అన్వేషించండి

TS Police Recruitment: ఆ కానిస్టేబుల్ అభ్యర్థులకు ఊరట, హైకోర్టు ఆదేశాలకు 'సుప్రీం' ఓకే!

హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ.. కానిస్టేబుల్ మెరిట్ లిస్ట్‌లో తొలివరుసలో ఉన్నవారు ఆ పోస్టు తీసుకోకపోతే తర్వాతి వరుసలో ఉన్నవారికి అవకాశం కల్పించాలని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది.

తెలంగాణ రాష్ట్ర పోలీసు నియామక మండలికి సుప్రీంకోర్టు షాకిచ్చింది. కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి మెరిట్ తొలిస్థానంలో ఉన్నవారు చేరని పోస్టులను మెరిట్‌లిస్ట్‌లో తర్వాతి సానంలో ఉన్నవారితో భర్తీ చేయాలని హైకోర్టు ఆదేశించింది. దీనిపై ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అప్పీలుకు వెళ్లింది. అయితే హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ.. పోలీసు కానిస్టేబుల్ భర్తీ ప్రక్రియ కోసం నిర్వహించిన పరీక్షల్లో మెరిట్ లిస్ట్‌లో తొలివరుసలో ఉన్నవారు ఆ పోస్టు తీసుకోకపోతే తర్వాతి వరుసలో ఉన్నవారికి అవకాశం కల్పించాలని సుప్రీంకోర్టు ఈ మేరకు స్పష్టంచేసింది. ఈ అంశంపై తెలంగాణ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు దాఖలు చేసిన అప్పీల్‌ను కొట్టేస్తూ జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ అభయ్ ఎస్.ఓక్ ధర్మాసనం నవంబరు 29న తీర్పు చెప్పింది. దీనివల్ల 1,370 మంది అభ్యరులకు ఊరట లభించనుంది.

రాష్ట్రంలో వివిధ 17,156 పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం 2018 మే 5న నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రిలిమినరీ పరీక్ష, ఫిజికల్ ఈవెంట్స్, మెయిన్ పరీక్ష అనంతరం వీటికి సంబంధించిన తుది మెరిట్ జాబితాను 2019 సెప్టెంబరు 24న తుది మెరిట్ జాబితాను టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ విడుదల చేసింది. జాబితాకు ఎంపికైన వారందరూ పోలీస్ రిక్రూట్‌ మెంట్ బోర్డు నిర్దేశించిన కటాఫ్ మార్కులు పొందారు. ఇందులో ఎక్కువ అర్హత మార్కులు పొందినవారు ఈ పోస్టుల్లో చేరడానికి రాకపోవడంతో ప్రభుత్వం వాటిని ఖాళీగా ఉంచింది. అయితే మెరిట్ లిస్ట్‌లో తర్వాతి స్థానంలో ఉన్న తమను పరిగణనలోకి తీసుకోలేదంటూ కొందరు అభ్యర్థులు హైకోర్టులో సవాల్ చేశారు. దీనివల్ల 1,370 పోస్టులు భర్తీ కాకుండా మిగిలిపోయినట్లు కోర్టు దృష్టికి తెచ్చారు.

Also Read:  తెలంగాణలో 'గ్రూప్‌-4' ఉద్యోగాల జాతర - 9,168 పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్! 


హైకోర్టు తీర్పు ఇలా..
మెరిట్ లిస్ట్‌లో ముందున్నవారు అపాయింట్‌మెంట్ ఆర్డర్ తీసుకొన్న తర్వాత ఆ ఉద్యోగాన్ని వదిలేసి ఉంటే దాన్ని ఖాళీగా భావించి తదుపరి రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ ప్రకారం భర్తీ చేయాలి తప్పితే, అసలు అభ్యరే చేరని పోస్టును ఖాళీగా ప్రకటించి, దాన్ని మెరిట్‌లిస్ట్‌లో తదుపరి జాబితాలో ఉన్నవారికి ఇవ్వకపోవడం సరికాదని పేర్కొన్నారు. వీరి వాదనతో ఏకీభవించిన హైకోర్టు మెరిట్ లిస్ట్‌లో తొలిస్థానంలో ఉన్నవారు చేరని పోస్టులను మెరిట్‌లిస్ట్‌లో తర్వాతి సానంలో ఉన్నవారితో భర్తీ చేయాలని హైకోర్టు ఆదేశించింది.

సుప్రీంకోర్టు ఏమంది..? 
హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ సుప్రీంకోర్టును ఆశ్రయింది. అత్యున్నత న్యాయస్థానం కూడా హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్తిస్తూ.. పోలీస్ బోర్డు దాఖలు చేసిన అప్పీల్‌ను కొట్టేసింది. హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం కనిపించడంలేదని స్పష్టం చేసింది. ఏదైనా ఉద్యోగ నోటిఫికేషన్ జారీ చేసినప్పుడు మెరిట్‌లిస్ట్‌లో ఉన్నవారు నియామక ప్రక్రియలో పాల్గొని అపాయింట్‌మెంట్ ఆర్డర్ తీసుకున్న తర్వాత చేరకపోతే మాత్రమే దాన్ని ఖాళీ అయిన పోస్టుగా పరిగణించాలని, మెరిట్‌లిస్ట్‌లో తర్వాతి క్రమంలో ఉన్నవారితో భర్తీ చేయకూడదని ముంజా ప్రవీణ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ కేసులో కోర్టు ఇదివరకే స్పష్టం చేసినందున దాన్నే అనుసరించాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశించింది. యువత ఉపాధికి ప్రభుత్వ ఉద్యోగాలు ఒక ముఖ్య వనరు అని, అందువల్ల హైకోర్టు ఇచ్చిన తీర్పును సమరిస్తున్నట్లు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

Also Read: TS Jobs: నిరుద్యోగులకు మరో గుడ్‌న్యూస్ - 16,940 ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్!

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

టాప్ హెడ్ లైన్స్

SBI Clerk Notification 2026:ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
TGPSC FBO Notification 2026: తెలంగాణ అటవీ శాఖలో ఉద్యోగాలు! 1393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌ పోస్టులకు త్వరలో ప్రకటన!
తెలంగాణ అటవీ శాఖలో ఉద్యోగాలు! 1393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌ పోస్టులకు త్వరలో ప్రకటన!
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
AP Job Calendar 2026 : ఏపీలో 10,060 ఉద్యోగాల భర్తీకి ముహూర్తం ఖరారు - సెప్టెంబర్ నుంచి నోటిఫికేషన్ల ఉప్పెన!
ఏపీలో 10,060 ఉద్యోగాల భర్తీకి ముహూర్తం ఖరారు - సెప్టెంబర్ నుంచి నోటిఫికేషన్ల ఉప్పెన!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mamata Banerjee Car Attack: మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
BWF Title Win: కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Embed widget