అన్వేషించండి

Telangana Heatwave : నిప్పుల కొలిమిలా తెలంగాణ! 13 జిల్లాలకు రెడ్ అలర్ట్! బయటకు రావద్దని హెచ్చరికలు!

Telangana Temperature Records: తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం ఎండ తీవ్రతో అగ్నిగుండంలా మారింది. జగిత్యాల జిల్లాలో గరిష్టంగా  45.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • తెలంగాణలో తీవ్రమైన ఎండలు, పలు జిల్లాల్లో 45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు.
  • వడదెబ్బతో రాష్ట్రంలో నలుగురు వ్యక్తులు మృతి చెందారు.
  • వాతావరణ కేంద్రం పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.
  • ఎండల తీవ్రతతో పాటు కొన్ని చోట్ల అకాల వర్షాలు కూడా కురిశాయి.

IMD Heatwave Warning to Telangana: తెలంగాణ రాష్ట్రంలో భానుడు భగభగలాడుతున్నాడు. గత కొన్ని రోజులుగా పెరుగుతున్న ఎండల తీవ్రత ప్రస్తుతం పతాక స్థాయికి చేరుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 డిగ్రీల వరకు అధికంగా నమోదు అవుతుండటంతో జనం ఇబ్బంది పడుతున్నారు. పరిస్థితి తీవ్రతను గమనించిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేస్తూ హెచ్చరికలు చేసింది. 

అల్లాడుతున్న ఉత్తర తెలంగాణ 

రాష్ట్రంలో మంగళవారం నాటి వాతావరణ గణాంకాలు భయం గొల్పుతున్నాయి. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల ఐలాపూర్‌లో 45.9 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఎండల తీవ్రత చాలా ముందుగానే పెరిగింది. 2025 మే 19న రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రత 41.9 డిగ్రీలు ఉండగా, ఈ ఏడాది అదే సమయానికి 45.9 డిగ్రీలకు చేరుకోవడం వాతావరణ మార్పుల తీవ్రతకు అద్దం పడుతోంది. 

నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల వంటి ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వడగాలుల ప్రభావం అత్యంత తీవ్రంగా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా 12 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు మార్కును దాటేశాయి. హైదరాబాద్‌లో వేడి తీవ్రం 43 డిగ్రీలుగా నమోదు అయ్యింది. 

ఎండలకు నలుగురు బలి 

తీవ్రమైన ఎండల కారణంగా రాష్ట్రంలో విషాద ఛాయలు అలముకున్నాయి. మంగళవారం వడ దెబ్బకు గురైన నలుగురు వ్యక్తులు మరణించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పెద్దూరుకు చెందిన రాచర్ల రాజు అనే రైతు మరణించాడు. వికారాబాద్‌ జిల్లా తాండూర్‌ మండలం అంతారానికి చెందిన శామ్యూల్ అనే కార్మికుడు, ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం మత్తడిగూడకు చెందిన లచ్చు అనే వృద్ధురాలు, శాంతినగర్‌కు చెందిన బిరుదుల కిరణ్ కుమార్ వడదెబ్బకు ప్రాణాలు వదిలేశారు. 

గాలిలో తేమ శాతం గణనీయంగా పడిపోవడం ఈ తీవ్రమైన వేడికి ప్రధాన కారణంగా వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా గాలిలో తేమ 50 శాతం లోపు మాత్రమే ఉంటోంది. సాధారణంగా రాత్రివేళల్లో వచ్చే చల్లని గాలులు కూడా ఇప్పుడు వీయకపోవడం వల్ల రాత్రిపూట కూడా ఉక్కపోతతో ప్రజలు ఇబ్బంది పడతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌ వంటి మహానగరాల్లో కాలుష్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వేడి ప్రభావం మరింత ఎక్కువగా ఉంటోంది. 

రెడ్ అలర్ట్ జిల్లాల జాబితా ఇదే 

రానున్న రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు 46 నుంచి 47 డిగ్రీల మధ్య నమోదు అయ్యే ఛాన్స్ ఉండటంతో వాతావరణ శాఖ కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, వరంగల్, హన్మకొండ, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల. ఈ ప్రాంతాల్లో మధ్యాహ్నం వేళ జనం బయటకు రావడం ప్రాణాపాయమని అధికారులు హెచ్చరించారు. 

ఒకవైపు ఎండలు మండుతుంటే, మరోవైపు మంగళవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గాలి వాన బీభత్సం సృష్టించింది. మెదక్, సిద్ధిపేట జిల్లాల్లో అకాల వర్షం కురిసింది. భారీగా వీచిన గాలులు కారణంగా చెట్లు విరిగిపడం, ఇళ్ల రేకులు ఎగిరిపోవడం జరిగింది. కొన్ని ప్రాంతాల్లో ఆస్తి నష్టం పంట నష్టం కూడా జరిగింది. 

రానున్న 3-4 రోజుల పాటు ఈ ఎండల తీవ్రత ఇలాగే కొనసాగే అవకాశం ఉంది. అందుకే ప్రజలు ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ క్షేమంగా ఉండాలని సూచిస్తున్నారు.  

Frequently Asked Questions

తెలంగాణలో ప్రస్తుత ఎండల తీవ్రత ఎలా ఉంది?

తెలంగాణలో ఎండల తీవ్రత గణనీయంగా పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 డిగ్రీల వరకు అధికంగా నమోదవుతున్నాయి. కొన్ని జిల్లాల్లో 45 డిగ్రీలు దాటింది.

ఎండల కారణంగా ఎంతమంది మరణించారు?

తీవ్రమైన ఎండల కారణంగా రాష్ట్రంలో నలుగురు వ్యక్తులు వడదెబ్బతో మరణించారు. వీరిలో ఒక రైతు, ఒక కార్మికుడు, ఒక వృద్ధురాలు, ఒక యువకుడు ఉన్నారు.

గాలిలో తేమ శాతం ఎంత ఉంది?

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా గాలిలో తేమ శాతం 50 శాతం లోపు మాత్రమే ఉంది. ఇది తీవ్రమైన వేడికి ఒక ప్రధాన కారణంగా వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

వాతావరణ కేంద్రం ఏ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది?

ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, వరంగల్, హన్మకొండ, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయబడింది.

ఎండల తీవ్రత ఇంకా ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది?

రానున్న 3-4 రోజుల పాటు ఈ ఎండల తీవ్రత ఇలాగే కొనసాగే అవకాశం ఉందని అధికారులు సూచిస్తున్నారు. ప్రజలు ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Traffic Diversion: నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
CM Revanth Reddy: 2027 డిసెంబర్ 9లోపు ఉస్మానియా, అల్వాల్‌, ఎల్బీనగర్‌, వరంగల్‌ ఆస్పత్రులు పూర్తి: సీఎం రేవంత్ రెడ్డి
2027 డిసెంబర్ 9లోపు ఉస్మానియా, అల్వాల్‌, ఎల్బీనగర్‌, వరంగల్‌ ఆస్పత్రులు పూర్తి: సీఎం రేవంత్ రెడ్డి
TIMS Sanathnagar Hospital Inauguration:హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌లో 1000 పడకల టిమ్స్‌ ప్రారంభం!
హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌లో 1000 పడకల టిమ్స్‌ ప్రారంభం!
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Love or Control : Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? ఈ RedFlagsను అస్సలు విస్మరించొద్దు
Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? ఈ RedFlagsను అస్సలు విస్మరించొద్దు
Uppal Balu Navdeep: ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
మూడు స్క్రీన్లు, కొత్త బ్యాటరీ, AI ఫీచర్లు.. Mahindra BE 6 Sporteqలో అన్నీ ప్రత్యేకతలే!
651km రేంజ్‌.. రూ.8 లక్షలు తక్కువ ఖర్చు! మహీంద్రా BE 6లో కొత్త మార్పులేంటో తెలుసా?
Ram Charan Irumudi: రవితేజ 'ఇరుముడి'లో అతిథిగా రామ్ చరణ్... అసలు నిజం ఏమిటంటే?
రవితేజ 'ఇరుముడి'లో అతిథిగా రామ్ చరణ్... అసలు నిజం ఏమిటంటే?
Embed widget