అన్వేషించండి

AP Police Recruitment: ఏపీలో 6,511 పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల!

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.  దీని ద్వారా 411ఎస్సై, 6100 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఏపీలోని నిరుద్యోగులకు ప్రభత్వం గుడ్ న్యూస్ తెలిపింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 6511 పోలీసు ఉద్యోగాల భర్తీకి పోలీసు నియామక మండలి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 411 ఎస్‌ఐ పోస్టులు, 6100 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనుంది. కానిస్టేబుల్ పోస్టులకు నవంబరు 30 నుంచి డిసెంబరు 28 దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్‌ఐ పోస్టులకు డిసెంబరు 14 నుంచి జనవరి 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. కానిస్టేబుల్ పోస్టులకు జనవరి 22న, ఎస్‌ఐ పోస్టులకు ఫిబ్రవరి 19న ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహించనున్నారు. 

పోలీసు ఉద్యోగాల ఎంపికలో ప్రధానంగా నాలుగు దశలు ఉంటాయి. వీటిలో ప్రిలిమినరీ ఎగ్జామ్, ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ (PMT), ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET), మెయిన్ ఎగ్జామ్ నిర్వహిస్తారు. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు తదుపరి స్థాయి పరీక్షకు అర్హులు. ప్రిలిమినరీ పరీక్ష అనేది బహుళ ప్రశ్నలతో కూడిన రాత పరీక్ష, అయితే ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ ఒక అభ్యర్థి భౌతిక సామర్థ్యాన్ని పరిశీలిస్తాయి. ఈ ఫిజికల్ టెస్టుల్లో అర్హత సాధించిన అభ్యర్థులు ఏపీ  పోలీస్ కానిస్టేబుల్ మెయిన్ పరీక్షకు హాజరు కావడానికి అనుమతిస్తారు. ఇది మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు  కలిగి ఉన్న పరీక్ష.

 కానిస్టేబుల్ పోస్టుల నోటిఫికేషన్, పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

ఎస్ఐ పోస్టుల నోటిఫికేషన్, పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

రిజర్వేషన్ పెంపు..

ఒకవైపు నోటిఫికేషన్ వార్తతోపాటు అభ్యర్థులకు మరో తీపి కబురు ప్రభుత్వం వినిపించింది. ఎస్‌ఐ, కానిస్టేబుల్ పోస్టుల భర్తీలో హోంగార్డులకు రిజిర్వేషన్లు కల్పించనున్నట్లు ప్రకటించింది. సివిల్‌ కానిస్టేబుల్‌ పోస్టుల్లో హోంగార్డులకు రిజర్వేషన్లను 8 నుండి 15 శాతానికి పెంచారు. అదేవిధంగా ఏపీఎస్పీ కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి హోంగార్డులకు రిజర్వేషన్లను 10 నుండి 25 శాతానికి పెంచారు.

పోస్టుల వివరాలు..

మొత్తం ఖాళీల సంఖ్య: 6,511 పోస్టులు

1) సబ్ ఇన్‌స్పెక్టర్లు : 411 పోస్టులు 

సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (సివిల్-మెన్ & ఉమెన్) 315 పోస్టులు
రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్స్ ఆఫ్ పోలీస్(APSP- మెన్) 96 పోస్టులు

2) పోలీస్ కానిస్టేబుల్స్: 6,100 పోస్టులు

పోలీస్ కానిస్టేబుల్(సివిల్-మెన్ & ఉమెన్) 3580 పోస్టులు
పోలీస్ కానిస్టేబుల్స్ (APSP-మెన్) 2520 పోస్టులు

అర్హతలు: 

➥ ఎస్‌ఐ పోస్టులకు డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. ఎస్టీ, ఎస్సీ అభ్యర్థులు 01.07.2022 నాటికి ఇంటర్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై, డిగ్రీ చదువుతూ ఉండాలి. 

➥ కానిస్టేబుల్ పోస్టులకు ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు పదోతరగతి పాసై ఉండి, ఇంటర్ ప్రథమే లేదా ద్వితీయ సంవత్సరం చదువుతూ ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: ప్రిలిమినరీ ఎగ్జామ్, ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ (PMT), ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET), మెయిన్ ఎగ్జామ్ ద్వారా.

🔰 ప్రిలిమ్స్ పరీక్ష విధానం: ప్రిలిమ్స్ పరీక్షలో పేపర్-1, పేపర్-2 ఉంటాయి. మొత్తం 200 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. పేపర్-1లో 100 ప్రశ్నలు-100 మార్కులు, పేపర్-2లో 100 ప్రశ్నలు-100 మార్కులు. పరీక్ష సమయం 3 గంటలు.

🔰 మెయిన్ పరీక్ష విధానం: మెయిన్ పరీక్షలోనూ 200 ప్రశ్నలకు 200 మార్కులు కేటాయించారు. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు. పరీక్ష సమయం 3 గంటలు. ప్రధాన పరీక్షలో ఇంగ్లిస్, అరిథ్‌మెటిక్, జనరల్ సైన్స్, హిస్టరీ, జియోగ్రఫీ,పాలిటీ, ఎకానమీ, కరెంట్ అఫైర్స్, రీజనింగ్,మెంటల్ ఎబిలిటీ నుంచి ప్రశ్నలు అడుగుతారు.

ముఖ్యమైన తేదీలు..

ఎస్‌ఐ పోస్టులకు:

➥ ఎస్‌ఐ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 14.12.2022.

➥ ఎస్‌ఐ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 18.01.2022.

➥ ప్రిలిమినరీ పరీక్ష హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్: 05.02.2023.

➥ ప్రిలిమినరీ పరీక్ష తేది: 19.02.2023.

కానిస్టేబుల్ పోస్టులకు:

➥ కానిస్టేబుల్ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 30.11.2022.

➥ కానిస్టేబుల్ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 28.12.2022.

➥ ప్రిలిమినరీ పరీక్ష హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్: 09.01.2023.

➥ ప్రిలిమినరీ పరీక్ష తేది: 22.01.2023.

 

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
Group 2 Exams: ఓ వైపు లక్ష్యం, మరోవైపు మాతృత్వం - పురిటి నొప్పులతోనే గ్రూప్ 2 పరీక్ష రాసిన అభ్యర్థి, కలెక్టర్ ఆదేశాలతో..
ఓ వైపు లక్ష్యం, మరోవైపు మాతృత్వం - పురిటి నొప్పులతోనే గ్రూప్ 2 పరీక్ష రాసిన అభ్యర్థి, కలెక్టర్ ఆదేశాలతో..
Pushpa 2 Collections: రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
Group 2 Exam: గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అద్దె ఇంట్లో లిక్కర్ తయారీ, ఏ బ్రాండైనా చిటికెలో రెడీ!మనం దేశంలో మగాళ్లకు ఓ న్యాయం.. ఆడవాళ్లకు ఓ న్యాయమా?ఇళయరాజాకు ఘోర అవమానం!నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు   ఖాళీ అయిపోయిన గ్రామం..!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
Group 2 Exams: ఓ వైపు లక్ష్యం, మరోవైపు మాతృత్వం - పురిటి నొప్పులతోనే గ్రూప్ 2 పరీక్ష రాసిన అభ్యర్థి, కలెక్టర్ ఆదేశాలతో..
ఓ వైపు లక్ష్యం, మరోవైపు మాతృత్వం - పురిటి నొప్పులతోనే గ్రూప్ 2 పరీక్ష రాసిన అభ్యర్థి, కలెక్టర్ ఆదేశాలతో..
Pushpa 2 Collections: రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
Group 2 Exam: గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
Beggars: ఆ నగరంలో భిక్షాటన పూర్తిగా నిషేధం - యాచకులకు డబ్బులిస్తే కేసులు, జనవరి 1 నుంచి అమలు
ఆ నగరంలో భిక్షాటన పూర్తిగా నిషేధం - యాచకులకు డబ్బులిస్తే కేసులు, జనవరి 1 నుంచి అమలు
Pawan Kalyan: పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్  కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్ కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
Gukesh:  గుకేష్‌కు నిర్మలా సీతారామన్ చెక్ మేట్ - సోషల్ మీడియాలో హిలేరియస్ మీమ్స్
గుకేష్‌కు నిర్మలా సీతారామన్ చెక్ మేట్ - సోషల్ మీడియాలో హిలేరియస్ మీమ్స్
Royal Enfield Bikes: త్వరలో మార్కెట్లోకి మూడు కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ - అన్నీ 650 సీసీ పవర్ ఫుల్ ఇంజిన్లతోనే!
త్వరలో మార్కెట్లోకి మూడు కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ - అన్నీ 650 సీసీ పవర్ ఫుల్ ఇంజిన్లతోనే!
Embed widget