అన్వేషించండి

TS Jobs: నిరుద్యోగులకు మరో గుడ్‌న్యూస్ - 16,940 ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్!

సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఇప్పటికే వివిధ శాఖల్లో 60,929 పోస్టుల భర్తీకి అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్టు సీఎస్ తెలిపారు. మరో 16,940 పోస్టులకు కూడా త్వరలోనే అనుమతులు ఇవ్వనున్నట్టు చెప్పారు.

తెలంగాణ నిరద్యోగులకు త్వరలో మరో గుడ్ న్యూస్ రానుంది. ఇప్పటికే వరుసబెట్టి ఉద్యోగ ప్రకటనలు చేస్తున్న ప్రభుత్వం తాజాగా రాష్ట్రంలో మరో 16 వేలకు పైగా పోస్టుల భర్తీకి నోటిఫికేష్ విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 60 వేల పైచిలుకు పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందని.. త్వరలోనే మరో 16 వేలకు పైగా పోస్టుల భర్తీకి కూడా అనుమతులు ఇవ్వనున్నట్టు సోమేశ్ కుమార్ వెల్లడించారు. 

ఉద్యోగ నియామక ప్రక్రియపై పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ జనార్ధన్ రెడ్డితో కలిసి వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎస్ సోమేశ్ కుమార్ నవంబరు 29న సమీక్ష నిర్వహించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఇప్పటికే వివిధ శాఖల్లో 60,929 పోస్టుల భర్తీకి అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్టు తెలిపారు. మరో 16,940 పోస్టులకు కూడా త్వరలోనే అనుమతులు ఇవ్వనున్నట్టు చెప్పారు. త్వరలోనే ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్లను విడుదల చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు.

Also Read:  తెలంగాణలో 'గ్రూప్‌-4' ఉద్యోగాల జాతర - 9,168 పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్!

వచ్చే నెలలో నోటిఫికేషన్లు...

రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఉద్యోగ నియామకాలు తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్‌, మెడికల్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌, పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌, రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషన్‌ రిక్రూట్‌ మెంట్‌ బోర్డు తదితర రిక్రూట్‌మెంట్‌ ఏజెన్సీల ద్వారా భర్తీ ప్రక్రియ జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు. నియామకాల ప్రక్రియలో సమయపాలన కచ్చితంగా పాటించడంతోపాటు , రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియ త్వరిత గతిన పూర్తయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. సర్వీస్‌ రూల్స్‌లో చేపట్టాల్సిన మార్పులు పూర్తి చేసి అవసరమైన అన్ని వివరాలను టీఎస్‌పీఎస్‌సికి వెంటనే సమాచారం అందిస్తే, వాటి ఆధారంగా పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్‌ వచ్చే నెలలో నోటిఫికేషన్‌లు జారీ చేస్తుందని పేర్కొన్నారు. రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియను ప్రతిరోజూ పర్యవేక్షించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

Also Read:  TS - పోలీస్ ఉద్యోగార్థులకు అలర్ట్, ఫిజికల్ ఈవెంట్ల అడ్మిట్ కార్డులు వచ్చేశాయ్!!

తుది దశకు..

సీఎం కేసీఆర్‌ ప్రకటించిన 80వేల ఖాళీలను గడువులోగా భర్తీ చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు తుది దశకు చేరుకున్నాయి. ఆర్ధిక శాఖ అనుమతులతో అన్ని నియామక సంస్థలు కార్యాచరణ వేగవంతం చేస్తున్నాయి. డిసెంబర్‌ 8 నుంచి పోలీస్‌ నియామక అర్హత అభ్యర్ధుల ఫిజికల్‌ టెస్టులు ప్రారంభం కానుండగా, త్వరలో గ్రూప్‌-1 మోయిన్స్‌ నిర్వహించనున్నారు. గ్రూప్‌-1 మెయిన్స్‌ను జనవరి, ఫిబ్రవరిలో నిర్వహించేందుకు ప్రభుత్వం యోచిస్తోంది.

మొత్తంగా 60,929 పోస్టులకు ఆర్ధిక శాఖ అనుమతులు జారీ చేయడంతో నోటిఫికేషన్ల జారీ దిశగా ప్రభుత్వం విస్తృత చర్యలు తీసుకుంటోంది. మిగిలిన 16940 ఉద్యోగాలకు త్వరలో ఆర్ధిక శాఖ పరిపాలనా అనుమతులకు సిద్దమవుతోంది. ఈ నేపథ్యంలో డిసెంబర్‌ మాసంలో గ్రూప్‌2, గ్రూప్‌ 3, గ్రూప్‌ 4 ఉద్యోగ నోటిఫికేషన్లను జారీ చేయనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. నోటిఫికేషన్ల జారీకి వీలుగా టీఎస్‌పీఎస్సీ రోజు సమావేశాలను నిర్వహిస్తోంది. 34శాఖల అధికారులతో సంప్రదింపులతో పోస్టుల భర్తీకి ఉన్న అన్ని అడ్డంకులను తొలగించుకుంటూ ముందుకు సాగుతోంది. 

Also Read: ఏపీలో 6,511 పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల! వివరాలు ఇలా! 

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

టాప్ హెడ్ లైన్స్

Dasara Special Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
Talliki Vandanam Phase 2: తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
Srikakulam Crime News: హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
Bloody Romeo: బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dasara Special Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
Talliki Vandanam Phase 2: తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
Srikakulam Crime News: హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
Bloody Romeo: బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
CM Chandrababu: స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి
స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి
11-10-2026 ఆదివారం నవరాత్రుల మొదటి రోజు మకర, కుంభ, మీన రాశుల భవిష్యత్తు ఎలా ఉందంటే!
11-10-2026 ఆదివారం నవరాత్రుల మొదటి రోజు మకర, కుంభ, మీన రాశుల భవిష్యత్తు ఎలా ఉందంటే!
YS Sharmila: మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
Abhijit Dipke Grandmother Passes Away: అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
Embed widget