News
News
X

Almonds: రోజుకి ఎన్ని బాదం పప్పులు తినాలి? ఎలా తినాలి? కలిగే ప్రయోజనాలంటి? 

బాదం పప్పులు ఒకరు ఎన్ని తినాలి? ఎలా తినాలి? అన్న సందేహాలు మాత్రం చాలా మందికి ఉన్నాయి. ఇప్పుడు ఈ సందేహాలన్నింటినీ తీర్చుకుందాం. 

FOLLOW US: 

డ్రై ఫ్రూట్స్ తినాలని ఇటీవల కాలంలో అందరికీ అవగాహన వచ్చింది. రెండు మూడు సంవత్సరాల క్రితం తక్కువ మంది డ్రై ఫ్రూట్స్ తినేవాళ్లు. ఈ కరోనా కారణంగా ఆరోగ్యంపై అవగాహన పెరిగి ప్రతి ఇంట్లో ఉదయం బాదం పప్పులు నానబెట్టుకుని తింటున్నారు. అసలు బాదం పప్పులు ఒకరు ఎన్ని తినాలి? ఎలా తినాలి? అన్న సందేహాలు మాత్రం చాలా మందికి ఉన్నాయి. ఇప్పుడు ఈ సందేహాలన్నింటినీ తీర్చుకుందాం. 

Also Read: పరగడుపును గోరు వెచ్చని నీళ్లు తాగితే ఎన్నో లాభాలో... ఆ లాభాలేంటో మీరు తెలుసుకోండి

డ్రై ఫ్రూట్స్ లో బాదం పప్పుది కీలక పాత్ర అని చెప్పవచ్చు. చాలా రకాల అనారోగ్య సమస్యలను తరిమికొట్టడంతోపాటు.. జుట్టు రాలడం లాంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. మరి బాదం పప్పును ఎలా తినాలన్న దానిపై వైద్యులు ఏమంటున్నారంటే... ఒక కప్పు బాదం పప్పులలో సుమారు 11.5 గ్రాముల కొవ్వు మరియు 5 గ్రాముల ప్రోటీన్లు కలిగి ఉంటాయి. బాదంలో ఉండే కొవ్వు గుండెకు చాల మంచిది. జీర్ణ శక్తిని, చర్మ కాంతిని కూడా పెంచుతాయి. కీళ్ల నొప్పుల సమస్య ను కూడా తగ్గిస్తుంది. 

Also Read: మలేరియా, డెంగ్యూ బారిన పడిన వారు త్వరగా కోలుకోవాలంటే... ఈ చిట్కాలు పాటించండి

News Reels

లాభాలు ఎక్కువగా ఉన్నాయని ఎక్కువ మొత్తంలో బాదం పప్పులను తీసుకోకూడదు. బాదం పప్పులు తినడం కొత్తగా ప్రారంభించిన వారు రోజుకి కేవలం 4 లేదా 5 బాదం పప్పులు తింటే సరిపోతుంది.  ఇక దీనిని ఎలా తినాలి అనే విషయానికి వస్తే.. రాత్రిపూట నీటిలో నానపెట్టి ఉదయాన్నే దాని పొట్టు తీసేసి తినాలి. అలా తింటే.. ఈ బాదంలోని పోషకాలన్నీ మన సొంతమవుతాయి. ఆహార నిపుణుల సూచన ప్రకారం రోజుకు 8 నుంచి 10 బాదం పప్పులు తింటే చాలు. బరువు తగ్గేందుకు, కండలు పెంచేందుకు, జుట్టు బాగా పెరిగేందుకు ఈ మోతాదు సరిపోతుంది. అయితే, బాదంను నేరుగా తినేయకుండా నీటిలో 7 నుంచి 8 గంటలు నానబెట్టి, తొక్క తీసి తినడం మంచిది. నానబెట్టడం వల్ల పోషకాలు వేగంగా శరీరానికి అందుతాయి.

Also Read: ఈ విధంగా పుదీన రసం తీసుకుంటే... లివర్ క్లీన్ అవుతుంది... వ్యర్థాలు పోతాయి

బాదం పప్పులు ప్రెగ్నెన్సీ మహిళలకు చాలా మంచిది. దీని వల్ల కడుపులో పెరిగే బిడ్డకి కూడా అన్ని రకాల పోషక విలువలు పుష్కలంగా అందుతాయి.  మన జుట్టుకు కావాల్సిన అన్ని రకాల విటమిన్లూ, పోషకాలూ బాదంలో ఉంటాయి. ముఖ్యంగా జుట్టును ఒత్తుగా, గట్టిగా, బలంగా పెంచే మెగ్నీషియం, జింక్ విటమిన్ E బాదంలలో ఉంటాయి. అలాగే... జుట్టును ఎక్కువ కాలం నిలిచి ఉండేలా చేసే విటమిన్ B బాదంపప్పుల్లో ఉంటుంది.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ఈ కథనానికి ‘abp దేశం’ ఎలాంటి బాధ్యత వహించదని గమనించగలరు. 

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 29 Sep 2021 03:58 PM (IST) Tags: Health Almonds Almond Heaith Tips

సంబంధిత కథనాలు

Dental Care: టూత్ పేస్ట్ లేకుండా బ్రష్ చెయ్యొచ్చా? నిపుణులు ఏం సూచిస్తున్నారు?

Dental Care: టూత్ పేస్ట్ లేకుండా బ్రష్ చెయ్యొచ్చా? నిపుణులు ఏం సూచిస్తున్నారు?

అల్ బుకరా పండ్లు కనిపిస్తే కచ్చితంగా తినండి, ఈ సమస్యలనీ దూరం అయిపోతాయి

అల్ బుకరా పండ్లు కనిపిస్తే కచ్చితంగా తినండి,  ఈ సమస్యలనీ దూరం అయిపోతాయి

Kids: శీతాకాలంలో పిల్లలకి కచ్చితంగా పెట్టాల్సిన ఆహారాలు ఇవే

Kids: శీతాకాలంలో పిల్లలకి  కచ్చితంగా పెట్టాల్సిన ఆహారాలు ఇవే

స్పైసీ ఫుడ్ తిన్నాక మండిపోతున్న ఫీలింగ్ తగ్గాలంటే వీటిని తినాలి

స్పైసీ ఫుడ్ తిన్నాక మండిపోతున్న ఫీలింగ్ తగ్గాలంటే వీటిని తినాలి

Freezer: ఈ ఆహార పదార్థాలు అసలు ఫ్రిజ్‌లో నిల్వ చెయ్యకండి

Freezer: ఈ ఆహార పదార్థాలు అసలు ఫ్రిజ్‌లో నిల్వ చెయ్యకండి

టాప్ స్టోరీస్

YS Jagan: రాజ్యాంగం స్ఫూర్తితో 35 నెలల పాలనలో ఏపీలో ఎన్నో మార్పులు: సీఎం జగన్

YS Jagan: రాజ్యాంగం స్ఫూర్తితో 35 నెలల పాలనలో ఏపీలో ఎన్నో మార్పులు: సీఎం జగన్

Attack on TDP leader: నెల్లూరులో దారుణం, సిటీ టీడీపీ ఇన్ ఛార్జ్‌పై కారుతో దాడి

Attack on TDP leader: నెల్లూరులో దారుణం, సిటీ టీడీపీ ఇన్ ఛార్జ్‌పై కారుతో దాడి

Konaseema District: చేపల వేట హద్దుల కోసం Boat Race, ఎంచక్కా వీడియో వీక్షించండి

Konaseema District: చేపల వేట హద్దుల కోసం Boat Race, ఎంచక్కా వీడియో వీక్షించండి

Manjima Mohan Pre Wedding Pics: హీరో హీరోయిన్ల ప్రీ వెడ్డింగ్ ఫొటోలు ట్రెండింగ్ , మీరు ఓ లుక్కేయండి

Manjima Mohan Pre Wedding Pics: హీరో హీరోయిన్ల ప్రీ వెడ్డింగ్ ఫొటోలు ట్రెండింగ్ , మీరు ఓ లుక్కేయండి