Nizamabad Mayor Husband | మేయర్ భర్త ఉంటాడో పోతాడో తెలీదంటూ దాడి చేసిన వ్యక్తి సంచలన వీడియో
ఒక ఆటో డ్రైవర్ నిజామాబాద్ మేయర్ భర్తపై దాడి చేశాడు. మేయర్ దండు నీతూ కిరణ్ భర్త మాజీ కార్పొరేటర్ శేఖర్ పై నడిరోడ్డుపైనే నిందితుడు రక్తం వచ్చేలా సుత్తితో దాడి చేశాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. అక్కడి నాగారంలోని కార్పొరేటర్ కు సంబంధించిన కార్యాలయం వద్ద ఆటో డ్రైవర్ శేఖర్ ను తోసేసి.. కాలుతో తన్ని.. తర్వాత సుత్తితో కూడా దాడి చేసి కొట్టాడు. అక్కడికి చేరుకున్న ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. ఆ తర్వాత ఆటో డ్రైవర్ ఓ వీడియోను విడుదల చేశాడు. తన భూమిని కొందరు కబ్జా చేశారని.. వారికి మేయర్ భర్త సపోర్ట్ గా ఉన్నారని వాపోయారు. పైగా తన నుంచే లక్షల్లో డబ్బులు డిమాండ్ చేస్తున్నారని వాపోయాడు. భూమిని కబ్జా చేసిన తన కడుపు మీద కొట్టొద్దని.. తన భూమిని తనకు ఇప్పించాలని ఎన్నోసార్లు వేడుకున్నానని కూడా చెప్పాడు.





















