X

Warm Water: పరగడుపును గోరు వెచ్చని నీళ్లు తాగితే ఎన్నో లాభాలో... ఆ లాభాలేంటో మీరు తెలుసుకోండి

ఉదయం నిద్ర లేవగానే చాలా మంది టీ లేదా కాఫీ తాగుతుంటారు. ఖాళీ కడుపుతో ఇవి తాగడం వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువ. కానీ, నిజానికి ఉదయం నిద్ర లేవగానే పరగడుపున టీ, కాఫీలకు బదులు నీళ్లు తాగాలి.

FOLLOW US: 

ఉదయం నిద్ర లేవగానే చాలా మంది టీ లేదా కాఫీ తాగుతుంటారు. ఖాళీ కడుపుతో ఇవి తాగడం వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువ. కానీ, నిజానికి ఉదయం నిద్ర లేవగానే పరగడుపున టీ, కాఫీలకు బదులు నీళ్లు తాగాలి. అది కూడా గోరు వెచ్చని నీళ్లు తాగితే ఎన్నో లాభాలు. ఉదయం పరగడుపున రెండు గ్లాసులు గోరు వెచ్చని నీళ్లు తాగితే కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

Also Read: బత్తాయి రసంతో ఎన్ని ప్రయోజనాలో... జీర్ణాశయం శుభ్రం... షుగల్ లెవల్స్ డౌన్

* గోరు వెచ్చని నీళ్లను పరగడుపున తాగడం వల్ల కండరాలు, ఒళ్లు నొప్పులు తగ్గుతాయి. గోరు వెచ్చిని నీళ్లల్లో ఉండే వేడి నొప్పులను తగ్గించడంలో, కండరాలను శాంత పరచడంలో బాగా పనిచేస్తాయి. అంతేకాదు రుతుక్రమం సమయంలో కొందరు మహిళలు తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతుంటారు. పరగడుపున ఈ గోరు వెచ్చని నీరు తాగితే రుతు సమయంలో వచ్చే నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు. 

* గోరు వెచ్చని నీళ్లు తాగడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. పొడి చర్మం తేమగా మారుతుంది. చర్మంలో ఉండే వ్యర్థాలు బయటికి పోతాయి. దీంతో మొటిమలు, మచ్చలు తగ్గుతాయి. 

* గోరు వెచ్చని నీళ్లు తాగితే దగ్గు, జలుబు లాంటి చిన్న చిన్న సమస్యల నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు. శ్వాస కోశ సమస్యలు తగ్గుతాయి. 

* పరగడుపున గోరు వెచ్చని నీరు తాగితే జీర్ణ వ్యవస్థ శుభ్రం అవుతుంది. మలబద్దకం ఉండదు. విరేచనం సాఫీగా అవుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. జీర్ణ వ్యవస్థలో ఉండే వ్యర్థాలు, విష పదార్థాలు బయటికి వెళ్లిపోతాయి. గ్యాస్ సమస్య నుంచి కూడా బయటపడొచ్చు. 

Also Read: మలేరియా, డెంగ్యూ బారిన పడిన వారు త్వరగా కోలుకోవాలంటే... ఈ చిట్కాలు పాటించండి

* గోరు వెచ్చని నీరు తీసుకోవడం వల్ల శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. హైపీబీ తగ్గుతుంది. జుట్టు కుదుళ్లకు రక్త సరఫరా మెరుగుపడటంతో శిరోజాలకు పోషకాలు అందుతాయి. దీంతో శిరోజాలు ఆరోగ్యంగా, స్ట్రాంగ్‌గా పెరుగుతాయి. 

* నిత్యం గోరు వెచ్చని నీటిని తాగడం వల్ల అధిక బరువు తగ్గుతారు. డీ హైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు. గొంతు సమస్యలు ఉన్నవారు గోరు వెచ్చని నీరు తాగడం వల్ల ఉపయోగం ఉంటుంది. 

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ఈ కథనానికి ‘abp దేశం’ ఎలాంటి బాధ్యత వహించదని గమనించగలరు. 

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: Health Health Tips Water Warm Water

సంబంధిత కథనాలు

Covid-19 New variant: కరోనా మరో అవతారం.. ఏవై. 4.2.. ఇది చాలా ఫాస్ట్ గురూ! మరి భారత్‌కు వచ్చేసిందా?

Covid-19 New variant: కరోనా మరో అవతారం.. ఏవై. 4.2.. ఇది చాలా ఫాస్ట్ గురూ! మరి భారత్‌కు వచ్చేసిందా?

Corona Cases: దేశంలో కొత్తగా 15 వేల కేసులు నమోదు, 561 మంది మృతి

Corona Cases: దేశంలో కొత్తగా 15 వేల కేసులు నమోదు, 561 మంది మృతి

COVID-19 100 Cr Milestone Jabs: కొవిడ్ వ్యాక్సిన్ తయారీదారులతో ప్రధాని మోదీ భేటీ.. టీకాలపై మరిన్ని పరిశోధనలు

COVID-19 100 Cr Milestone Jabs: కొవిడ్ వ్యాక్సిన్ తయారీదారులతో ప్రధాని మోదీ భేటీ.. టీకాలపై మరిన్ని పరిశోధనలు

America-Onion-Salmonella: ఉల్లిపాయని చూసి వణికిపోతున్న అగ్రరాజ్యం

America-Onion-Salmonella: ఉల్లిపాయని చూసి వణికిపోతున్న అగ్రరాజ్యం

Congress: 100 కోట్ల డోసులా..సెప్టెంబర్‌లోనే చైనా 200 కోట్లు క్రాస్ చేసింది: కాంగ్రెస్

Congress: 100 కోట్ల డోసులా..సెప్టెంబర్‌లోనే చైనా 200 కోట్లు క్రాస్ చేసింది: కాంగ్రెస్

టాప్ స్టోరీస్

Ind Vs Pak: పంతం నీదా.. నాదా.. సై.. ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ నేడే

Ind Vs Pak: పంతం నీదా.. నాదా.. సై.. ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ నేడే

Rajinikanth: సూప‌ర్‌స్టార్ కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు.. ఆ విషయంలో బాధగా ఉందంటున్న నటుడు..

Rajinikanth: సూప‌ర్‌స్టార్ కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు.. ఆ విషయంలో బాధగా ఉందంటున్న నటుడు..

YS Sharmila: షర్మిల పాదయాత్రలో ఇంట్రెస్టింగ్ సీన్.. వైవీ సుబ్బారెడ్డి ఎంట్రీ

YS Sharmila: షర్మిల పాదయాత్రలో ఇంట్రెస్టింగ్ సీన్.. వైవీ సుబ్బారెడ్డి ఎంట్రీ

#RadheShyam Teaser: 'రాధే శ్యామ్' టీజర్ రికార్డుల మోత... అదొక్కటి కూడా వస్తేనా!?

#RadheShyam Teaser: 'రాధే శ్యామ్' టీజర్ రికార్డుల మోత... అదొక్కటి కూడా వస్తేనా!?