అన్వేషించండి

Jio Cheapest Data Voucher: రూ.11కే 10 జీబీ డేటా - బెస్ట్ ప్లాన్ తెచ్చిన జియో - కానీ వ్యాలిడిటీ మాత్రం!

Jio New Data Voucher: భారతదేశ నంబర్ వన్ మొబైల్ నెట్ వర్క్ జియో తన కొత్త డేటా ప్లాన్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. అదే రూ.11 ప్లాన్. ఈ ప్లాన్ కింద గంట వ్యాలిడిటీతో 10 జీబీ డేటా లభిస్తుంది.

Reliance Jio New Data Voucher: రిలయన్స్ జియో ఇటీవలే ఒక కొత్త డేటా వోచర్‌ను లాంచ్ చేసింది. దీని ధర కేవలం రూ. 11గా ఉంది. రోజువారీ డేటా లిమిట్ అయిపోయాక అదనపు డేటా అవసరమయ్యే వినియోగదారుల కోసం ఇది ఉపయోగపడుతుంది. జియో అందిస్తున్న రూ. 11 డేటా వోచర్ 10 జీబీ హై స్పీడ్ 4జీ డేటాను అందిస్తుంది. కానీ దీని వాలిడిటీ కేవలం ఒక గంట మాత్రమే. ఇది ఇంటర్నెట్ సేవలకు మాత్రమే ఉపయోగపడుతుంది. దీనిలో కాల్, ఎస్ఎంఎస్ లాభాలను కంపెనీ అందించడం లేదు.

భారతదేశంలో చవకైన రీఛార్జ్ ప్లాన్
ఈ డేటా వోచర్ మైజియో యాప్, వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. కానీ చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ వోచర్ బేస్ ప్యాక్ లేకుండా కూడా పని చేస్తుంది. అయితే ఈ సందర్భంలో మీ కనెక్టివిటీ కేవలం ఇంటర్నెట్‌కు మాత్రమే పరిమితం అవుతుంది. మీరు కాలింగ్, SMSలను కలిగి ఉన్న బేస్ ప్యాక్‌ని కలిగి ఉంటే దీంతో పాటు ఈ డేటా వోచర్‌ను ఉపయోగించవచ్చు. ఇతర టెలికాం సేవలను కూడా పొందవచ్చు.

Also Read: ఒక్క రూపాయి తేడాతో 28 జీబీ డేటా, 22 ఓటీటీ యాప్స్ - ఈ జియో, ఎయిర్‌టెల్ ప్లాన్లలో ఏది బెస్ట్?

జియో అందిస్తున్న రూ. 11 డేటా వోచర్ ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. అయితే ఈ వోచర్ కొన్ని పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లలో పని చేయకపోవచ్చు. ప్రస్తుతం ఈ వోచర్ భారతదేశంలో అత్యంత చవకైన డేటా ప్యాక్‌గా ఉంది.

ఎయిర్‌టెల్, వొడాఫోన్ అందిస్తున్న చవకైన ప్లాన్లు ఇవే...
ఎయిర్‌టెల్ అందిస్తున్న చవకైన డేటా ప్లాన్ రూ. 49గా ఉంది. ఇది ఒక్క రోజుకు అపరిమిత 4జీ డేటాను అందిస్తుంది. వొడాఫోన్ ఐడియా అందిస్తున్న చవకైన ప్లాన్ రూ. 23గా ఉంది. ఇది 1 జీబీ డేటాను అందిస్తుంది. దీని వాలిడిటీ ఒక్క రోజు మాత్రమే. జియో అందిస్తున్న రూ. 11 డేటా వోచర్ తక్కువ వ్యవధిలో హై స్పీడ్ డేటాను కోరుకునే వారికి చవకైన ప్లాన్ల కోసం వెతుకుతున్న వారికి గొప్ప ఆప్షన్ అని చెప్పవచ్చు.

భారత దేశ నంబర్ వన్ టెలికాం కంపెనీ రిలయన్స్ జియో తన ఐఎస్‌డీ రీఛార్జ్ ప్లాన్ల ధరలను సవరించింది. ఇప్పుడు రూ.39 నుంచే జియో ఐఎస్‌డీ ప్లాన్లు ప్రారంభం కానుండటం విశేషం. ఈ కొత్త ప్లాన్లు ఏడు రోజుల పాటు కాలింగ్ కోసం స్పెషల్ మినిట్స్‌ను అందిస్తాయి. ఈ ఐఎస్‌డీ మినిట్స్ అత్యంత తక్కువ ధరలకు లభిస్తాయని జియో అధికారికంగా పేర్కొంది. బంగ్లాదేశ్, యూకే, సౌదీ అరేబియా, నేపాల్, చైనా, జర్మనీ, నైజీరియా, పాకిస్తాన్, ఖతార్, న్యూజిలాండ్, శ్రీలంక, స్విట్జర్లాండ్, స్పెయిన్, ఇండోనేషియా దేశాలకు రిలయన్స్ జియో ఐఎస్‌డీ రీఛార్జ్ ప్లాన్‌ల రేట్లను సవరించింది. కానీ రిలయన్స్ జియో ప్రీపెయిడ్ ప్లాన్ల ధరలను పెంచిన తర్వాత దాని కస్టమర్లు బీఎస్ఎన్ఎల్‌కు పోర్ట్ అవుతున్నారు.

Also Read: రూ.10 వేలలోపు 128 జీబీ ఫోన్ - వివో వై18టీ వచ్చేసింది - ఫీచర్లు ఎలా ఉన్నాయి?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Latest News : తెలంగాణలో భూమిలేని పేదలకు గుడ్ న్యూస్- 12 వేలు ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్
తెలంగాణలో భూమిలేని పేదలకు గుడ్ న్యూస్- 12 వేలు ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్
AP CM Chandra Babu: పొట్టి శ్రీరాముల పేరుతో తెలుగు యూనివర్శిటీ- విజయవాడలో ప్రకటించిన సీఎం చంద్రబాబు 
ఏపీలో పొట్టి శ్రీరాముల పేరుతో తెలుగు యూనివర్శిటీ- విజయవాడలో ప్రకటించిన సీఎం చంద్రబాబు 
MLC Kavitha Tour: జగిత్యాలలో 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహం- ప్రభుత్వ జీవో ధిక్కరించి భూమి పూజ చేసిన కవిత 
జగిత్యాలలో 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహం- ప్రభుత్వ జీవో ధిక్కరించి భూమి పూజ చేసిన కవిత 
Jamaili Elections: జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు   ఖాళీ అయిపోయిన గ్రామం..!చంద్రబాబును ఫోటో అడిగిన బాలిక, వచ్చేయమన్న సీఎం-అంతా షాక్వీడియో: మహిళపై చిరుతపులి దాడి, ముఖమంతా రక్తం!నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Latest News : తెలంగాణలో భూమిలేని పేదలకు గుడ్ న్యూస్- 12 వేలు ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్
తెలంగాణలో భూమిలేని పేదలకు గుడ్ న్యూస్- 12 వేలు ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్
AP CM Chandra Babu: పొట్టి శ్రీరాముల పేరుతో తెలుగు యూనివర్శిటీ- విజయవాడలో ప్రకటించిన సీఎం చంద్రబాబు 
ఏపీలో పొట్టి శ్రీరాముల పేరుతో తెలుగు యూనివర్శిటీ- విజయవాడలో ప్రకటించిన సీఎం చంద్రబాబు 
MLC Kavitha Tour: జగిత్యాలలో 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహం- ప్రభుత్వ జీవో ధిక్కరించి భూమి పూజ చేసిన కవిత 
జగిత్యాలలో 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహం- ప్రభుత్వ జీవో ధిక్కరించి భూమి పూజ చేసిన కవిత 
Jamaili Elections: జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
PV Sindhu Meets Pawan Kalyan: సార్‌, పెళ్లికి రండీ! డిప్యూటీ సీఎం పవన్‌ను ఆహ్వానించిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు
సార్‌, పెళ్లికి రండీ! డిప్యూటీ సీఎం పవన్‌ను ఆహ్వానించిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు
Upcoming 5G Smartphones: వచ్చే వారం మార్కెట్లోకి మూడు బడ్జెట్ ఫోన్లు - రూ.9 వేలలోపే 5జీ మొబైల్ కూడా!
వచ్చే వారం మార్కెట్లోకి మూడు బడ్జెట్ ఫోన్లు - రూ.9 వేలలోపే 5జీ మొబైల్ కూడా!
Allu Arjun Meets Chiranjeevi: బిగ్ బాస్ ఇంటికి బన్నీ... అరెస్ట్, జైలు తర్వాత మావయ్య దగ్గరకు మొదటిసారి, పుష్ప 2 టీ షర్ట్ లేకుండా
బిగ్ బాస్ ఇంటికి బన్నీ... అరెస్ట్, జైలు తర్వాత మావయ్య దగ్గరకు మొదటిసారి, పుష్ప 2 టీ షర్ట్ లేకుండా
Group 2 Exams: కొంపముంచిన ఆ ఒక్క 'నిమిషం' నిబంధన - గ్రూప్ 2 పరీక్షలకు దూరమైన అభ్యర్థులు
కొంపముంచిన ఆ ఒక్క 'నిమిషం' నిబంధన - గ్రూప్ 2 పరీక్షలకు దూరమైన అభ్యర్థులు
Embed widget