News
News
X

Liver Clean: ఈ విధంగా పుదీన రసం తీసుకుంటే... లివర్ క్లీన్ అవుతుంది... వ్యర్థాలు పోతాయి

ఎప్పటికప్పుడు లివర్‌ను శుభ్రం చేసుకుని అనారోగ్య సమస్యలు రాకుండా చూసుకోవడం మన బాధ్యత. మరి లివర్‌ని ఎలా శుభ్రం చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం.   

FOLLOW US: 
 
మన శరీరంలోని అనేక అవయవాల్లో లివర్ ఒకటి. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. పిండి పదార్థాలు. కొవ్వులు, ప్రొటీన్లను లివర్ జీర్ణం చేసి శరీరానికి శక్తిని అందిస్తుంది. రోజూ మనం చేసే పనులు, తీసుకునే ఆహారాల వల్ల లివర్‌లో వ్యర్థాలు, విష పదార్థాలు పేరుకుపోతుంటాయి. ముఖ్యంగా వేపుళ్లు, బయటి ఫుడ్ తినేవారు, మద్యం, పొగ తాగడం వల్ల లివర్ పై భారం పడుతుంది. 

అప్పుడు ఆ వ్యర్థాలను బయటికి పంపేందుకు ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. దీంతో లివర్ అనారోగ్యం అవుతుంది. అయితే ఎప్పటికప్పుడు లివర్‌ను శుభ్రం చేసుకుని అనారోగ్య సమస్యలు రాకుండా చూసుకోవడం మన బాధ్యత. మరి లివర్‌ని ఎలా శుభ్రం చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం.   

Also Read: గాడిద పాలతో మెరుగైన అందం... అనారోగ్యానికి దూరం

News Reels

లివర్‌ను శుభ్రం చేయడంలో పుదీనా ఆకులు కీలకపాత్ర పోషిస్తాయి.  10 పుదీన ఆకులను తీసుకుని బాగా కడగాలి. ఒక గిన్నెలో కొన్ని నీళ్లు పోసి అందులో ఈ ఆకులను వేసి బాగా మరిగించాలి. పది నిమిషాల పాటు సన్నని మంటపై మరిగించాలి. తర్వాత ఆ నీటిని వడగట్టి గోరు వెచ్చగా అయిన తర్వాత తాగాలి. రాత్రి పడుకునే ముందు దీన్ని తాగాలి. ఇలా చేయడం వల్ల లివర్ శుభ్రంగా మారుతుంది. లివర్లో ఉండే వ్యర్థ, విష పదార్థాలు బయటికి వెళ్లిపోతాయి. అయితే ఈ పుదీనా రసాన్ని రోజూ తీసుకోవల్సిన అవసరం లేదు. వారానికి మూడు సార్లు తీసుకుంటే చాలు. 

* ఆలివ్ ఆయిల్‌ను తీసుకోవ‌డం అల‌వాటు చేసుకుంటే లివ‌ర్ ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. లివ‌ర్ స‌మ‌స్య‌లు ఉన్న‌ వారు ఆలివ్ ఆయిల్‌ను వాడ‌డం మంచిద‌ని వైద్యులు కూడా చెబుతున్నారు. దీంతో లివ‌ర్లో ఉండే వ్య‌ర్థాలు బ‌య‌ట‌కు వెళ్లిపోతాయి.

* బీట్‌రూట్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్క‌లంగా ఉంటాయి. అందువ‌ల్ల నిత్యం ఉద‌యాన్నే బీట్‌రూట్ జ్యూస్ తాగితే లివ‌ర్ శుభ్ర‌మ‌వుతుంది. అందులో ఉండే వ్య‌ర్థాలు బ‌య‌ట‌కు వెళ్లిపోతాయి. 

* వారంలో క‌నీసం 2 లేదా 3 సార్లు చేప‌లు తిన్నా లివ‌ర్ ఆరోగ్యం మెరుగు‌ప‌డుతుంది. వాటిల్లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు లివ‌ర్‌ను సంర‌క్షిస్తాయి. లివ‌ర్ వ్యాధులు రాకుండా చూస్తాయి. 

* వాల్‌న‌ట్స్‌ను నిత్యం తిన‌డం వ‌ల్ల కూడా లివ‌ర్‌ను శుభ్ర‌ప‌రుచుకోవ‌చ్చు. వాల్‌న‌ట్స్‌లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు లివ‌ర్‌ను శుభ్రం చేస్తాయి. లివ‌ర్ ప‌నితీరును మెరుగు ప‌రుస్తాయి.

* వెల్లుల్లిని నిత్యం తిన‌డం వ‌ల్ల లివ‌ర్ శుభ్ర‌మ‌వుతుంద‌ని సైంటిస్టులు చేప‌ట్టిన అధ్య‌య‌నాల్లో వెల్ల‌డైంది. వెల్లుల్లిలో ఉండే ఔష‌ధ గుణాలు లివ‌ర్‌లోని టాక్సిన్ల‌ను నాశ‌నం చేసి బ‌య‌ట‌కు పంపుతాయి. దీంతో లివ‌ర్ క్లీన్ అవుతుంది. నిత్యం ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే ఒక‌టి రెండు వెల్లుల్లి రెబ్బ‌ల‌ను తింటే లివ‌ర్ శుభ్రంగా మారుతుంది.

Also Read: బ్లాక్ హెడ్స్ సమస్య వెంటాడుతోందా? బ్లాక్ హెడ్స్‌ని ఎలా తొలగించుకోవచ్చు?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 27 Sep 2021 08:56 PM (IST) Tags: Health Tips liver Mint Juice

సంబంధిత కథనాలు

దగ్గితే పక్కటెములు విరిగాయ్, మహిళకు వింత పరిస్థితి - ఇలా మీకూ జరగవచ్చు, ఎందుకంటే..

దగ్గితే పక్కటెములు విరిగాయ్, మహిళకు వింత పరిస్థితి - ఇలా మీకూ జరగవచ్చు, ఎందుకంటే..

Curd: చలికాలంలో పెరుగు తినొచ్చా? అపోహలు- వాస్తవాలు ఇవే

Curd: చలికాలంలో పెరుగు తినొచ్చా? అపోహలు- వాస్తవాలు ఇవే

Tattoo: టాటూ పిచ్చి కంటి చూపుని పోగొట్టింది- పచ్చబొట్టు వల్ల ఇన్ఫెక్షన్స్, అంటు వ్యాధులు రావొచ్చు

Tattoo: టాటూ పిచ్చి కంటి చూపుని పోగొట్టింది- పచ్చబొట్టు వల్ల ఇన్ఫెక్షన్స్, అంటు వ్యాధులు రావొచ్చు

Milk: నెయ్యి కలిపిన పాలు రోజుకో గ్లాస్ తాగారంటే ఈ సమస్యలన్నీ దూరం అవుతాయి

Milk: నెయ్యి కలిపిన పాలు రోజుకో గ్లాస్ తాగారంటే ఈ సమస్యలన్నీ దూరం అవుతాయి

Curry Leaves: కరివేపాకు తినకుండా పక్కన పెట్టేస్తున్నారా? ఈ ప్రయోజనాలన్నీ మిస్ అవుతునట్టే!

Curry Leaves: కరివేపాకు తినకుండా పక్కన పెట్టేస్తున్నారా? ఈ ప్రయోజనాలన్నీ మిస్ అవుతునట్టే!

టాప్ స్టోరీస్

Sharmila On Sajjala : తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతీయవద్దు - సజ్జలకు షర్మిల స్ట్రాంగ్ వార్నింగ్ !

Sharmila On Sajjala : తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతీయవద్దు - సజ్జలకు షర్మిల స్ట్రాంగ్ వార్నింగ్ !

తీవ్ర తుపానుగా మ్యాన్‌డౌస్- ఆరు జిల్లాల యంత్రాంగం అప్రమత్తం

తీవ్ర తుపానుగా మ్యాన్‌డౌస్- ఆరు జిల్లాల యంత్రాంగం అప్రమత్తం

Google Year in Search 2022: ఈ ఏడాది గూగుల్ సెర్చ్ లో అత్యధికంగా వెతికిన అంశాలు ఇవే!

Google Year in Search 2022: ఈ ఏడాది గూగుల్ సెర్చ్ లో అత్యధికంగా వెతికిన అంశాలు ఇవే!

Airport Metro : లండన్ మెట్రో ప్రమాణాలతో ఎయిర్‌పోర్టు మెట్రో - శంకుస్థాపనకు ఏర్పాట్లు పూర్తి !

Airport Metro :  లండన్ మెట్రో ప్రమాణాలతో ఎయిర్‌పోర్టు మెట్రో - శంకుస్థాపనకు ఏర్పాట్లు పూర్తి !