అన్వేషించండి

Kidney Stones : కిడ్నీలో రాళ్లకు ప్రధాన కారణాలు ఇవే.. వేసవికాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే

Kidney Stones in Summer : కిడ్నీ స్టోన్స్ సమస్యలు వేసవిలో ఎక్కువగా కనిపిస్తాయి. దీనికి కారణాలు ఏంటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదో, వైద్య సహాయం ఎప్పుడు తీసుకోవాలో చూసేద్దాం.  

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • వేసవిలో అధిక వేడి, డీహైడ్రేషన్ వల్ల కిడ్నీ స్టోన్స్ ఏర్పడతాయి.
  • శరీరంలో నీటి శాతం తగ్గడం, లవణాలు పేరుకుపోవడం స్టోన్స్ కారణాలు.
  • తగినంత నీరు తాగడం, నిమ్మరసం, పండ్ల రసాలు తీసుకోవడం మేలు.
  • తీవ్రమైన నొప్పి, మూత్రంలో రక్తం కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

Kidney Stone Cases in Summer : వేసవిలో కిడ్నీ సమస్యలు పెరుగుతాయి. ముఖ్యంగా కిడ్నీ స్టోన్స్ సమస్య చాలామందిని ఇబ్బంది పెడుతుంది. అసలు సమ్మర్లో మూత్రపిండాల సమస్యలు పెరగడానికి, స్టోన్స్ రావడానికి కారణాలు ఏంటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే సమస్య రాకుండా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. 

డీహైడ్రేషన్ 

వేసవిలో అధిక వేడి వల్ల చెమట ద్వారా శరీరంలో నీరు వేగంగా తగ్గిపోతుంది. దాంతో మూత్రం గాఢంగా మారుతుంది. ఆ సమయంలో కాల్షియం, ఆగ్జలేట్ లాంటి మినరల్స్ కిడ్నీలో పేరుకుపోయి రాళ్లుగా మారతాయి. 

అధిక ఉష్ణోగ్రత

తీవ్రమైన వేడి, సూర్యరశ్మి వల్ల శరీరం నీటిని వేగంగా కోల్పోతుంది. ఎండ వల్ల విటమిన్ D పెరిగి.. కాల్షియం శోషణ అధికమై స్టోన్స్ ఏర్పడే రిస్క్ పెరుగుతుంది.

ఆహారం..

ఆగ్జలేట్ అధికంగా ఉండే టమాటో, పాలకూర, బీట్​రూట్ కూడా దీనికి కారణం కావచ్చు. ఉప్పు, ప్రొటీన్ అధికంగా తీసుకోవడం వల్ల కూడా స్టోన్స్ రిస్క్ పెరుగుతుంది.

కోల్డ్ డ్రింక్స్ 

వేసవిలో దాహం తీర్చుకోవడానికి సోడా, కోల్డ్ డ్రింక్స్ ఎక్కువ తాగుతారు. అందులో ఫాస్ఫోరిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. ఇది కిడ్నీ స్టోన్స్ ఏర్పడటాన్ని పెంచుతుంది. 

అధిక వ్యాయామం 

వేసవి వేడిలో వ్యాయామం చేస్తే చాలా చెమట పడుతుంది. చెమట ద్వారా సోడియం కోల్పోవడంతో కిడ్నీలో లవణాలు పేరుకుపోయే అవకాశం ఉంటుంది. అవి కిడ్నీలో స్టోన్స్​గా మారవచ్చు. 

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

వేసవిలో రోజుకు కనీసం 3 నుంచి 4 లీటర్ల నీళ్లు తాగండి. మూత్రం లేత పసుపు రంగులో ఉంటే సరిపోతుందని అర్థం. మధ్యాహ్నం 11 నుంచి 4 గంటల మధ్య బయటకు వెళ్లకండి. వెళ్లాల్సి వస్తే వాటర్ బాటిల్ తప్పనిసరిగా తీసుకెళ్లండి. నిమ్మకాయలో సిట్రేట్ ఉంటుంది. ఇది కిడ్నీ స్టోన్స్ ఏర్పడడాన్ని అడ్డుకుంటుంది. రోజూ తేలికపాటి నిమ్మరసం తాగడం మంచిది.

ఉప్పు ఎక్కువగా తింటే మూత్రంలో కాల్షియం పెరుగుతుంది. కాబట్టి రోజుకు 5 గ్రాముల కంటే తక్కువ సోడియం మాత్రమే తీసుకోండి. ఖర్బూజ, దోసకాయ, దానిమ్మ వంటివి తింటే శరీరంలో నీటి స్థాయి పెరుగుతుంది. ఇవి కిడ్నీకి చాలా మేలు చేస్తాయి. సోడా, ప్యాక్ చేసిన జ్యూస్ బదులు నిమ్మరసం, కొబ్బరి నీళ్లు, మజ్జిగ వంటివి తాగండి. ఇవి కిడ్నీ ఆరోగ్యానికి మంచివి. అరటిపండు, ఆపిల్ కూడా తినొచ్చు. చాక్లెట్, కాఫీలకు కూడా దూరంగా ఉండాలి. 

వైద్య సహాయం..

నడుం లేదా పొత్తికడుపు దగ్గర తీవ్రమైన నొప్పి వస్తే.. మూత్రంలో రక్తం కనిపిస్తే, వాంతులు, జ్వరం వస్తే వెంటనే యూరాలజిస్ట్​ని సంప్రదించండి. ఈ లక్షణాలు నిర్లక్ష్యం చేస్తే చాలా ప్రమాదకరంగా మారుతాయి. కాబట్టి మొదట్లోనే వైద్య సహాయం తీసుకుంటే మందులతో సమస్యను దూరం చేసుకోగలుగతారు.

 

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Dussehra Navratri Day 7 : అమ్మవారికి 7వ రోజు పెట్టాల్సిన నైవేద్యాలు ఇవే.. శ్రీ మహాలక్ష్మీ దేవికి పూర్ణాలు, పాలన్నం ఇలా చేసేయండి
అమ్మవారికి 7వ రోజు పెట్టాల్సిన నైవేద్యాలు ఇవే.. శ్రీ మహాలక్ష్మీ దేవికి పూర్ణాలు, పాలన్నం ఇలా చేసేయండి
Dussehra Navratri Day6 : అమ్మవారికి 6వ రోజు పెట్టాల్సిన నైవేద్యాలు ఇవే.. శ్రీ సరస్వతి దేవికి పరవాన్నం ఇలా చేసేయండి
అమ్మవారికి 6వ రోజు పెట్టాల్సిన నైవేద్యాలు ఇవే.. శ్రీ సరస్వతి దేవికి పరవాన్నం ఇలా చేసేయండి
White Chicken : నోరూరింటే వైట్ చికెన్ కర్రీ.. 10/10 రెస్టారెంట్ స్టైల్ రెసిపీ ఇదే.. పక్కా ట్రై చేయండి
నోరూరింటే వైట్ చికెన్ కర్రీ.. 10/10 రెస్టారెంట్ స్టైల్ రెసిపీ ఇదే.. పక్కా ట్రై చేయండి
Beer vs Breezer : బీర్‌కు, బ్రీజర్‌కు తేడా ఏంటి? ఆల్కహాల్‌ శాతం, ఆరోగ్యంపై ప్రభావాలు, అసలు తేడాలు ఇవే
బీర్‌కు, బ్రీజర్‌కు తేడా ఏంటి? ఆల్కహాల్‌ శాతం, ఆరోగ్యంపై ప్రభావాలు, అసలు తేడాలు ఇవే

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bengaluru Decider Washed: వర్షం కారణంగా చివరి టీ20 రద్దు.. భార‌త్, విండీస్ టీ20 సిరీస్ సమం.. ఇషాన్, న‌మ‌న్ మెరుపులు వృథా
వర్షం కారణంగా చివరి టీ20 రద్దు.. భార‌త్, విండీస్ టీ20 సిరీస్ సమం.. ఇషాన్, న‌మ‌న్ మెరుపులు వృథా
Governor Quota MLC Seats: గ్రాడ్యుయేట్ ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Graduate MLC ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Harish Rao: కత్తి ఆంధ్రావాడిది.. కానీ పొడిచేది తెలంగాణోడు: సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
కత్తి ఆంధ్రావాడిది.. కానీ పొడిచేది తెలంగాణోడు: సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
Chief Selector Twist: అగార్కర్ సీటులో హైదరాబాదీ స్పిన్నర్.. టీమిండియా చీఫ్ సెలెక్టర్ గా ప్రజ్ఞాన్ ఓజా సరికొత్త చరిత్ర, వెస్ట్ జోన్ నుంచి పొవార్ ఎంట్రీతో రేస్ క్లోజ్
అగార్కర్ సీటులో హైదరాబాదీ స్పిన్నర్.. టీమిండియా చీఫ్ సెలెక్టర్ గా ప్రజ్ఞాన్ ఓజా సరికొత్త చరిత్ర, వెస్ట్ జోన్ నుంచి పొవార్ ఎంట్రీతో రేస్ క్లోజ్
Abhijeet Dipke: జైలు నుంచి అభిజీత్ దీప్కే విడుదల.. సౌరవ్ దాస్, ఆశుతోష్ రిలీజ్ కోసం వెయిటింగ్ అని పోస్ట్
జైలు నుంచి అభిజీత్ దీప్కే విడుదల.. సౌరవ్ దాస్, ఆశుతోష్ రిలీజ్ కోసం వెయిటింగ్ అని పోస్ట్
RTC Special Buses: జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
TDP Second List of Candidates: పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
Horror Thrilelr OTT : ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
Embed widget