అన్వేషించండి

Petrol Price Hike May 2026: పది రోజుల్లో మూడోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! మీ ప్రాంతంలో రేట్లు ఎంత?

Petrol Price Hike May 2026: పెట్రోల్, డీజిల్ ధరలు మళ్ళీ పెరిగాయి. 10 రోజుల్లో ఇలా పెరగడం ఇది మూడోసారి. అంతర్జాతీయ ఉద్రిక్తతల వేళ సామాన్యుడిపై ప్రభావం పడుతోంది. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మే 23న పెరిగాయి.
  • ఢిల్లీలో పెట్రోల్, డీజిల్ ధరలు గణనీయంగా పెరిగాయి.
  • గత పది రోజుల్లో ఇంధన ధరలు సుమారు రూ.5 పెరిగాయి.
  • అంతర్జాతీయ ముడి చమురు ధరలు, ఉద్రిక్తతలు ధరల పెరుగుదలకు కారణం.

Petrol Price Hike May 2026: దేశంలో చమురు ధరల పెంపు కొనసాగుతోంది. మే నెలలో సామాన్యుడిపై మరోసారి భారం పడింది. శనివారం (మే 23, 2026) దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను చమురు సంస్థలు పెంచాయి. గత పది రోజుల్లోనే ధరలు పెరగడం ఇది మూడోసారి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరగడం, పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతలకు పుల్‌స్టాప్ పడలేదని ఇలా పెట్రోల్ ధరలు పెంచుతున్నారు.  

నేటి తాజా ధరలు ఇవే 

దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు 87 పైసలు, డీజిల్ ధర 91 పైసలు పెరిగింది. దీంతో ఢిల్లీలో పెట్రోల్ ధర రూ. 98.64 నుంచి రూ. 99.51కి, డీజిల్ ధర రూ.91.58 నుంచి రూ. 92.49కి చేరింది.

ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు (లీటరుకు):

హైదరాబాద్‌: పెట్రోల్ రూ. 111.88 (+0.87), డీజిల్ రూ. 99.95 (+0.91).

ముంబై: పెట్రోల్ రూ. 108.49 (+0.87), డీజిల్ రూ. 95.02 (+0.91).

కోల్‌కతా: పెట్రోల్ రూ. 110.64 (+0.87), డీజిల్ రూ. 97.02 (+0.91).

చెన్నై: పెట్రోల్ రూ. 105.31 (+0.87), డీజిల్ రూ. 96.98 (+0.91).

గురుగ్రామ్: పెట్రోల్ రూ. 100.38 (+0.87), డీజిల్ రూ. 92.92 (+0.91).

నోయిడా: పెట్రోల్ రూ. 98.78 (+0.87), డీజిల్ రూ. 93.12 (+0.91).

గత 10 రోజుల్లో ఏం జరిగింది? 

ఈ నెలలో పెట్రోల్ ధరల బాదుడు మే 16న ప్రారంభమైంది. ఆ రోజు పెట్రోల్, డీజిల్ ధరలు ఏకంగా లీటరుకు రూ. 3 వరకు పెంచారు. ఆ తర్వాత మే 19న మెట్రో నగరాల్లో మరో 90 పైసలు పెరిగాయి. తాజా పెరుగుదలతో కలిపి చూస్తే, గత పది రోజుల్లోనే ఇంధన ధరలు దాదాపు రూ.5 మేర పెరిగాయి. కేవలం పెట్రోల్, డీజిల్ ధరలే కాకుండా ఇటీవలి రోజుల్లో సిఎన్‌జి (CNG), పిఎన్‌జి (PNG) ధరలు కూడా పలు నగరాల్లో పెరిగాయి.  

ధరలు ఎందుకు పెరుగుతున్నాయి? 

అంతర్జాతీయ ముడి చమురు ధరలు పెరగడంతో ఇలా ధరలు పెంచుతున్నారు. ప్రపంచ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు నిలకడగా పెరుగుతున్నాయి. దీంతో ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. వెస్ట్ ఆసియాలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. భారత్ తన ముడి చమురు అవసరాల కోసం దాదాపు 85 శాతం దిగుమతులపైనే ఆధారపడుతోంది. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్‌లో ఏ చిన్న మార్పు వచ్చినా, అది మన దేశీయ ధరలపై ప్రభావం చూపుతుంది

సామాన్యుడిపై ప్రభావం  

వరుసగా పెరుగుతున్న ఇంధన ధరలు అన్ని రంగాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
రవాణా, లాజిస్టిక్స్ ఖర్చులు పెరుగుతాయి. దీంతో నిత్యావసర వస్తువులు, పండ్లు, కూరగాయల ధరలు పెరిగే ప్రమాదం ఉంది. రవాణా భారం పెరిగితే అది చివరకు సామాన్య వినియోగదారుడిపైనే పడుతుంది, దీనివల్ల ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉంది. మే నెలలో మూడోసారి జరిగిన ఈ ధరల పెంపు మధ్యతరగతి జీవి బడ్జెట్‌ను అస్తవ్యస్తం చేస్తోంది.                

Frequently Asked Questions

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరగడం, పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా ఈ ధరల పెరుగుదల ఉంది.

మే నెలలో ఇంధన ధరలు ఎంత మేర పెరిగాయి?

మే నెలలో పెట్రోల్, డీజిల్ ధరలు ఇప్పటికే రెండుసార్లు పెరిగాయి. తాజా పెరుగుదలతో కలిపి గత పది రోజుల్లోనే ఇంధన ధరలు దాదాపు రూ.5 మేర పెరిగాయి.

ప్రధాన నగరాల్లో నేటి పెట్రోల్, డీజిల్ ధరలు ఎంత?

ఢిల్లీలో పెట్రోల్ రూ.99.51, డీజిల్ రూ.92.49గా ఉంది. హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.111.88, డీజిల్ రూ.99.95గా ఉంది.

పెరుగుతున్న ఇంధన ధరలు సామాన్యుడిపై ఎలాంటి ప్రభావం చూపుతాయి?

రవాణా, లాజిస్టిక్స్ ఖర్చులు పెరిగి, నిత్యావసర వస్తువులు, పండ్లు, కూరగాయల ధరలు పెరిగే అవకాశం ఉంది. ఇది ద్రవ్యోల్బణాన్ని పెంచుతుంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
Ayodhya Ram Mandir News: అయోధ్య రామ మందిరం విరాళాల కేసులో బిగ్ ట్విస్ట్ ! చంపత్ రాయ్, అనిల్ మిశ్రాలకు క్లీన్ చిట్!
అయోధ్య రామ మందిరం విరాళాల కేసులో బిగ్ ట్విస్ట్ ! చంపత్ రాయ్, అనిల్ మిశ్రాలకు క్లీన్ చిట్!
Tamil Nadu Politics Vijay: వ్యక్తిగత జీవితం వర్సెస్ పొలిటికల్ క్లీన్ ఇమేజ్ - త్రిష అంశం విజయ్ రాజకీయాన్ని మార్చేస్తుందా?
వ్యక్తిగత జీవితం వర్సెస్ పొలిటికల్ క్లీన్ ఇమేజ్ - త్రిష అంశం విజయ్ రాజకీయాన్ని మార్చేస్తుందా?
Breaking News: మార్కాపురం జిల్లాకు ‘చంద్రన్న మార్కాపురం జిల్లా’గా పేరు పెట్టాలని విజ్ఞప్తి
మార్కాపురం జిల్లాకు ‘చంద్రన్న మార్కాపురం జిల్లా’గా పేరు పెట్టాలని విజ్ఞప్తి
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget