అన్వేషించండి

మారుతికి టెన్షన్.. త్వరలో మార్కెట్లోకి Renault, Nissan కొత్త SUV లు.. ఫీచర్లు చూసి డిసైడవ్వాలి

Renault, Nissan 2026లో Duster , Tekton అనే రెండు కొత్త SUVలను భారత మార్కెట్లోకి విడుదల చేయనున్నాయి. 1.3L టర్బో పెట్రోల్ ఇంజిన్, CMF-B ప్లాట్‌ఫారమ్‌తో వస్తాయి.

భారతదేశంలో మిడ్ సైజ్ SUV మార్కెట్ చాలా వేగంగా పెరుగుతోంది. ఇప్పటికే దాదాపు 13 మోడల్స్ విక్రయాలు జరుపుకుంటున్నాయి. టాటా మోటార్స్ తన కొత్త టాటా సియెర్రాను ప్రారంభించింది. అయితే మారుతి సుజుకి గ్రాండ్ విటారా తర్వాత విక్టోరిస్ కూడా ప్రవేశపెట్టింది. ఇప్పుడు, రెనాల్ట్, నిస్సాన్ కూడా మధ్య సైజ్ ఎస్‌యూవీ విభాగంలో తమ కొత్త మోడల్స్ తీసుకురావడానికి సిద్ధమవుతున్నాయి. రెండు కంపెనీలు 2026లో రెండు కొత్త SUVలను మార్కెట్లోకి విడుదల చేస్తాయి. వాటి రాకతో, ఇప్పటికే ఉన్న బ్రాండ్లు, ముఖ్యంగా చెప్పాలంటే మారుతి సుజుకిపై ఒత్తిడి పెరగవచ్చు.

కొత్త తరం రెనాల్ట్ డస్టర్ 2026లో మార్కెట్లోకి

రెనాల్ట్ కొత్త తరం డస్టర్ జనవరి 26, 2026న భారత మార్కెట్లో లాంచ్ అవుతుందని ధృవీకరించింది. 3వ తరం డస్టర్ డిజైన్ గ్లోబల్ మోడల్‌ను పోలి ఉంటుంది. అయితే భారత రోడ్లకు అనుగుణంగా కొన్ని స్థానిక మార్పులు చేయవచ్చు. ఈ SUV CMF-B ప్లాట్ఫారమ్ మీద రూపొందించారు. దాదాపు 4,360 mm పొడవు, 2,673 mm వీల్ బేస్‌తో వస్తుంది. భారతదేశంలో పాత డస్టర్ ప్రజాదరణకు ప్రధాన కారణం దాని డీజిల్ ఇంజిన్ అని చెప్పవచ్చు. అయితే కొత్త డస్టర్ మోడల్స్‌లో డీజిల్ ఆప్షన్ ఉండదు. అందుకు బదులుగా, కంపెనీ పెట్రోల్ పవర్ స్టెయిన్ మీద ఫోకస్ చేసింది.

1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్

అంతర్జాతీయ మోడల్ కొత్త 1.2L మైల్డ్ హైబ్రిడ్ ఇంజిన్ కలిగి ఉంది. అయితే భారతదేశంలో కొత్త డస్టర్ కోసం 1.3-లీటర్ HR13 టర్బో పెట్రోల్ ఇంజిన్ అమర్చారు. ఇది 154 bhp శక్తిని, 250 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్,  CVT ఆటోమేటిక్ గేర్ బాక్స్ రెండింటితోనూ లభిస్తుంది. రెనాల్ట్ భారతదేశంలో బలమైన హైబ్రిడ్ పవర్ స్ట్రెయిన్ గురించి కూడా పరిశీలిస్తోంది. 

నిస్సాన్ టెక్టాన్

నిస్సాన్ కూడా భారతదేశంలో కొత్త మిడ్ సైజ్ SUVని విడుదల చేస్తుంది. దీని పేరు టెక్టాన్. ఇది రెనాల్ట్ డస్టర్ మాదిరిగానే CMF-B ప్లాట్ఫారమ్ మీద ఆధారపడి ఉంటుంది. డిజైన్లో మరింత ప్రీమియంగా కనిపిస్తుంది. నిస్సాన్ దాని కొన్ని ఫీచర్లను చూపించింది, ఇందులో ఈ SUV బ్రాండ్ గ్లోబల్ ఫ్లాగ్షిప్ పెట్రోల్ SUVల నుండి ప్రేరణ పొందినట్లు కనిపిస్తుంది. నిస్సాన్ టెక్టాన్ కూడా డస్టర్ 1.3L టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉపయోగిస్తుంది. 2026 మొదటి అర్ధభాగంలో దీనిని విడుదల చేయనున్నారు.

 దాదాపు ఒకేలా ఫీచర్లు..

  • నివేదికల ప్రకారం రెండు SUVలలో ఫీచర్ల సెట్ దాదాపు ఒకేలా ఉంటుంది. పెద్ద టచ్ స్క్రీన్, ADAS, 360 కెమెరా, డిజిటల్ క్లస్టర్, కనెక్టెడ్ కార్ ఫీచర్లు, పనోరమిక్ సన్రూఫ్ సహా 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి.

మిడ్ సైజ్ SUV విభాగంలో గట్టి పోటీ

రెనాల్ట్, నిస్సాన్ రెండూ భారతదేశంలో మధ్య-పరిమాణ SUVల డిమాండ్ పెరుగుతుందని నమ్ముతున్నాయి. కొత్త డస్టర్, టెక్టాన్ రాకతో, హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా, టయోటా హైరైడర్, టాటా కర్వ్, మహీంద్రా XUV700 వంటి SUVలకు గట్టి పోటీ ఇచ్చే అవకాశాలున్నాయి.

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

రూ.2.87 లక్షల నుంచి రూ.4.05 లక్షల వరకు KTM 390 అడ్వెంచర్.. ఒక్కో వేరియంట్‌ది ఒక్కో ప్రత్యేకత
KTM 390 అడ్వెంచర్‌లో ఏ వేరియంట్ బెస్ట్? నాలుగు మోడళ్ల మధ్య పూర్తి తేడాలు ఇవే
డ్రైవర్‌ సహా వాహనంలో ఉన్న ప్రతి ఒక్కరికీ బీమా - సుప్రీంకోర్టు సంచలన తీర్పు, కొత్త నిబంధనలు!
కొత్త కార్లకు 4 ఏళ్లు, బైక్‌లకు 6 ఏళ్లు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్‌ తప్పనిసరి? సుప్రీంకోర్టు సూచన
మలైకా అరోరా కొత్త కారు Mahindra Thar Roxx.. స్పెషల్ SUV ధర, ఫీచర్ల పూర్తి వివరాలు
మలైకా అరోరా కొత్త కారు Mahindra Thar Roxx.. స్పెషల్ SUV ధర, ఫీచర్ల పూర్తి వివరాలు
Budget Friendly Bikes: మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
రూ.2.87 లక్షల నుంచి రూ.4.05 లక్షల వరకు KTM 390 అడ్వెంచర్.. ఒక్కో వేరియంట్‌ది ఒక్కో ప్రత్యేకత
KTM 390 అడ్వెంచర్‌లో ఏ వేరియంట్ బెస్ట్? నాలుగు మోడళ్ల మధ్య పూర్తి తేడాలు ఇవే
YCP Vs TDP: విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
Pregnancy Test : పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
భువీకి ఛాన్స్.. పంత్కి నో వన్డే వరల్డ్ కప్ 2027 టీమ్ ఇదేనా ?
భువీకి ఛాన్స్.. పంత్కి నో వన్డే వరల్డ్ కప్ 2027 టీమ్ ఇదేనా ?
ప్లెమింగ్ మాస్టర్ ప్లాన్ తో సీఎస్ కే కి డబుల్ షాక్
ప్లెమింగ్ మాస్టర్ ప్లాన్ తో సీఎస్ కే కి డబుల్ షాక్
Vishnu Priya Bhimeneni: శారీలో విష్ణుప్రియ... ట్రెడిషనల్ ఫోటోషూట్ చేసిన వైరల్ బోల్డ్ లేడీ
శారీలో విష్ణుప్రియ... ట్రెడిషనల్ ఫోటోషూట్ చేసిన వైరల్ బోల్డ్ లేడీ
Embed widget