News
News
X

High Court Jobs: తెలంగాణ హైకోర్టులో ట్రాన్స్‌లేటర్ ఉద్యోగాలు, అర్హతలు ఇవే!

మూడేళ్లు లేదా ఐదేళ్ల లా డిగ్రీ అర్హతతోపాటు సంబంధిత విభాగంలో డిప్లొమా లేదా సర్టిఫికేట్ కోర్సు అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు జనవరి 21 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు.

FOLLOW US: 
Share:

తెలంగాణ హైకోర్టు ట్రాన్స్‌లేటర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 10 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో 8 పోస్టులు తెలుగు ట్రాన్స్‌లేటర్ పోస్టులు కాగా, 2 ఉర్దూ ట్రాన్స్‌లేటర్ పోస్టులు ఉన్నాయి. ఖాళీల్లో ఓసీలకు 3 పోస్టులు, బీసీలకు 2 పోస్టులు, ఎస్సీలకు 2, ఎస్టీలకు 1 పోస్టు కేటాయించారు. మూడేళ్లు లేదా ఐదేళ్ల లా డిగ్రీ అర్హతతోపాటు సంబంధిత విభాగంలో డిప్లొమా లేదా సర్టిఫికేట్ కోర్సు అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు జనవరి 21 నుంచి ఫిబ్రవరి 11 వరకు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. 

పోస్టుల వివరాలు..

* ట్రాన్స్‌లేటర్ పోస్టులు

ఖాళీల సంఖ్య: 10

1) తెలుగు ట్రాన్స్‌లేటర్: 8 పోస్టులు

2) ఉర్దూ ట్రాన్స్‌లేటర్: 2 పోస్టులు 

అర్హతలు: మూడేళ్లు లేదా ఐదేళ్ల లా డిగ్రీ ఉండాలి. తెలుగు ట్రాన్స్‌లేటర్ పోస్టులకు తెలుగు నుంచి ఇంగ్లిష్, ఇంగ్లిష్ నుంచి తెలుగులోని అనువాదం చేయగలగాలి. అదేవిధంగా ఉర్దూ ట్రాన్స్‌లేటర్ పోస్టులకు ఉర్దూ నుంచి ఇంగ్లిష్, ఇంగ్లిష్ నుంచి ఉర్దూలోని అనువాదం చేయగలగాలి. 

అనుభవం: అనువాదంలో 2 సంవత్సరాల అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 11.01.2023 నాటికి 18-34 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలపాటు వయోసడలింపు వర్తిస్తుంది. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

దరఖాస్తు ఫీజు: రూ.600. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.400 చెల్లిస్తే సరిపోతుంది. ఆన్‌లైన్ ద్వారా మాత్రమే పరీక్ష ఫీజు చెల్లించాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ట్రాన్స్‌లేషన్ టెస్ట్, ఇంటర్వూ, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా.

పరీక్ష విధానం..

➥ మొత్తం 100 మార్కులకు ఎంపిక విధానం ఉంటుంది. వీటిలో రాతపరీక్షకు 50 మార్కులు, స్కిల్ టెస్ట్‌కు 40 మార్కులు, వైవా-వాయిస్‌కు 10 మార్కులు కేటాయిస్తారు. వీటిలో నుంచి 1:3 నిష్పత్తిలో ఎంపికచేసిన అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించి ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు.

➥ మొత్తం 50 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 50 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు. ఇందులో జనరల్ నాలెడ్జ్ నుంచి 30 ప్రశ్నలు-30 మార్కులు, జనరల్ ఇంగ్లిష్ నుంచి 20 ప్రశ్నలు-20 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 60 నిమిషాలు.

➥ మొత్తం 40 మార్కులకు ట్రాన్స్‌లేషన్ టెస్ట్ నిర్వహిస్తారు. ఏదైనా ప్యాసేజీలు ఇచ్చి తెలుగు/ఉర్దూ నుంచి ఇంగ్లిష్‌లోకి, ఇంగ్లిష్ నుంచి తెలుగు/ఉర్దూలోకి అనువాదం చేయాలని అడుగుతారు.

➥ అర్హత మార్కులను ఓసీలకు 45%, బీసీలకు 40%, ఎస్సీ-ఎస్టీలకు 35% గా నిర్ణయించారు.  

జీతభత్యాలు: రూ.42,300 - రూ.1,15,270.

ముఖ్యమైన తేదీలు..

➥ నోటిఫికేషన్ల వెల్లడి: 11.01.2023.

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 21.01.2023.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 11.02.2023. (11.59 PM)

➥ పరీక్ష హాల్‌టికెట్ల డౌన్‌లోడ్: 20.02.2023.

➥  కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష తేది: మార్చిలో పరీక్ష నిర్వహిస్తారు.

Notification

Website 

Also Read:

తెలంగాణ హైకోర్టులో 20 కోర్టు మాస్టర్ ఉద్యోగాలు, అర్హతలు ఇవే!
తెలంగాణ హైకోర్టులో కోర్టు మాస్టర్స్/ హైకోర్టు జడ్జిల వ్యక్తిగత కార్యదర్శి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఇంగ్లిష్ టైపింగ్ తెలిసి ఉండాలి. ప్రభుత్వం నిర్వహించే టెక్నికల్ పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. ఈ ఖాళీల భర్తీకి జనవరి 21 నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఫిబ్రవరి 11 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మార్చిలో నిర్వహించే పరీక్షల ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లు ఫిబ్రవరి 20 నుంచి అందుబాటులో ఉండనున్నాయి. 
నోటిఫికేషన్, ఎంపిక వివరాల కోసం క్లిక్ చేయండి..

1904 కోర్టు ఉద్యోగాల దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?
తెలంగాణ హైకోర్టు  జిల్లా కోర్టులతో పాటు హైదరాబాద్‌లోని వివిధ న్యాయస్థానాల్లో ఖాళీగా ఉన్న పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడిన సంగతి తెలిసిందే. వీటిద్వారా  మొత్తం 1,904 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఖాళీల్లో ఆఫీస్ సబార్డినేట్-1226, జూనియర్ అసిస్టెంట్-275,  ప్రాసెస్ సర్వర్-163, రికార్డ్ అసిస్టెంట్-97, ఫీల్డ్ అసిస్టెంట్-77, ఎగ్జామినర్-66 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి జనవరి 11 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.  పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్న అభ్యర్థులు జనవరి 31 వరకు తమ దరఖాస్తులు సమర్పించవచ్చు. రాతపరీక్ష ద్వారా ఉద్యోగ ఎంపికలు చేపట్టనున్నారు.  
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

Published at : 13 Jan 2023 12:30 PM (IST) Tags: High Court Jobs TS High Court Recruitment Court Jobs in Telangana Telangana High Court Jobs Translator Posts

సంబంధిత కథనాలు

TSPSC HWO Recuitment: 581 ఉద్యోగాల దరఖాస్తుకు ఫిబ్రవరి 3 వరకు అవకాశం, వెంటనే అప్లయ్ చేసుకోండి!

TSPSC HWO Recuitment: 581 ఉద్యోగాల దరఖాస్తుకు ఫిబ్రవరి 3 వరకు అవకాశం, వెంటనే అప్లయ్ చేసుకోండి!

RRB Group D DV: ఫిబ్రవరి 7 నుంచి గ్రూప్‌-డి అభ్యర్థులకు ధ్రువపత్రాల పరిశీలన!

RRB Group D DV: ఫిబ్రవరి 7 నుంచి గ్రూప్‌-డి అభ్యర్థులకు ధ్రువపత్రాల పరిశీలన!

TSPSC Group4 Application: 'గ్రూప్-4' ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్, దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?

TSPSC Group4 Application: 'గ్రూప్-4' ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్, దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?

TSPSC Group4 Application: 8180 'గ్రూప్-4' ఉద్యోగాల దరఖాస్తుకు నేడే ఆఖరు, ఇప్పటికే 8 లక్షలు దాటిన దరఖాస్తుల సంఖ్య!

TSPSC Group4 Application: 8180 'గ్రూప్-4' ఉద్యోగాల దరఖాస్తుకు నేడే ఆఖరు, ఇప్పటికే 8 లక్షలు దాటిన దరఖాస్తుల సంఖ్య!

Gujarat Junior Clerk Exam Cancel: హైదరాబాద్‌లో పేపర్ లీకేజీ కలకలం, జూనియర్ క్లర్క్ ఎగ్జామ్ రద్దు చేస్తూ కీలక నిర్ణయం

Gujarat Junior Clerk Exam Cancel: హైదరాబాద్‌లో పేపర్ లీకేజీ కలకలం, జూనియర్ క్లర్క్ ఎగ్జామ్ రద్దు చేస్తూ కీలక నిర్ణయం

టాప్ స్టోరీస్

MLA Kotamreddy: క్లైమాక్స్ కి చేరిన ఎమ్మెల్యే కోటంరెడ్డి ఎపిసోడ్ - వైసీపీకి గుడ్ బై చెప్పేస్తారా !

MLA Kotamreddy: క్లైమాక్స్ కి చేరిన ఎమ్మెల్యే కోటంరెడ్డి ఎపిసోడ్ - వైసీపీకి గుడ్ బై చెప్పేస్తారా !

Taraka Ratna Health: తారకరత్నకు ప్రమాదం లేదు - మంచి మాట చెప్పిన చిరంజీవి

Taraka Ratna Health: తారకరత్నకు ప్రమాదం లేదు - మంచి మాట చెప్పిన చిరంజీవి

RRR Awards : ఆస్కార్ బరిలో సినిమాలను కాదని 'ఆర్ఆర్ఆర్'కు ఓటేసిన ఆడియన్స్

RRR Awards : ఆస్కార్ బరిలో సినిమాలను కాదని 'ఆర్ఆర్ఆర్'కు ఓటేసిన ఆడియన్స్

Samantha : సమంతకు అండగా దర్శకుడు - అవన్నీ పుకార్లే

Samantha : సమంతకు అండగా దర్శకుడు - అవన్నీ పుకార్లే