Diet Tips For Dengue And Malaria: మలేరియా, డెంగ్యూ బారిన పడిన వారు త్వరగా కోలుకోవాలంటే... ఈ చిట్కాలు పాటించండి
న్యూట్రిషనిస్ట్ రుజుత దివేకర్... మలేరియా, డెంగ్యూ బారిన పడిన వారు త్వరగా కోలుకునేందుకు ఏం చేయాలో నెటిజన్లతో పంచుకున్నారు.
వర్షాకాలంలో చాలా మంది కొన్ని రకాల ఇన్‌ఫెక్షన్లకు, జ్వరాల బారిన పడుతుంటారు. ఇక డెంగ్యూ, మలేరియా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ వ్యాధుల బారిన పడిన వారు కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. ప్రముఖ సెలబ్రెటీ న్యూట్రిషనిస్ట్ రుజుత దివేకర్... మలేరియా, డెంగ్యూ బారిన పడిన వారు త్వరగా కోలుకునేందుకు ఏం చేయాలో నెటిజన్లతో పంచుకున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
నాలుగు రోజుల క్రితం రుజుత తన ఇన్‌స్టాగ్రామ్‌లో... డెంగ్యూ, మలేరియా నుంచి త్వరగా కోలుకునేందుకు ఇవి పాటించండి. ఇవి చేసుకోవడం ఎంతో సులువు’ అని రాసుకొచ్చారు. అందులో మొదటిది ఏంటంటే...
* ఒక టీ స్పూన్ గుల్కండ్‌ని పరగడుపున తీసుకోవాలి. లేదంటే భోజనానికి భోజనానికి మధ్య తీసుకోవాలి. దీని వల్ల అలసట, యాసిడిటీ తగ్గుతుంది.
View this post on Instagram
* ఇక రెండోది... ఒక గ్లాసు పాలు, ఒక గ్లాసు నీళ్లు తీసుకుని చిటికెడు పసుపు కలపాలి. దీనికి రెండు లేదా మూడు కుంకుమ పువ్వు రేకులు, చిటికెడు జాజికాయ పొడి వేసి ఈ నీటిని సగం అయ్యే వరకు ఉడికించాలి. ఆ తర్వాత ఈ జ్యూస్‌ని గోరువెచ్చగా లేదా చల్లారిన తర్వాత టేస్టుకు సరిపడా బెల్లం వేసి కలుపుకుని తాగాలి. ఈ జ్యూస్ తీసుకోవడం వల్ల వాపులు తగ్గుతాయి.
* అన్నం ఉడికించిన నీళ్ల (గంజి)కి నల్ల ఉప్పు, చిటికెడు ఇంగువ, టీ స్పూన్ నెయ్యి వేసి బాగా కలిపి తాగాలి. ఇలా తాగడం వల్ల డ్రీహైడ్రేషన్‌కి గురికాకుండా ఉండొచ్చు.
* అలాగే వీలుకుదిరినప్పుడల్లా కొద్దికొద్దిగా మంచి నీళ్లు తాగితే డీహైడ్రేష్ బారిన పడకుండా ఉంటాం. అలా తాగుతూ యూరిన్‌కి వెళ్తుండాలి. యూరిన్‌కి వెళ్లిన సమయంలో రంగును పరీక్షించుకోండి.
* నడుం నొప్పి, ఒళ్లు నొప్పులు, అలసట నుంచి ఉపశమనం పొందేందుకు Supta badhakonasana ఆసనం వేయాలి. నడుం, మెడ కింద దుప్పటి పెట్టుకుని ఈ ఆసనం వేయాలి.
అంతకుముందు ఈ న్యూట్రిషనిస్టు WFH చేసే వాళ్ల కోసం కొన్ని ఎక్సర్ సైజ్‌లు కూడా సూచించారు. ఈ చిట్కాలు పాటించి ఆరోగ్యంగా ఉండండి.
View this post on Instagram
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ఈ కథనానికి ‘abp దేశం’ ఎలాంటి బాధ్యత వహించదని గమనించగలరు.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి