అన్వేషించండి

NVS Recruitment: నవోదయ విద్యాలయ సమితిలో 1377 నాన్ టీచింగ్ పోస్టులు - దరఖాస్తు వివరాలివే!

నవోదయ విద్యాలయ సమితిలో భారీగా నాన్-టీచింగ్ (గ్రూప్-బి, గ్రూప్-సి) పోస్టుల భర్తీకి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 22న ప్రారంభంకాగా.. ఏప్రిల్ 30 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.

NVS Non Teaching Notification: నవోదయ విద్యాలయ సమితిలో భారీగా నాన్-టీచింగ్ (గ్రూప్-బి, గ్రూప్-సి) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 22న ప్రారంభంకాగా.. ఏప్రిల్ 30 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. రాతపరీక్ష ద్వారా, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపికచేస్తారు. 

ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న జవహర్ నవోదయ విద్యాలయాల హెడ్‌క్వార్టర్స్‌లలో, నవోదయ విద్యాలయ కార్యాలయాల్లో 1,337 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో హెడ్‌క్వార్టర్స్‌లలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఆడిట్ అసిస్టెంట్, జూనియర్ ట్రాన్స్‌లేషన్ ఆఫీసర్, లీగల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, కంప్యూటర్ ఆపరేటర్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, మల్టీటాస్కింగ్ స్టాఫ్ పోస్టులను; నవోదయ విద్యాలయ కార్యాలయాల్లో స్టాఫ్ నర్స్(ఉమెన్), కేటరింగ్ సూపర్‌వైజర్, జూనియర్ సెక్రటేరియట్అసిస్టెంట్, ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్, ల్యాబ్ అటెండెంట్, మెస్ హెల్పర్ పోస్టులను భర్తీచేయనున్నారు. 

వివరాలు..

* నాన్-టీచింగ్ పోస్టులు

ఖాళీల సంఖ్య: 1377.

➥ స్టాఫ్ నర్స్ (ఫీమేల్): 121 పోస్టులు
అర్హత: బీఎస్సీ (ఆనర్స్) నర్సింగ్/ బీఎస్సీ నర్సింగ్/ పోస్ట్ బేసిక్ నర్సింగ్. రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్‌లో నర్స్‌గా లేదా నర్స్ మిడ్ వైఫ్ సభ్యత్వం ఉండాలి.
వయోపరిమితి: 35 సంవత్సరాలకు మించకూడదు.
జీతం: రూ.44,900-రూ.1,42,400.

➥ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్: 05 పోస్టులు
అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీతోపాటు అడ్మినిస్ట్రేటివ్, ఫైనాన్స్ సంబంధిత విభాగాల్లో కనీసం 3 సంవత్సరాల అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 23 - 33 సంవత్సరాల మధ్య ఉండాలి. 
జీతం: రూ.35,400-రూ.1,12,400.

➥ ఆడిట్ అసిస్టెంట్: 12 పోస్టులు
అర్హత: బీకామ్ డిగ్రీతోపాటు అకౌంటింగ్‌లో 3 సంవత్సరాల అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 18 - 30 సంవత్సరాల మధ్య ఉండాలి. 
జీతం: రూ.35,400-రూ.1,12,400.

➥ జూనియర్ ట్రాన్స్‌లేషన్ ఆఫీసర్: 04 పోస్టులు
అర్హత: మాస్టర్స్ డిగ్రీ (హిందీ/ఇంగ్లిష్) ఉత్తీర్ణులై ఉండాలి. డిగ్రీ స్థాయిలో ఇంగ్లిష్/హిందీ ఒక సబ్జెక్టుగా ఉండాలి. ట్రాన్స్‌లేషన్‌లో డిప్లొమా/సర్టిఫికేట్ కోర్సు (హిందీ నుంచి ఇంగ్లిష్‌లోకి)/ఇంగ్లిష్ నుంచి హిందీలోకి) కోర్సు చేసి ఉండాలి.
వయోపరిమితి: 32 సంవత్సరాలకు మించకూడదు.
జీతం: రూ.35,400-రూ.1,12,400.

➥ లీగల్ అసిస్టెంట్: 01 పోస్టు
అర్హత: లా డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు మూడేళ్ల లా ప్రాక్టీస్ ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.
వయోపరిమితి: 23 - 35 సంవత్సరాల మధ్య ఉండాలి. 
జీతం: రూ.35,400-రూ.1,12,400.

➥ స్టెనోగ్రాఫర్: 23 పోస్టులు
అర్హత: ఇంటర్ ఉత్తీర్ణత ఉండాలి. టైపింగ్ తెలిసి ఉండాలి. డిక్టేషన్‌లో 10 నిమిషాల్లో 80 పదాలు, ట్రాన్‌స్క్రిప్షన్‌ - ఇంగ్లిష్ 50 నిమిషాలు, హిందీ 65 నిమిషాలు ఉంటుంది. 
వయోపరిమితి: 18 - 27 సంవత్సరాల మధ్య ఉండాలి. 
జీతం: రూ.25,500-రూ.81,100.

➥ కంప్యూటర్ ఆపరేటర్: 02 పోస్టులు
అర్హత: బీసీఏ/బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్/ఐటీ) (లేదా) బీఈ/బీటెక్ (కంప్యూటర్ సైన్స్/ఐటీ).
వయోపరిమితి: 18 - 30 సంవత్సరాల మధ్య ఉండాలి. 
జీతం: రూ.25,500-రూ.81,100.

➥ కేటరింగ్ సూపర్‌వైజర్: 78 పోస్టులు
అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ (హోటల్ మేనేజ్‌మెంట్) (లేదా) ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులైతే ట్రేడ్ ప్రొఫీషియన్సీ సర్టిఫికేట్(కేటరింగ్)తోపాటు డిఫెన్స్ సర్వీసెస్‌లో 10 సంవత్సరాల అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 35 సంవత్సరాలలోపు ఉండాలి. 
జీతం: రూ.25,500-రూ.81,100.

➥ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్(హెడ్‌క్వార్టర్స్/ప్రాంతీయ కార్యాలయాలు): 21 పోస్టులు
అర్హత: ఇంటర్ విద్యార్హత ఉండాలి. టైప్ రైటింగ్ తెలిసి ఉండాలి. నిమిషానికి 30 ఇంగ్లిష్ పదాలు లేదా 25 హిందీ పదాలు టైప్ చేయగలగాలి. (లేదా) ఇంటర్‌తోపాటు సెక్రటేరియల్ ప్రాక్టీసెస్, ఆఫీస్ మేనేజ్‌మెంట్ ఒకేషనల్ సబ్జెక్టుగా చదివి ఉండాలి. 
వయోపరిమితి: 18 - 27 సంవత్సరాల మధ్య ఉండాలి. 
జీతం: రూ.19,900-రూ.63,200.

➥ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (జేఎన్‌వీ): 360 పోస్టులు
అర్హత: ఇంటర్ విద్యార్హత ఉండాలి. టైప్ రైటింగ్ తెలిసి ఉండాలి. నిమిషానికి 30 ఇంగ్లిష్ పదాలు లేదా 25 హిందీ పదాలు టైప్ చేయగలగాలి. (లేదా) ఇంటర్‌తోపాటు సెక్రటేరియల్ ప్రాక్టీసెస్, ఆఫీస్ మేనేజ్‌మెంట్ ఒకేషనల్ సబ్జెక్టుగా చదివి ఉండాలి. 
వయోపరిమితి: 18 - 27 సంవత్సరాల మధ్య ఉండాలి. 
జీతం: రూ.19,900-రూ.63,200.

➥ ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్: 128 పోస్టులు
అర్హత: పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఐటీఐ (ఎలక్ట్రీషియన్/వైర్‌మ్యాన్) ట్రేడ్ సర్టిఫికేట్ ఉండాలి. సంబంధిత విభాగంలో 2 సంవత్సరాల అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 18 - 40 సంవత్సరాల మధ్య ఉండాలి. 
జీతం: రూ.19,900-రూ.63,200.

➥ ల్యాబ్ అటెండెంట్: 161 పోస్టులు
అర్హత: పదోతరగతి ఉత్తీర్ణతోపాటు డిప్లొమా/సర్టిఫికేట్(ల్యాబొరేటరీ టెక్నిక్) కోర్సు చేసి ఉండాలి. (లేదా) ఇంటర్ అర్హత ఉండాలి.  
వయోపరిమితి: 18 - 30 సంవత్సరాల మధ్య ఉండాలి. 
జీతం: రూ.18,000-రూ.56,900.

➥ మెస్ హెల్పర్: 442 పోస్టులు
అర్హత: పదోతరగతి ఉత్తీర్ణత ఉండాలి. ప్రభుత్వ సంస్థలు, పాఠశాలల మెస్‌లలో కనీసం 5 సంవత్సరాలు పనిచేసిన అనుభవం ఉండాలి. ఎన్‌వీఎస్ స్కిల్‌టెస్ట్‌లో ఉత్తీర్ణులు కావాలి.
వయోపరిమితి: 18 - 30 సంవత్సరాల మధ్య ఉండాలి. 
జీతం: రూ.18,000-రూ.56,900.

➥ మల్టీటాస్కింగ్ స్టాఫ్: 19 పోస్టులు
అర్హత: పదోతరగతి ఉత్తీర్ణత ఉండాలి. 
వయోపరిమితి: 18 - 30 సంవత్సరాల మధ్య ఉండాలి. 
జీతం: రూ.18,000-రూ.56,900.

వయోసడలింపు: ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు; ఓబీసీలకు 3 సంవత్సరాలు; దివ్యాంగులకు కేటగిరీలవారీగా 10-15 సంవత్సరాల వరకు వయోసడలింపు వర్తిస్తుంది. నవోదయ విద్యాలయ సమితిలో ఉద్యోగులకు నిబంధనల మేరకు వయోసడలింపు వర్తిస్తుంది.

దరఖాస్తు ఫీజు: జనరల్‌, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు సంబంధించి ఫిమేల్‌ స్టాఫ్ నర్స్ పోస్టులకు రూ.1500; ఇతర పోస్టులకు రూ.1000 చెల్లించాలి. ఎస్సీ,ఎస్టీ, దివ్యాంగులు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ట్రేడ్/ స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: ఏపీలో విజయవాడ, విశాఖపట్నం విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కాకినాడ, అనంతపురం, కర్నూలు; తెలంగాణలో హైదరాబాద్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం. 

ముఖ్యమైన తేదీలు..

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 22.03.2024.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 30.04.2024. 

➥ దరఖాస్తు సవరణ తేదీలు: 02.05.2024 నుంచి 04.05.2024 వరకు. 

Notification

Online Application

Website

                                                

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Oracle Layoffs: భారీ లాభాలు వచ్చినా 30వేల మందిని ఒక్క రోజే తీసేసిన ఒరాకిల్ -సాఫ్ట్‌వేర్ రంగంలో గగ్గోలు!
భారీ లాభాలు వచ్చినా 30వేల మందిని ఒక్క రోజే తీసేసిన ఒరాకిల్ -సాఫ్ట్‌వేర్ రంగంలో గగ్గోలు!
8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్! త్వరలో భారీగా పెరగనున్న జీతాలు.. అంచనాలివే
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్! త్వరలో భారీగా పెరగనున్న జీతాలు.. అంచనాలివే
Andhra Praedesh News: ప్రభుత్వరంగ సంస్థలు, గురుకుల సొసైటీ స్కూల్ ఉద్యోగుల ఏజ్ లిమిట్ పెంపు
ప్రభుత్వరంగ సంస్థలు, గురుకుల సొసైటీ స్కూల్ ఉద్యోగుల ఏజ్ లిమిట్ పెంపు
Andhra Pradesh Job Calendar 2026: ఆంధ్రప్రదేశ్‌లో పదివేల పోస్టులతో జాబ్‌ క్యాలెండర్ విడుదల - ఏటా ఉగాదికి ఉద్యోగాల జాతర!
ఆంధ్రప్రదేశ్‌లో పదివేల పోస్టులతో జాబ్‌ క్యాలెండర్ విడుదల - ఏటా ఉగాదికి ఉద్యోగాల జాతర!

వీడియోలు

PM Modi Work at Assam Tea Gardens | అస్సాం తేయాకు తోటల్లో ఆకులు తెంపిన ప్రధాని మోదీ | ABP Desam
LSG vs DC Match Preview IPL 2026 | ఈ సీజన్ లో తొలి మ్యాచ్ ఆడనున్న లక్నో, ఢిల్లీ | ABP Desam
Irfan pathan on ACA Restrictions | ఐపీఎల్ పై అజమాయిషీనా..సొంత జట్టు ప్రయోజనాల కోసమా.? | ABP Desam
Cooper Connolly 72 vs GT IPL 2026 | పంజాబ్ కు మొదటి మ్యాచ్ లో వరంలా కూపర్ కాన్లే | ABP Desam
PBKS vs GT IPL 2026 Match Highlights | గుజరాత్ టైటాన్స్ పై మూడు వికెట్లతో పంజాబ్ విజయం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Musi Beautification Project: మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై ప్రభుత్వానికి ఊరట! కార్తీక్ రెడ్డి వేసిన పిటిషన్ కొట్టేసిన ఎన్జీటీ!
Musi Beautification Project: మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై ప్రభుత్వానికి ఊరట! కార్తీక్ రెడ్డి వేసిన పిటిషన్ కొట్టేసిన ఎన్జీటీ!
Bhumana Karunakar Reddy : భూమ‌న నేతృత్వంలో మ‌త మార్పిడి! తనను క్రిస్టియన్ అని ప్రచారం చేస్తున్న వారికి కౌంటర్‌!
భూమ‌న నేతృత్వంలో మ‌త మార్పిడి! తనను క్రిస్టియన్ అని ప్రచారం చేస్తున్న వారికి కౌంటర్‌!
Ranabaali Leaks : రణబాలి వీడియో లీక్ - సీమ యాసలో విజయ్ దేవరకొండ డైలాగ్స్... ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే
రణబాలి వీడియో లీక్ - సీమ యాసలో విజయ్ దేవరకొండ డైలాగ్స్... ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే
Telangana Meeseva Charges: తెలంగాణలో మీసేవ ఛార్జీలు భారీగా పెంపు! ఏయే సర్టిఫికెట్‌కు ఎంతు తీసుకుంటారు?
తెలంగాణలో మీసేవ ఛార్జీలు భారీగా పెంపు! ఏయే సర్టిఫికెట్‌కు ఎంతు తీసుకుంటారు?
Petro Price Hike: ఎన్నికల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు పెంపు తప్పదా? ముడి చమురు సెగ ఏ స్థాయిలో ఉందో తెలుసా?
ఎన్నికల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు పెంపు తప్పదా? ముడి చమురు సెగ ఏ స్థాయిలో ఉందో తెలుసా?
Amaravati: అమరావతికి అండగా నిలబడ్డ కేంద్రానికి మద్దతుగా ఇంటి ముందు దీపాలు వెలిగించండి! రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు పిలుపు!
అమరావతికి అండగా నిలబడ్డ కేంద్రానికి మద్దతుగా ఇంటి ముందు దీపాలు వెలిగించండి! రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు పిలుపు!
Target Harish Rao: తెలంగాణలో అందరి టార్గెట్ హరీష్ రావేనా - ట్రబుల్ షూటర్ చుట్టూ జరుగుతున్న రాజకీయం ఇదేనా?
తెలంగాణలో అందరి టార్గెట్ హరీష్ రావేనా - ట్రబుల్ షూటర్ చుట్టూ జరుగుతున్న రాజకీయం ఇదేనా?
Nagarjuna : పాతికేళ్ల యువకుడిగా నాగ్! - కింగ్ 100వ సినిమా స్టోరీ అదేనా?
పాతికేళ్ల యువకుడిగా నాగ్! - కింగ్ 100వ సినిమా స్టోరీ అదేనా?
Embed widget