అన్వేషించండి

Heatwave Alert : వడగాలుల హెచ్చరిక.. ప్రాణాపాయం పెంచేస్తోన్న ఎండలు, Heat Stroke రాకుండా ఈ జాగ్రత్తలు తీసుకోండి

Heat Stroke Warning Signs : వడగాలుల ప్రభావం ఉంటుందని.. బయట తిరగవద్దని అధికారులు సూచిస్తున్నారు. ఇలాంటి సమయంలో వడదెబ్బ తగలకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూసేద్దాం. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • తెలుగు రాష్ట్రాలలో 42-50 డిగ్రీల ఉష్ణోగ్రతలు, వడగాలుల తీవ్రత పెరిగింది.
  • హీట్ స్ట్రోక్ లక్షణాలు, శరీరం వేడెక్కడం, స్పృహ కోల్పోవడం, శ్వాస వేగంగా తీసుకోవడం.
  • శరీరం డీహైడ్రేషన్ కు గురికాకుండా నీరు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు తాగాలి.
  • ఉదయం 11 నుండి సాయంత్రం 4 వరకు బయట తిరగడం మానుకోవాలి.

Stay Safe in Summer Heatwave : తెలుగు రాష్ట్రాల్లో వడగాలుల ప్రభావం మొదలైంది. ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల నుంచి 50 వరకు చేరుకుంటున్నాయి. ఈ సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకుంటే ప్రాణాంతక పరిస్థితులు తలెత్తవచ్చు. హీట్ స్ట్రోక్, డీహైడ్రేషన్ వంటి తీవ్రమైన సమస్యలు వస్తాయి. మరి వడగాలుల నుంచి సురక్షితంగా ఉండటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

వడగాలి ఎప్పుడు ప్రమాదం?

సాధారణ ఉష్ణోగ్రత కంటే ఎక్కువగా ఉన్నప్పుడు.. 40 డిగ్రీలపైన ఉష్ణోగ్రతలు నమోదైనప్పుడు వడగాలి పరిస్థితి ఏర్పడుతుంది. గాలిలో తేమ కూడా ఎక్కువగా ఉంటే శరీరం చెమటను బయటకు పంపిస్తూ వేడిగా మారిపోతుంది. ఇది హీట్ స్ట్రోక్‌కు దారితీస్తుంది. పిల్లలు, వృద్ధులు, బయట పని చేసేవారికి ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. వడగాలి ప్రభావితం అయితే హీట్ స్ట్రోక్ లక్షణాలు గుర్తించి జాగ్రత్తలు తీసుకోవాలి.

హీట్ స్ట్రోక్ లక్షణాలు 

శరీర ఉష్ణోగ్రత బాగా పెరుగుతుంది. 104 ఫీవర్ రావచ్చు. చెమట ఆగిపోయి చర్మం పొడిగా, వేడిగా మారుతుంది. తల తిరగడం, స్పృహ తప్పడం, శ్వాస వేగంగా తీసుకోవడం, గుండె వేగంగా కొట్టుకోవడం, వికారం, వాంతులు, మాటలు తడబడడం, గందరగోళంగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే 108కి కాల్ చేయాలి. 

వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

వేసవిలో శరీరం చాలా వేగంగా నీటిని కోల్పోతుంది. దీన్ని నివారించడానికి దాహం వేయకపోయినా గంటకోసారి నీళ్లు తాగండి. రోజుకు కనీసం 3–4 లీటర్ల నీళ్లు తాగాలి. మజ్జిగ, నిమ్మరసం, కొబ్బరి నీళ్లు, ORS వంటివి తీసుకోవచ్చు. కూల్‌డ్రింక్స్, కాఫీ, టీ వీలైనంత తగ్గించండి. ఇవి శరీరంలో నీటి శాతం తగ్గిస్తాయి. బయటకు వెళ్లేటప్పుడు వాటర్ బాటిల్ తీసుకెళ్లండి.

ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వీలైనంత వరకు బయటకు వెళ్లకండి. ఈ సమయంలో వడగాలి అత్యంత తీవ్రంగా ఉంటుంది. తప్పనిసరిగా వెళ్ళాల్సి వస్తే తెల్లవారుజామున లేదా సాయంత్రం వెళ్లండి. బయట పని చేసేవారు తరచుగా నీడలో విశ్రాంతి తీసుకోవాలి. తేలికైన, వదులుగా ఉన్న, తెల్లని లేదా లేత రంగు దుస్తులు వేసుకోవాలి. కాటన్ డ్రెస్​లు శరీరానికి గాలి అందిస్తాయి. బయటకు వెళ్లేటప్పుడు తప్పకుండా టోపీ పెట్టుకోండి. లేదా గొడుగు తీసుకెళ్లండి. కళ్లకు సన్‌గ్లాసెస్ పెట్టుకోండి. 

ఫుడ్ విషయంలో చేయాల్సిన మార్పులు

పగలు కిటికీలు, తెరలు మూసి వేయండి. ఎండ నేరుగా లోపలికి రాకుండా చూసుకోండి. రాత్రి చల్లని గాలి వస్తే కిటికీలు తెరవండి. ఫ్యాన్, కూలర్ వాడండి. AC ఉంటే 24 డిగ్రీలు టెంపరేచర్ పెట్టుకోవచ్చు. పెరుగు, మజ్జిగ, కీరదోసకాయ, పుచ్చకాయ, నారింజ వంటి పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. మసాలాలు, నూనె ఎక్కువగా ఉన్న ఫుడ్స్ తగ్గించాలి. బయటి ఫుడ్స్ తినకపోవడమే మంచిది. భోజనం తక్కువ మోతాదులో ఎక్కువసార్లు తినండి. ముందు రోజు వండిన అన్నం, కూరలు తినకపోవడమే మంచిది. 

హీట్ స్ట్రోక్ తగిలితే.. 

హీట్ స్ట్రోక్ తగిలిన బాధితుడుని వెంటనే నీడలోకి లేదా చల్లటి గదిలోకి తీసుకెళ్లాలి. దుస్తులు వదులుగా చేయాలి. చల్లటి నీళ్లతో తలపై, మెడపై, చంకల వద్ద తడి గుడ్డ పెట్టండి. గాలి తగిలేలా చూడాలి. స్పృహలో ఉంటే ORS లేదా చల్లటి నీళ్లు ఇవ్వాలి. వెంటనే 108కి కాల్ చేయండి. 

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Dussehra Navratri Day 7 : అమ్మవారికి 7వ రోజు పెట్టాల్సిన నైవేద్యాలు ఇవే.. శ్రీ మహాలక్ష్మీ దేవికి పూర్ణాలు, పాలన్నం ఇలా చేసేయండి
అమ్మవారికి 7వ రోజు పెట్టాల్సిన నైవేద్యాలు ఇవే.. శ్రీ మహాలక్ష్మీ దేవికి పూర్ణాలు, పాలన్నం ఇలా చేసేయండి
Dussehra Navratri Day6 : అమ్మవారికి 6వ రోజు పెట్టాల్సిన నైవేద్యాలు ఇవే.. శ్రీ సరస్వతి దేవికి పరవాన్నం ఇలా చేసేయండి
అమ్మవారికి 6వ రోజు పెట్టాల్సిన నైవేద్యాలు ఇవే.. శ్రీ సరస్వతి దేవికి పరవాన్నం ఇలా చేసేయండి
White Chicken : నోరూరింటే వైట్ చికెన్ కర్రీ.. 10/10 రెస్టారెంట్ స్టైల్ రెసిపీ ఇదే.. పక్కా ట్రై చేయండి
నోరూరింటే వైట్ చికెన్ కర్రీ.. 10/10 రెస్టారెంట్ స్టైల్ రెసిపీ ఇదే.. పక్కా ట్రై చేయండి
Beer vs Breezer : బీర్‌కు, బ్రీజర్‌కు తేడా ఏంటి? ఆల్కహాల్‌ శాతం, ఆరోగ్యంపై ప్రభావాలు, అసలు తేడాలు ఇవే
బీర్‌కు, బ్రీజర్‌కు తేడా ఏంటి? ఆల్కహాల్‌ శాతం, ఆరోగ్యంపై ప్రభావాలు, అసలు తేడాలు ఇవే

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
Indrakeeladri Dasara: కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
Gade Sai Krishna CBI Investigation: సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
Google Search: గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
AP Local Body Elections: బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
CJP Protest: అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న సీజేపీ నేత
అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న CJP నేత
Narnia Telugu Trailer : నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
Vijaya Dairy Milk Price: విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
Embed widget