News
News
X

Sweet Lime: బత్తాయి రసంతో ఎన్ని ప్రయోజనాలో... జీర్ణాశయం శుభ్రం... షుగల్ లెవల్స్ డౌన్

మనకు అందుబాటులో ఉండే పండ్లలో బత్తాయి ఒకటి. ఈ పండ్లలో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇవి సిట్రస్ జాతికి చెందినవి. అంటే విటమిన్ C పుష్కలంగా ఉంటుంది.

FOLLOW US: 
 
మనకు అందుబాటులో ఉండే పండ్లలో బత్తాయి ఒకటి. ఈ పండ్లలో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇవి సిట్రస్ జాతికి చెందినవి. అంటే విటమిన్ C పుష్కలంగా ఉంటుంది. ఈ పండ్ల జ్యూస్‌ని రోజూ ఒక గ్లాస్ తీసుకుంటే అనేక రకాల లాభాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు చూద్దాం. 

Also Read: మలేరియా, డెంగ్యూ బారిన పడిన వారు త్వరగా కోలుకోవాలంటే... ఈ చిట్కాలు పాటించండి

* బత్తాయి పండ్లలో ఫ్లెవనాయిడ్లు అధికంగా ఉంటాయి. ఇవి జీర్ణాశయాన్ని శుభ్రం చేస్తాయి. దీంతో జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. అందుకే రోజూ ఒక గ్లాస్ బత్తాయి రసం తాగాలి. 

* డయాబెటిస్‌తో బాధపడుతున్న వారికి బత్తాయి రసం ఎంతో మేలు చేస్తుంది. బత్తాయి రసంలో కొద్దిగా నిమ్మరసం, తేనె కలిపి రోజూ ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్‌తో తీసుకుంటే షుగల్ లెవల్స్ తగ్గుతాయి.

News Reels

* బత్తాయి రసం తాగడం వల్ల శరీరంలో ఉండే వ్యర్థాలు బయటకుపోతాయి. మలబద్దకం తగ్గుతుంది. 

* బత్తాయి రసాన్ని రోజూ తాగడం వల్ల అధిక బరువు తగ్గుతారు. కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. 

Also Read: గాడిద పాలు చర్మ సౌందర్యాన్ని పెంచుతాయా? ఆరోగ్యానికి మేలు చేస్తాయా?

* బత్తాయి పండ్లలో విటమిన్ C అధికంగా ఉంటుంది. దీంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లు రాకుండా చేస్తుంది. 

* బత్తాయిలో పొటాషియం, ఫాస్పరస్, మినరల్స్ ఉన్నాయి. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు బత్తాయి రసాన్ని రోజూ ఒక గ్లాసు తీసుకోవచ్చు. బత్తాయి రసాన్ని తీసుకోవడం ద్వారా అలసట మాయమవుతుంది.  

* గర్భిణీ స్త్రీలు తరచూ బత్తాయి రసాన్ని తాగమని వైద్యులు సలహాలిస్తుంటారు. ఇందులో ఉండే క్యాల్షియం.. కడుపులో పెరిగే బిడ్డకు మరియు తల్లికి ఇద్దరికి అనేక ప్రయోజనాలను చేకూర్చుతుంది. 

Also Read: ఈ విధంగా పుదీన రసం తీసుకుంటే... లివర్ క్లీన్ అవుతుంది... వ్యర్థాలు పోతాయి

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ఈ కథనానికి ‘abp దేశం’ ఎలాంటి బాధ్యత వహించదని గమనించగలరు. 

Also Read: బ్లాక్ హెడ్స్ సమస్య వెంటాడుతోందా? బ్లాక్ హెడ్స్‌ని ఎలా తొలగించుకోవచ్చు?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 28 Sep 2021 08:06 PM (IST) Tags: Health Health Tips Sweet Lime Juice Sweet Lime Mosambi Juice

సంబంధిత కథనాలు

దగ్గితే పక్కటెములు విరిగాయ్, మహిళకు వింత పరిస్థితి - ఇలా మీకూ జరగవచ్చు, ఎందుకంటే..

దగ్గితే పక్కటెములు విరిగాయ్, మహిళకు వింత పరిస్థితి - ఇలా మీకూ జరగవచ్చు, ఎందుకంటే..

Curd: చలికాలంలో పెరుగు తినొచ్చా? అపోహలు- వాస్తవాలు ఇవే

Curd: చలికాలంలో పెరుగు తినొచ్చా? అపోహలు- వాస్తవాలు ఇవే

Tattoo: టాటూ పిచ్చి కంటి చూపుని పోగొట్టింది- పచ్చబొట్టు వల్ల ఇన్ఫెక్షన్స్, అంటు వ్యాధులు రావొచ్చు

Tattoo: టాటూ పిచ్చి కంటి చూపుని పోగొట్టింది- పచ్చబొట్టు వల్ల ఇన్ఫెక్షన్స్, అంటు వ్యాధులు రావొచ్చు

Milk: నెయ్యి కలిపిన పాలు రోజుకో గ్లాస్ తాగారంటే ఈ సమస్యలన్నీ దూరం అవుతాయి

Milk: నెయ్యి కలిపిన పాలు రోజుకో గ్లాస్ తాగారంటే ఈ సమస్యలన్నీ దూరం అవుతాయి

Curry Leaves: కరివేపాకు తినకుండా పక్కన పెట్టేస్తున్నారా? ఈ ప్రయోజనాలన్నీ మిస్ అవుతునట్టే!

Curry Leaves: కరివేపాకు తినకుండా పక్కన పెట్టేస్తున్నారా? ఈ ప్రయోజనాలన్నీ మిస్ అవుతునట్టే!

టాప్ స్టోరీస్

most trending news in telangana 2022 : కవిత లిక్కర్ కేసు నుంచి సమతా మూర్తి విగ్రహం వరకు ! తెలగాణలో ఈ ఏడాది ట్రెండింగ్ న్యూస్ ఏమిటో తెలుసా ?

most trending news in telangana 2022 :  కవిత లిక్కర్ కేసు నుంచి సమతా మూర్తి విగ్రహం వరకు ! తెలగాణలో ఈ ఏడాది ట్రెండింగ్ న్యూస్ ఏమిటో తెలుసా ?

Sharmila On Sajjala : తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతీయవద్దు - సజ్జలకు షర్మిల స్ట్రాంగ్ వార్నింగ్ !

Sharmila On Sajjala : తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతీయవద్దు - సజ్జలకు షర్మిల స్ట్రాంగ్ వార్నింగ్ !

తీవ్ర తుపానుగా మాండోస్- ఆరు జిల్లాల యంత్రాంగం అప్రమత్తం

తీవ్ర తుపానుగా మాండోస్- ఆరు జిల్లాల యంత్రాంగం అప్రమత్తం

Google Year in Search 2022: ఈ ఏడాది గూగుల్ సెర్చ్ లో అత్యధికంగా వెతికిన అంశాలు ఇవే!

Google Year in Search 2022: ఈ ఏడాది గూగుల్ సెర్చ్ లో అత్యధికంగా వెతికిన అంశాలు ఇవే!