అన్వేషించండి

Heatwave deaths Telangana AP:అగ్ని గుండంలా తెలుగు రాష్ట్రాలు! వడదెబ్బకు పోతున్న ప్రాణాలు! రికార్డులు తిరగరాస్తున్న ఉష్ణోగ్రతలు!

తెలుగు రాష్ట్రాల్లో భానుడు అగ్ని గోళంలా మారాడు. వడదెబ్బకు ఏపీ, తెలంగాణలో యాభై మందికిపైగా ప్రాణాలు గాలిలో కలిశాయి. రికార్డు స్థాయిలో 46.5 డిగ్రీల ఉష్ణోగ్రతలతో జనజీవనం అస్తవ్యస్తమైంది.  

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • తెలుగు రాష్ట్రాల్లో వడదెబ్బతో పదుల సంఖ్యలో మరణాలు, మే నెలలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు.
  • ఆంధ్రప్రదేశ్‌లో 21, తెలంగాణలో 34 మంది మృతి, అత్యధికంగా 46.5 డిగ్రీల ఉష్ణోగ్రత.
  • ఎల్‌నినో, నగరాల్లో కాంక్రీట్ కట్టడాలు, ఎడారి గాలుల ప్రభావంతో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి.
  • రాబోయే నాలుగు రోజులు కీలకం, 18 జిల్లాలకు రెడ్ అలర్ట్, ప్రజలు జాగ్రత్తగా ఉండాలి.

Heatwave deaths Telangana AP:తెలుగు రాష్ట్రాల్లో సూరీడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఆకాశం నుంచి నిప్పుల వర్షం కురుస్తోంది. ఈ దెబ్బకు ప్రజలు విలవిలలాడిపోతున్నారు. గత 24 గంటల్లోనే వడదెబ్బ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో మరణాలు సంభవించాయి. ఎన్నడూ లేని విధంగా మే నెలలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి. 

ఆంధ్రప్రదేశ్‌లో సూరీ ఊచకోత 

ఆంధ్రప్రదేశ్‌లో శుక్రవారం ఒక్క రోజు వడబెద్దకు 21 మంది మరణించారు. ఇందులో అత్యధికంగా విజయవాడలోనే ఉన్నారు. ఇక్కడ పది మంది మరణించారు. మృతుల్లో ఎనిమిది మంది యాచచకులే. రోడ్డు పక్కన, పార్కుల వద్ద అపస్మారక స్థితిలో పడి ఉన్న వీరిని ఆసుపత్రికి తరలించే లోపే ప్రాణాలు కోల్పోయారు.  ఇక ఏలూరులో ముగ్గురు, కాకినాడలో ముగ్గురు, పల్నాడులో ఇద్దరు, అనకాపల్లి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. 

తెలంగాణ నిప్పుల కొలిమి

తెలంగాణలో ఎండల తీవ్రత మరింత భీకరంగా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా వడ దెబ్బతో 34మంది మరణించినట్టు తెలుస్తోంది. దాదాపు ఇరవైకిపైగా జిల్లాల్లో 46 డిగ్రీలపైగా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. కుమురం భీం ఆసీఫాబాద్‌ జిల్లాలోని సిర్పూర్(టి)లో అత్యధికంగా 46.5 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. 

ఎందుకు ఈ పరిస్థితి

ప్రస్తుతం మనం చూస్తున్న ఈ ఎండలు కేవలం వేసవి ప్రభావం మాత్రమే కాదు. హిందూ మహాసముద్రంలో వేడి పెరగడం వల్ల ఏర్పడే ఎల్‌నినో ప్రభావంతో వడగాలుల సంఖ్య, వాటి వ్యవధి పెరుగుతోంది. నగరాల్లో కాంక్రీట్ కట్టడాలు, వాహనాల వినియోగం వల్ల వేడి గాలి బయటకు వెళ్లకుండా అక్కడే నిలిచిపోతోంది. ఫలితంగా నగరాల్లో ఉష్ణోగ్రతలు గ్రామీణ ప్రాంతాల కంటే రెండు నుంచి పది డిగ్రీలు ఎక్కువగా ఉంటున్నాయి. 

మీ గుండె భద్రం

రాజస్థాన్, పంజాబ్ ఎడారి ప్రాంతాల నుంచి వీస్తున్న పొడి వేడి గాలుల మధ్య భారతంతోపాటు తెలుగు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. సాధారణంగా రాత్రి పూట చల్లబడాల్సిన వాతావరణం, ప్రస్తుతం 24-30 డిగ్రీల కంటే ఎక్కువగా నమోదు అవుతోంది. ఇది మానవుల గుండపై తీవ్ర ఒత్తిడి పెంచుతుంది. 

మరో నాలుగు రోజులు ఇదే తంతు

వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం రాబోయే నాలుగు రోజులు అత్యంత కీలకం. అందుకే తెలంగాణలోని 18 జిల్లాలు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. శని, ఆదివారాల్లో కూడా ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల వరకు నమోదు అయ్యే ఛాన్స్ ఉంది. మధ్యాహ్నం 11 నుంచి సాయంత్ర నాలుగు గంటల వరకు ప్రజలు బయటకు రావద్దని సూచించారు. 

ఎండల వల్ల కేవలం ప్రాణ నష్టమే కాదు ఆస్తి నష్టం కూడా జరుగుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎండ తీవ్రతకు రోడ్డుపై వెళ్తున్న స్కూటీ మంటల్లో చిక్కుకుంది. జనగామా జిల్లాలో ఎండల వల్ల పంట పొలాల్లో మంటలు చెలరేగాయి. ధాన్యం కుప్పలు బూడిద అయ్యాయి. ఎండల వల్ల ఏసీలు, కూలర్ల వాడకం పెరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో గ్రిడ్‌ డిమాండ్ రికార్డు స్థాయిలో 15, 016 మెగావాట్లకు చేరింది. 

ప్రకృతి వైపరిత్యాలు మన చేతల్లో లేకపోయినా, అప్రమత్తతతో ప్రాణనష్టాన్ని తగ్గించవ చ్చు. ముఖ్యంగా బాలింతలు, గర్భిణులు, వృద్ధులు ఈ ఎండల పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలి.  

Frequently Asked Questions

తెలుగు రాష్ట్రాల్లో వడదెబ్బతో ఎన్ని మరణాలు సంభవించాయి?

గత 24 గంటల్లోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వడదెబ్బ కారణంగా పదుల సంఖ్యలో మరణాలు సంభవించాయి. ఆంధ్రప్రదేశ్‌లో 21 మంది, తెలంగాణలో 34 మంది మరణించినట్లు తెలుస్తోంది.

ఏ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదయ్యాయి?

తెలంగాణలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్(టి)లో అత్యధికంగా 46.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.

నగరాల్లో ఉష్ణోగ్రతలు ఎందుకు ఎక్కువగా ఉంటున్నాయి?

నగరాల్లో కాంక్రీట్ కట్టడాలు, వాహనాల వినియోగం వల్ల వేడి గాలి బయటకు వెళ్లకుండా అక్కడే నిలిచిపోతోంది. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల కంటే రెండు నుంచి పది డిగ్రీలు ఎక్కువగా ఉంటుంది.

రాబోయే రోజుల్లో వాతావరణం ఎలా ఉండనుంది?

వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం, రాబోయే నాలుగు రోజులు అత్యంత కీలకం. తెలంగాణలోని 18 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. శని, ఆదివారాల్లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల వరకు చేరవచ్చు.

ఈ తీవ్రమైన ఎండల సమయంలో ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

ప్రజలు అప్రమత్తంగా ఉండటం ద్వారా ప్రాణనష్టాన్ని తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా బాలింతలు, గర్భిణులు, వృద్ధులు ఈ ఎండల పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
IND vs SL 1st Test Day 1 Updates: పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
CM Revanth Reddy: రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
Devdutt Padikkal Century: శ్రీలంకపై తొలి టెస్టులో సెంచరీ బాదిన దేవదత్ పడిక్కల్.. 24 ఏళ్ల తరువాత తొలి బ్యాటర్‌గా
శ్రీలంకపై తొలి టెస్టులో సెంచరీ బాదిన దేవదత్ పడిక్కల్.. 24 ఏళ్ల తరువాత తొలి బ్యాటర్‌గా
Advertisement

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Devdutt Padikkal Century: శ్రీలంకపై తొలి టెస్టులో సెంచరీ బాదిన దేవదత్ పడిక్కల్.. 24 ఏళ్ల తరువాత తొలి బ్యాటర్‌గా
శ్రీలంకపై తొలి టెస్టులో సెంచరీ బాదిన దేవదత్ పడిక్కల్.. 24 ఏళ్ల తరువాత తొలి బ్యాటర్‌గా
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
Comrade Kalyan Release Date : మాస్ లుక్‌లో కామ్రేడ్ కల్యాణ్ - శ్రీవిష్ణు కొత్త మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది
మాస్ లుక్‌లో కామ్రేడ్ కల్యాణ్ - శ్రీవిష్ణు కొత్త మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది
Independence Day 2026 At Amaravati: అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
Anam Ramanarayana Reddy:తిరుపతి స్వాతంత్య్ర వేడుకల్లో ప్రసంగిస్తూ పడిపోయిన మంత్రి ఆనం! వేదికపైనే చికిత్స చేసిన వైద్యులు!
తిరుపతి స్వాతంత్య్ర వేడుకల్లో ప్రసంగిస్తూ పడిపోయిన మంత్రి ఆనం! వేదికపైనే చికిత్స చేసిన వైద్యులు!
Embed widget