెర్గ్ డౌట్ - సీఎం రియాక్షన్ ఏమిటంటే ?
త్వరలో మోదీ కేబినెట్‌లోకి చంద్రబాబు - బ్లూమ్‌బెర్గ్ డౌట్ - సీఎం రియాక్షన్ ఏమిటంటే ?
Tollywood IT Raids: టాలీవుడ్ డబ్బు గోడౌన్లన్నీ గుర్తించేసిన ఐటీ - ఇండస్ట్రీలోని వ్యక్తులే సమాచారం ఇచ్చారా ?
టాలీవుడ్ డబ్బు గోడౌన్లన్నీ గుర్తించేసిన ఐటీ - ఇండస్ట్రీలోని వ్యక్తులే సమాచారం ఇచ్చారా ?
New Income Tax Bill: కొత్త ఆదాయ పన్ను చట్టంతో సామాన్యుడికి ఒరిగేది ఏంటి? - ఎలాంటి మార్పులు వస్తాయి!
కొత్త ఆదాయ పన్ను చట్టంతో సామాన్యుడికి ఒరిగేది ఏంటి? - ఎలాంటి మార్పులు వస్తాయి!
Viral News: అండర్‌వేర్‌లో సిగరెట్ లైటర్స్ - శంషాబాద్‌లో ఎయిర్‌పోర్టులో మహిళ అరెస్ట్ - వాటితో ఏం చేయాలనుకుంది ?
అండర్‌వేర్‌లో సిగరెట్ లైటర్స్ - శంషాబాద్‌లో ఎయిర్‌పోర్టులో మహిళ అరెస్ట్ - వాటితో ఏం చేయాలనుకుంది ?
Monalisa: మహా కుంభమేళా ఫేమ్ మోనాలిసాకు బంపర్ ఆఫర్... స్టార్ డైరెక్టర్ సినిమాలో ఛాన్స్
మహా కుంభమేళా ఫేమ్ మోనాలిసాకు బంపర్ ఆఫర్... స్టార్ డైరెక్టర్ సినిమాలో ఛాన్స్
Hyderabad Data Center: హైదరాబాద్ లో ఏఐ డేటా సెంటర్ క్లస్టర్, రూ.10 వేల కోట్ల పెట్టుబడులకు కంట్రోల్ ఎస్ ఒప్పందం
హైదరాబాద్ లో ఏఐ డేటా సెంటర్ క్లస్టర్, రూ.10 వేల కోట్ల పెట్టుబడులకు కంట్రోల్ ఎస్ ఒప్పందం
Tax Saving Schemes: పన్ను బాధ్యత తగ్గించే బెస్ట్‌ ఆప్షన్స్‌ ELSS, NPS - ఏమిటి వీటి గొప్ప?
పన్ను బాధ్యత తగ్గించే బెస్ట్‌ ఆప్షన్స్‌ ELSS, NPS - ఏమిటి వీటి గొప్ప?
Donald Trump: 'అమెరికాకు సమర్థులు రావాలని కోరుకుంటున్నా' - హెచ్ 1బీ వీసాలపై అధ్యక్షుడు ట్రంప్​ కీలక వ్యాఖ్యలు
'అమెరికాకు సమర్థులు రావాలని కోరుకుంటున్నా' - హెచ్ 1బీ వీసాలపై అధ్యక్షుడు ట్రంప్​ కీలక వ్యాఖ్యలు
Embed widget