TECNO POP 9: 6 జీబీ ర్యామ్ ఫోన్ రూ.10 వేలలోపే - ఐఫోన్ తరహా డిజైన్‌తో టెక్నో పాప్ 9!
TECNO New Phone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ టెక్నో మనదేశంలో త్వరలో ఒక బడ్జెట్ స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేయనుంది. అదే టెక్నో పాప్ 9. దీని ధర రూ.10 వేలలోపే ఉండే అవకాశం ఉంది.
TECNO POP 9 India Launch: టెక్నో కంపెనీ చాలా తక్కువ సమయంలో భారతదేశంలో చాలా ప్రజాదరణ పొందింది. ముఖ్యంగా బడ్జెట్ రేంజ్ సెగ్మెంట్‌లో ఈ కంపెనీకి చెందిన ఫోన్‌లు బాగా సక్సెస్ అవుతున్నాయి. ఎందుకంటే కంపెనీ చాలా తక్కువ ధరలో అనేక ఆధునిక స్పెసిఫికేషన్లు, ఫీచర్లతో కూడిన ఫోన్‌లను మార్కెట్‌లో లాంచ్ చేస్తుంది. భారతదేశ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ చాలా పెద్దది. దీని కారణంగా టెక్నో కంపెనీ చాలా తక్కువ సమయంలో ఎక్కువ ప్రజాదరణ పొందింది. ఇప్పుడు కంపెనీ టెక్నో పాప్ 9 పేరుతో మరో కొత్త ఫోన్‌ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది.
టెక్నో పాప్ 9 లాంచ్ ఎప్పుడు?
టెక్నో సెప్టెంబర్ నెలలో టెక్నో పాప్ 9 5జీ పేరుతో కొత్త ఫోన్‌ను విడుదల చేసింది. ఇప్పుడు కంపెనీ ఈ ఫోన్‌కు సంబంధించిన 4జీ మోడల్‌ను టెక్నో పాప్ 9 పేరుతో లాంచ్ చేయనుంది. ఈ కొత్త 4జీ మోడల్ మైక్రోసైట్ అమెజాన్‌లో కూడా లైవ్ అయింది. దీని ద్వారా ఈ ఫోన్‌కు సంబంధించిన ప్రత్యేక ఫీచర్ల గురించి బయటకు వచ్చింది. ఇది కాకుండా ఫోన్ లాంచ్ తేదీని కూడా రివీల్ చేశారు.
Also Read: 1.77 కోట్ల సిమ్ కార్డులు బ్లాక్ చేసిన ట్రాయ్ - మీ సిమ్ బ్లాక్ అయిందేమో చూసుకోండి!
టెక్నో పాప్ 9 నవంబర్ 22వ తేదీన భారతదేశంలో లాంచ్ కానుంది. ఈ ఫోన్ అమెజాన్‌లో అందుబాటులో ఉంది. ఈ టెక్నో ఫోన్ 6.67 అంగుళాల స్క్రీన్‌ను కలిగి ఉంది. ఇది 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేయనుంది. మీడియాటెక్ హీలియో జీ50 చిప్‌సెట్‌పై ఇది రన్ కానుంది. 6 జీబీ వరకు ర్యామ్, 64 జీబీ వరకు స్టోరేజ్ ఈ స్మార్ట్ ఫోన్‌లో ఉండనున్నాయి.
కెమెరా, బ్యాటరీ ఎలా ఉన్నాయి?
ఫోటోగ్రఫీ కోసం ఈ ఫోన్ వెనుక భాగంలో 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫోన్ ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు. ఈ బడ్జెట్ ఫోన్‌లో కంపెనీ 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించింది. ఈ ఫోన్ బ్యాటరీ ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 100 గంటల వరకు మ్యూజిక్ ప్లేబ్యాక్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. కంపెనీ ఈ ఫోన్‌ను గ్లిట్టరీ వైట్, లైమ్ గ్రీన్, స్టార్‌ట్రైల్ బ్లాక్ అనే మూడు కలర్ ఆప్షన్‌లలో లాంచ్ చేయనుంది. ఈ ఫోన్ ధర రూ.10,000 లోపే ఉండవచ్చని అంచనా.
ఐఫోన్ తరహా డిజైన్‌తో...
ఈ స్మార్ట్ ఫోన్ వెనకవైపు కెమెరాల సెటప్ చూడటానికి ఐఫోన్ కెమెరా సెటప్‌లో ఉండటం విశేషం. మరి యాపిల్ ఐఫోన్లలో ఉండే డైనమిక్ ఐల్యాండ్ తరహా సెటప్ ముందు వైపు ఉందో లేదో తెలియాలంటే ఫోన్ వచ్చే దాకా ఆగాల్సిందే. ఫోన్ పూర్తిగా కవర్ అయ్యేలా బాక్ కేస్ వేసి కేవలం కెమెరాలు మాత్రమే కనిపించేలా ఉంచితే చూసినవాళ్లు కచ్చితంగా ఐఫోన్ అనే అనుకుంటారు.
Also Read: రూ.11కే 10 జీబీ డేటా - బెస్ట్ ప్లాన్ తెచ్చిన జియో - కానీ వ్యాలిడిటీ మాత్రం!