అన్వేషించండి

Andhra Pradesh Heatwave: మండుతున్న ఆంధ్రప్రదేశ్‌! 47 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు! ఈ జిల్లావాసులు అవసరమైతే తప్ప బయటకు రావద్దు! 

AP Weather Forecast: ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు ముదురుతున్నాయి. బుధవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల నుంచి 47 డిగ్రీల వరకు నమోదు అయ్యాయి. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఆంధ్రప్రదేశ్ లో భరించలేని ఎండలు, 45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు.
  • కొన్ని జిల్లాల్లో 45-47 డిగ్రీల వరకు చేరే అవకాశం ఉంది.
  • 348 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, ప్రజలు జాగ్రత్తగా ఉండాలి.
  • వడదెబ్బ నుంచి తప్పించుకోవడానికి తగిన జాగ్రత్తలు సూచించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రస్తుతం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. భానుడి భగభగలకు జనం విలవిలలాడుతున్నారు. గత కొన్ని రోజులుగా పెరుగుతున్న ఎండ తీవ్రత బుధవారం నాటికి మరింత గరిష్టస్థాయికి చేరుకోనుంది. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA Advisory)ఈ మేరకు హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలోని కోస్తా జిల్లాల్లో ఎండల తీవ్ర అసాధారణంగా పెరుగుతోందని, కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. 

పిడుగురాళ్లలో అత్యధిక ఉష్ణోగ్రతలు 

మంగళవారం నాటి గణాంకాలను పరిశీలిస్తే రాష్ట్రంలోని 28 జిల్లాలకు కాను, 23 జిల్లాల్లోని మొత్తం 233 మండలాల్లో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. పల్నాడు జిల్లాలలోని పిడుగురాళ్ల(Piduguralla Temperature)లో అత్యధికంగా 45.6 డిగ్రీలు రికార్డు అయ్యింది. నెల్లూరు జిల్లా గూడూరులో 44.9 డిగ్రీలు, కృష్ణా జిల్లా కంకిపాడులో 44.5 డిగ్రీలు మేర గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు, మార్కాపురం జిల్లా పెదచర్లోపల్లి వంటి ప్రాంతాల్లో కూడా 44 డిగ్రీల మార్కును ఉష్ణోగ్రతలు దాటేశాయి. 

నేడు మరింత తీవ్రంగా భానుడు 

మే 20, బుధవారం నాడు ఎండ తీవ్ర మరింత ఎక్కువగా ఉండనుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ప్రధానంగా ఉత్తర, మధ్య కోస్తా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల నుంచి 47 డిగ్రీల వరకు నమోదు అయ్యే ప్రమాదం ఉంది. 

45-47 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే జిల్లాలు

శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం. 

43-45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే జిల్లాలు

నెల్లూరు, కర్నూలు, నంద్యాల, చిత్తూరు, తిరుపతి 

41-43 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే జిల్లాలు

అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య జిల్లాలు 

వాయువ్య భారతం నుంచి వీస్తున్న వేడి గాలులు కారణంగా ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న వాతావరణ నిపుణులు చెబుతున్నారు. 

348 మండలాల్లో వడగాల్పులు 

రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నాడు వడగాల్పులు ప్రభావం అత్యంత తీవ్రంగా ఉండబోతోంది. మొత్తం 71 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉంది. మోర 277 మండలాల్లో వడగాల్పులు విస్తాయని అధికారులు తెలిపారు. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా 18 మండలాలు, అనకాపల్లిలోని 20 మండలాలు తీవ్ర వడగాల్పుల భారిన పడనున్నాయి. 

ప్రస్తుతం వాయవ్య భారతం నుంచి వేడి గాలులు కోస్తాంధ్ర, రాయలసీమ వైపు వీస్తున్నాయి. దీనికి తోడు, కర్ణాటక, రాయలసీమ మీదుగా దక్షిణ కోస్తా వరకు ఒక ఉపరితల ఆవర్తనం, ద్రోణి విస్తరించి ఉంది. ఈ వాతావరణ మార్పుల వల్ల కొన్ని చోట్ల తీవ్రమైన ఎండలు ఉంటుండగా, రాయలసీమలో మాత్రం చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. 

ప్రజలకు హెచ్చరిక (Summer Precautions)

తీవ్రమైన ఎండల దృష్ట్యా ప్రజలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు. శరీరం డీహైడ్రేషన్ కాకుండా చూసుకోవాలి. మజ్జిగా, కొబ్బరి నీరు, నిమ్మరసం తీసుకోవాలి. వదలుగా ఉండే కాటన్ దుస్తులు ధరించాలి. బయటకు వెళ్లాల్సి వస్తే తలపాగా, గొడుగు, టోపీని ధరించాలి. వేడి గాలి చెవుల్లోకి వెళ్లకుండా జాగ్రత్త పడాలి. వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు, అనారోగ్య సమస్యలు ఉన్న వారు ఎండలో తిరగడం ప్రాణానికి ముప్పుగా మారవచ్చు.

రాష్ట్రవ్యాప్తంగా ఈ వడగాల్పుల తీవ్రత వచ్చే ఆదివారం వరకు కొనసాగే అవకాశం ఉందని అంచనా, కాబట్టి ప్రజలు వాతావరణ హెచ్చరికలను గమనిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వడదెబ్బ బారిన పడకుండా ఉండొచ్చు.  

Frequently Asked Questions

ఆంధ్రప్రదేశ్‌లో వేడి గాలుల తీవ్రత ఎప్పటివరకు కొనసాగే అవకాశం ఉంది?

రాష్ట్రవ్యాప్తంగా వడగాల్పుల తీవ్రత వచ్చే ఆదివారం వరకు కొనసాగే అవకాశం ఉందని అంచనా. ప్రజలు వాతావరణ హెచ్చరికలను గమనిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

వడగాల్పుల ప్రభావం అత్యంత తీవ్రంగా ఉండే జిల్లాలు ఏవి?

ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా 18 మండలాలు, అనకాపల్లిలోని 20 మండలాలు తీవ్ర వడగాల్పుల భారిన పడనున్నాయి. మొత్తం 71 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉంది.

కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఎంతవరకు చేరే అవకాశం ఉంది?

ఉత్తర, మధ్య కోస్తా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల నుంచి 47 డిగ్రీల వరకు నమోదు అయ్యే ప్రమాదం ఉంది. పిడుగురాళ్లలో అత్యధికంగా 45.6 డిగ్రీలు నమోదయ్యాయి.

ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు. శరీరం డీహైడ్రేషన్ కాకుండా చూసుకోవాలి. మజ్జిగా, కొబ్బరి నీరు, నిమ్మరసం తీసుకోవాలి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breaking News: గురువారం కర్నూలు పర్యటనకు వైఎస్ జగన్ ! విరూపాక్షికి పరామర్శ!
గురువారం కర్నూలు పర్యటనకు వైఎస్ జగన్ ! విరూపాక్షికి పరామర్శ!
Cases Against YSRCP Leaders: గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
AP NDA Alliance: వైసీపీ ఫేక్ అకౌంట్లతో జాగ్రత్త.. కూటమి అభిమానులకు ఎన్డీయే సోషల్ మీడియా కోఆర్డినేషన్ కమిటీ విజ్ఞప్తి!
వైసీపీ ఫేక్ అకౌంట్లతో జాగ్రత్త.. కూటమి అభిమానులకు ఎన్డీయే సోషల్ మీడియా కోఆర్డినేషన్ కమిటీ విజ్ఞప్తి!
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
Advertisement

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cases Against YSRCP Leaders: గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Telangana News: 10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
Tata Sons Chairman Chandrasekaran Resigns:టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
Breaking News: పర్మిషన్ లేకుండా ర్యాలీలు.. పలువురు వైసీపీ నేతలపై కేసులు నమోదు
పర్మిషన్ లేకుండా ర్యాలీలు.. పలువురు వైసీపీ నేతలపై కేసులు నమోదు
Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Cow Urine Selling: పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
Embed widget