అన్వేషించండి

NVS Recruitment: 1377 నవోదయ పోస్టుల భర్తీకి రేపటితో ముగియనున్న గడువు, వెంటనే అప్లయ్ చేసుకోండి

NVS: నవోదయ విద్యాలయ సమితిలో 1377 నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 30తో ముగియనుంది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేనివారు వెంటనే దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.

NVS Non Teaching Application: నవోదయ విద్యాలయ సమితిలో 1377 నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 30తో ముగియనుంది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేని అభ్యర్థులు వెంటనే దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. పోస్టులవారీగా విద్యార్హతలు, వయోపరిమితులు నిర్ణయించిన సంగతి తెలిసిందే. దరఖాస్తు ఫీజుగా జనరల్‌, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు సంబంధించి ఫిమేల్‌ స్టాఫ్ నర్స్ పోస్టులకు రూ.1500; ఇతర పోస్టులకు రూ.1000 చెల్లించాలి. ఎస్సీ,ఎస్టీ, దివ్యాంగులు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది.

రాత పరీక్ష, ట్రేడ్/ స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఏపీలో విజయవాడ, విశాఖపట్నం విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కాకినాడ, అనంతపురం, కర్నూలు; తెలంగాణలో హైదరాబాద్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మంలో రాతపరీక్ష నిర్వహిస్తారు.

ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న జవహర్ నవోదయ విద్యాలయాల హెడ్‌క్వార్టర్స్‌లలో, నవోదయ విద్యాలయ కార్యాలయాల్లో 1,337 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో హెడ్‌క్వార్టర్స్‌లలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఆడిట్ అసిస్టెంట్, జూనియర్ ట్రాన్స్‌లేషన్ ఆఫీసర్, లీగల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, కంప్యూటర్ ఆపరేటర్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, మల్టీటాస్కింగ్ స్టాఫ్ పోస్టులను; నవోదయ విద్యాలయ కార్యాలయాల్లో స్టాఫ్ నర్స్(ఉమెన్), కేటరింగ్ సూపర్‌వైజర్, జూనియర్ సెక్రటేరియట్అసిస్టెంట్, ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్, ల్యాబ్ అటెండెంట్, మెస్ హెల్పర్ పోస్టులను భర్తీచేయనున్నారు. 

పోస్టుల వివరాలు..

* నాన్-టీచింగ్ పోస్టులు

ఖాళీల సంఖ్య: 1377.

➥ స్టాఫ్ నర్స్ (ఫీమేల్): 121 పోస్టులు
అర్హత: బీఎస్సీ (ఆనర్స్) నర్సింగ్/ బీఎస్సీ నర్సింగ్/ పోస్ట్ బేసిక్ నర్సింగ్. రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్‌లో నర్స్‌గా లేదా నర్స్ మిడ్ వైఫ్ సభ్యత్వం ఉండాలి.

➥ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్: 05 పోస్టులు
అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీతోపాటు అడ్మినిస్ట్రేటివ్, ఫైనాన్స్ సంబంధిత విభాగాల్లో కనీసం 3 సంవత్సరాల అనుభవం ఉండాలి.

➥ ఆడిట్ అసిస్టెంట్: 12 పోస్టులు
అర్హత: బీకామ్ డిగ్రీతోపాటు అకౌంటింగ్‌లో 3 సంవత్సరాల అనుభవం ఉండాలి.

➥ జూనియర్ ట్రాన్స్‌లేషన్ ఆఫీసర్: 04 పోస్టులు
అర్హత: మాస్టర్స్ డిగ్రీ (హిందీ/ఇంగ్లిష్) ఉత్తీర్ణులై ఉండాలి. డిగ్రీ స్థాయిలో ఇంగ్లిష్/హిందీ ఒక సబ్జెక్టుగా ఉండాలి. ట్రాన్స్‌లేషన్‌లో డిప్లొమా/సర్టిఫికేట్ కోర్సు (హిందీ నుంచి ఇంగ్లిష్‌లోకి)/ఇంగ్లిష్ నుంచి హిందీలోకి) కోర్సు చేసి ఉండాలి.

➥ లీగల్ అసిస్టెంట్: 01 పోస్టు
అర్హత: లా డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు మూడేళ్ల లా ప్రాక్టీస్ ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.

➥ స్టెనోగ్రాఫర్: 23 పోస్టులు
అర్హత: ఇంటర్ ఉత్తీర్ణత ఉండాలి. టైపింగ్ తెలిసి ఉండాలి. డిక్టేషన్‌లో 10 నిమిషాల్లో 80 పదాలు, ట్రాన్‌స్క్రిప్షన్‌ - ఇంగ్లిష్ 50 నిమిషాలు, హిందీ 65 నిమిషాలు ఉంటుంది. 

➥ కంప్యూటర్ ఆపరేటర్: 02 పోస్టులు
అర్హత: బీసీఏ/బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్/ఐటీ) (లేదా) బీఈ/బీటెక్ (కంప్యూటర్ సైన్స్/ఐటీ).

➥ కేటరింగ్ సూపర్‌వైజర్: 78 పోస్టులు
అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ (హోటల్ మేనేజ్‌మెంట్) (లేదా) ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులైతే ట్రేడ్ ప్రొఫీషియన్సీ సర్టిఫికేట్(కేటరింగ్)తోపాటు డిఫెన్స్ సర్వీసెస్‌లో 10 సంవత్సరాల అనుభవం ఉండాలి.

➥ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్(హెడ్‌క్వార్టర్స్/ప్రాంతీయ కార్యాలయాలు): 21 పోస్టులు
అర్హత: ఇంటర్ విద్యార్హత ఉండాలి. టైప్ రైటింగ్ తెలిసి ఉండాలి. నిమిషానికి 30 ఇంగ్లిష్ పదాలు లేదా 25 హిందీ పదాలు టైప్ చేయగలగాలి. (లేదా) ఇంటర్‌తోపాటు సెక్రటేరియల్ ప్రాక్టీసెస్, ఆఫీస్ మేనేజ్‌మెంట్ ఒకేషనల్ సబ్జెక్టుగా చదివి ఉండాలి. 

➥ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (జేఎన్‌వీ): 360 పోస్టులు
అర్హత: ఇంటర్ విద్యార్హత ఉండాలి. టైప్ రైటింగ్ తెలిసి ఉండాలి. నిమిషానికి 30 ఇంగ్లిష్ పదాలు లేదా 25 హిందీ పదాలు టైప్ చేయగలగాలి. (లేదా) ఇంటర్‌తోపాటు సెక్రటేరియల్ ప్రాక్టీసెస్, ఆఫీస్ మేనేజ్‌మెంట్ ఒకేషనల్ సబ్జెక్టుగా చదివి ఉండాలి. 

➥ ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్: 128 పోస్టులు
అర్హత: పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఐటీఐ (ఎలక్ట్రీషియన్/వైర్‌మ్యాన్) ట్రేడ్ సర్టిఫికేట్ ఉండాలి. సంబంధిత విభాగంలో 2 సంవత్సరాల అనుభవం ఉండాలి.

➥ ల్యాబ్ అటెండెంట్: 161 పోస్టులు
అర్హత: పదోతరగతి ఉత్తీర్ణతోపాటు డిప్లొమా/సర్టిఫికేట్(ల్యాబొరేటరీ టెక్నిక్) కోర్సు చేసి ఉండాలి. (లేదా) ఇంటర్ అర్హత ఉండాలి.  

➥ మెస్ హెల్పర్: 442 పోస్టులు
అర్హత: పదోతరగతి ఉత్తీర్ణత ఉండాలి. ప్రభుత్వ సంస్థలు, పాఠశాలల మెస్‌లలో కనీసం 5 సంవత్సరాలు పనిచేసిన అనుభవం ఉండాలి. ఎన్‌వీఎస్ స్కిల్‌టెస్ట్‌లో ఉత్తీర్ణులు కావాలి.

➥ మల్టీటాస్కింగ్ స్టాఫ్: 19 పోస్టులు
అర్హత: పదోతరగతి ఉత్తీర్ణత ఉండాలి. 

నోటిఫికేషన్, దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

టాప్ హెడ్ లైన్స్

SBI Clerk Notification 2026:ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
TGPSC FBO Notification 2026: తెలంగాణ అటవీ శాఖలో ఉద్యోగాలు! 1393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌ పోస్టులకు త్వరలో ప్రకటన!
తెలంగాణ అటవీ శాఖలో ఉద్యోగాలు! 1393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌ పోస్టులకు త్వరలో ప్రకటన!
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
AP Job Calendar 2026 : ఏపీలో 10,060 ఉద్యోగాల భర్తీకి ముహూర్తం ఖరారు - సెప్టెంబర్ నుంచి నోటిఫికేషన్ల ఉప్పెన!
ఏపీలో 10,060 ఉద్యోగాల భర్తీకి ముహూర్తం ఖరారు - సెప్టెంబర్ నుంచి నోటిఫికేషన్ల ఉప్పెన!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi CWG: గ్లాస్గో కామన్వెల్త్ మెడలిస్ట్స్ తో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ భేటీ.. క్రీడాకారులపై ప్రశంసల వర్షం
గ్లాస్గో కామన్వెల్త్ మెడలిస్ట్స్ తో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ భేటీ.. క్రీడాకారులపై ప్రశంసల వర్షం
Mamata Banerjee Car Attack: మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
BWF Title Win: కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Embed widget