High Court Jobs: తెలంగాణ హైకోర్టులో అసిస్టెంట్ లైబ్రేరియన్ పోస్టులు, అర్హతలు ఇవే!
ఏదైనా డిగ్రీతోపాటు టైపింగ్(హయ్యర్‌గ్రేడ్) సర్టిఫికేట్ ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు ఉన్న అభ్యర్థులు జనవరి 21 నుంచి ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
తెలంగాణ హైకోర్టు అసిస్టెంట్ లైబ్రేరియన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 2 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఖాళీల్లో ఓసీలకు 1, ఎస్సీలకు 1 పోస్టు కేటాయించారు. ఏదైనా డిగ్రీతోపాటు టైపింగ్(హయ్యర్‌గ్రేడ్) సర్టిఫికేట్ ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు ఉన్న అభ్యర్థులు జనవరి 21 నుంచి ఫిబ్రవరి 11 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, టైపింగ్ టెస్ట్ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
పోస్టుల వివరాలు..
* అసిస్టెంట్ లైబ్రేరియన్: 2 పోస్టులు
అర్హతలు: లా డిగ్రీతోపాటు బీఎల్ఐఎస్సీ డిగ్రీ ఉండాలి. ఎంఎల్‌ఐఎస్సీ ఉన్నవారికి ప్రాధాన్యం. లైబ్రరీ నిర్వహణకు సంబంధించి కంప్యూటర్ స్కిల్స్ ఉండాలి. ఇందుకు సంబంధించిన సర్టిఫికేట్ ఉండాలి.
వయోపరిమితి: 11.01.2023 నాటికి 18-34 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలపాటు వయోసడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు ఫీజు: రూ.600. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.400 చెల్లిస్తే సరిపోతుంది. ఆన్‌లైన్ ద్వారా మాత్రమే పరీక్ష ఫీజు చెల్లించాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష, టైపింగ్ టెస్ట్, ఇంటర్వూ, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా.
పరీక్ష విధానం..
➥ మొత్తం 100 మార్కులకు ఎంపిక విధానం ఉంటుంది. వీటిలో రాతపరీక్షకు 90 మార్కులు, వైవా-వాయిస్‌కు 10 మార్కులు కేటాయిస్తారు. వీటిలో నుంచి 1:3 నిష్పత్తిలో అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించి ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు.
➥ మొత్తం 90 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 90 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు. ఇందులో లైబ్రరీ సైన్స్ 30 ప్రశ్నలు-30 మార్కులు, కంప్యూటర్ నాలెడ్జ్(లైబ్రరీ మేనేజ్‌మెంట్)-10 ప్రశ్నలు-10 మార్కులు, జనరల్ నాలెడ్జ్-30 ప్రశ్నలు-30 మార్కులు, జనరల్ ఇంగ్లిష్-20 ప్రశ్నలు-20 మార్కులు. పరీక్ష సమయం 2 గంటలు(120 నిమిషాలు).
➥ అర్హత మార్కులను ఓసీలకు 45%, బీసీలకు 40%, ఎస్సీ-ఎస్టీలకు 35% గా నిర్ణయించారు.
జీతభత్యాలు: రూ.38,890 - రూ.1,12,510.
ముఖ్యమైన తేదీలు..
➥ నోటిఫికేషన్ వెల్లడి: 11.01.2023.
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 21.01.2023.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 11.02.2023. (11.59 PM)
➥ పరీక్ష హాల్‌టికెట్ల డౌన్‌లోడ్: 20.02.2023.
➥ కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష తేది: మార్చిలో పరీక్ష నిర్వహిస్తారు.
Also Read:
తెలంగాణ హైకోర్టులో 20 కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు, అర్హతలు ఇవే!
తెలంగాణ హైకోర్టు కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 20 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఖాళీల్లో ఓసీలకు 10, బీసీలకు 6, ఎస్సీలకు 3, ఎస్టీలకు 1 పోస్టు కేటాయించారు. ఏదైనా డిగ్రీతోపాటు టైపింగ్(హయ్యర్‌గ్రేడ్) సర్టిఫికేట్ ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు ఉన్న అభ్యర్థులు జనవరి 21 నుంచి ఫిబ్రవరి 11 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, టైపింగ్ టెస్ట్ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
తెలంగాణ హైకోర్టులో ట్రాన్స్‌లేటర్ ఉద్యోగాలు, అర్హతలు ఇవే!
తెలంగాణ హైకోర్టు ట్రాన్స్‌లేటర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 10 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో 8 పోస్టులు తెలుగు ట్రాన్స్‌లేటర్ పోస్టులు కాగా, 2 ఉర్దూ ట్రాన్స్‌లేటర్ పోస్టులు ఉన్నాయి. ఖాళీల్లో ఓసీలకు 3 పోస్టులు, బీసీలకు 2 పోస్టులు, ఎస్సీలకు 2, ఎస్టీలకు 1 పోస్టు కేటాయించారు. మూడేళ్లు లేదా ఐదేళ్ల లా డిగ్రీ అర్హతతోపాటు సంబంధిత విభాగంలో డిప్లొమా లేదా సర్టిఫికేట్ కోర్సు అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు జనవరి 21 నుంచి ఫిబ్రవరి 11 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..