అన్వేషించండి

Numarology: 3, 12, 21, 30 తేదీల్లో జన్మించిన వారు నాయకులుగా ఎదుగుతారు కానీ ఈ అలవాట్లకు దూరంగా ఉండాలి

Numerology: సంఖ్యాశాస్త్రం ప్రకారం మూడో నంబర్ కి చెందినవారికి నాయకులుగా ఎదిగేశక్తి ఉంటుంది. వారి బలాలు, బలహీనతలు, వారిలో ఉండే మంచి లక్షణాలు తెలుసుకోండి

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • 3, 12, 21, 30 తేదీల్లో జన్మించిన వారికి 3 రాడిక్స్ సంఖ్య.
  • ఈ సంఖ్య వ్యక్తులు ఉల్లాసంగా, స్నేహశీలంగా, ఆత్మవిశ్వాసంతో ఉంటారు.
  • నాయకత్వం, సృజనాత్మకత, గౌరవం, ఆశయం, ఉద్వేగభరితమైన స్వభావాలు కలిగి ఉంటారు.
  • రాజకీయాలు, వ్యాపారం, మార్కెటింగ్ వంటి వృత్తులలో వీరు రాణిస్తారు.

Mulank 3  Personality Traits: కొంతమంది తాము వెళ్ళే ప్రతిచోటా ఒక ప్రత్యేకమైన ముద్ర వేస్తారు. వారి సంభాషణా శైలి, ఆత్మవిశ్వాసం , ఇతరులను ఆకట్టుకునే సామర్థ్యం వారిని జనసమూహంలో ప్రత్యేకంగా నిలబెడతాయి. అందుకే సంఖ్యాశాస్త్రంలో 3 సంఖ్య గల వ్యక్తులు అత్యంత ప్రభావవంతమైన, ఆకర్షణీయమైన వ్యక్తిత్వాలను కలిగి ఉంటారని చెబుతారు సంఖ్యాశాస్త్ర నిపుణులు.
 
ఏ నెలలోనైనా 3, 12, 21, 30వ తేదీల్లో జన్మించిన వారికి 3 రాడిక్స్ సంఖ్య ఉంటుందని భావిస్తారు. ఈ రాడిక్స్‌కు అధిపతి బృహస్పతి, దీనిని జ్ఞానం, గౌరవం, నాయకత్వం , సానుకూలతకు చిహ్నంగా పరిగణిస్తారు.

సంఖ్య 3 ఉన్న వ్యక్తులు స్వభావరీత్యా ఉల్లాసంగా, స్నేహశీలంగా,  ఆత్మవిశ్వాసంతో ఉంటారు. వారు ఇతరులను ఆకర్షించే ఒక ప్రత్యేకమైన సానుకూల శక్తిని కలిగి ఉంటారు. వారు సంభాషణలో నిపుణులు. ఏ వాతావరణంలోనైనా కలిసిపోవడం , తమ మాటలతో ఇతరులను ఆకట్టుకోవడం వారి గొప్ప బలం.

సంఖ్య 3 ఉన్న వ్యక్తుల వ్యక్తిత్వం

1. నాయకత్వ సామర్థ్యంతో నిండి ఉంది

3 సంఖ్య గల వ్యక్తులు పుట్టుకతోనే నాయకులా అన్నట్టుంటారు. ప్రతి పనిని ఒక క్రమపద్ధతిలో చేయడానికి ఇష్టపడతారు  

2. సృజనాత్మక  

వీరికి చాలా సృజనాత్మక ఆలోచనా విధానం ఉంటుంది, కొత్త ఆలోచనలను రూపొందించడంలో నేర్పరులు, విషయాలను భిన్నమైన కోణంలో చూడటానికి ప్రయత్నిస్తారు.

3. గౌరవాన్ని ఇష్టపడేవారు

వారు తమ పరువుకు, గుర్తింపునకు చాలా విలువ ఇస్తారు. ఎవరైనా వారిని పట్టించుకోకపోయినా లేదా అవమానించినా తేలిగ్గా తీసుకోరు
 
4. ఆశయ స్వభావం

3 సంఖ్య గల వ్యక్తులు గొప్ప కలలు కనేవారు. వారు జీవితంలో ఏదైనా గొప్పది సాధించాలని కోరుకుంటారు..అందుకోసం కష్టపడతారు.

5. ఉద్వేగభరితమైన కానీ దృఢమైన

ఈ వ్యక్తులు బయటకు దృఢంగా కనిపిస్తారు, కానీ లోపల చాలా భావోద్వేగపూరితంగా ఉంటారు. వారు తమ సన్నిహిత సంబంధాలను మనస్ఫూర్తిగా ఆదరిస్తారు.

సంఖ్య 3 ఉన్న వ్యక్తులకు ఏ వృత్తులు ఉత్తమమైనవి?

బృహస్పతి ప్రభావం కారణంగా 3వ సంఖ్య గల వ్యక్తులు నాయకత్వం, జ్ఞానం , సంభాషణ నైపుణ్యాలు అవసరమయ్యే రంగాలలో మరింత విజయవంతమవుతారు. వారికి రాజకీయాలు , పరిపాలన, మార్కెటింగ్ , ప్రజా సంబంధాలు, వ్యాపారం , వ్యవస్థాపకత, ఈవెంట్ మేనేజ్‌మెంట్ వంటివి అద్భుతమైన వృత్తి అవకాశాలుగా ఉన్నాయి. ఈ వ్యక్తులు ఇతరులను ప్రభావితం చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు, దీనివల్ల వారు ప్రజలతో ప్రత్యక్షంగా వ్యవహరించే పాత్రలలో త్వరగా గుర్తింపు పొందుతారు.

సంఖ్య 3 ఉన్న వ్యక్తులు తమ జీవితాంతం ఏ విషయాలకు దూరంగా ఉండాలి?

కొన్నిసార్లు మితిమీరిన ఆత్మవిశ్వాసం వారికి హాని కలిగించవచ్చు.

విషయాలు తమకు అనుకూలంగా జరగకపోతే వారు సులభంగా కోపానికి గురవుతారు. ఈ అహంభావం వారి సంబంధాలు , వృత్తి రెండింటినీ ప్రభావితం చేయగలదు.

సంఖ్య 3 ఉన్న వ్యక్తులు తరచుగా తమ ప్రతిష్టను కాపాడుకోవడానికి అధికంగా ఖర్చు చేస్తారు. వారు దుబారాకు దూరంగా ఉండాలి.

వారి నాయకత్వ సామర్థ్యం కొన్నిసార్లు నియంత్రించే స్వభావంగా మారుతుంది, ఇది సంబంధాలను దెబ్బతీస్తుంది
 
కొత్త ఆలోచనలకు త్వరగా ఉత్సాహపడటం వల్ల, చాలాసార్లు ఒక పనిని పూర్తి చేయకుండానే మరో పనిని ప్రారంభిస్తారు.

రోహిణి కార్తె అంటే ఏంటి? 2026లో రోహిణి కార్తె ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? ఈ సమయంలో ఏం చేయకూడదు?

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. పండితులు చెప్పిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల నుంచి సేకరించి అందించిన వివరాలు ఇవి. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.

 న్యూమరాలజీ ప్రకారం మీ నంబర్ ఏది? కామెంట్ చేయండి... మీరు అడిగిన నంబర్ కి సంబంధించిన కథనం అందిస్తాం  

 

Frequently Asked Questions

సంఖ్యాశాస్త్రంలో 3 రాడిక్స్ సంఖ్య ఎవరికి ఉంటుంది?

ఏ నెలలోనైనా 3, 12, 21, 30వ తేదీల్లో జన్మించిన వారికి 3 రాడిక్స్ సంఖ్య ఉంటుంది. దీనికి అధిపతి బృహస్పతి.

సంఖ్య 3 ఉన్న వ్యక్తుల వ్యక్తిత్వ లక్షణాలు ఏమిటి?

వారు ఉల్లాసంగా, స్నేహశీలంగా, ఆత్మవిశ్వాసంతో ఉంటారు. సంభాషణలో నిపుణులు, ఇతరులను ఆకట్టుకునే శక్తి కలిగి ఉంటారు.

సంఖ్య 3 ఉన్న వ్యక్తులకు ఏ వృత్తులు ఉత్తమమైనవి?

నాయకత్వం, జ్ఞానం, సంభాషణ నైపుణ్యాలు అవసరమయ్యే రంగాలలో వీరు విజయవంతమవుతారు. రాజకీయాలు, మార్కెటింగ్, వ్యాపారం వంటివి మంచి అవకాశాలు.

సంఖ్య 3 ఉన్న వ్యక్తులు జీవితంలో ఏ విషయాలకు దూరంగా ఉండాలి?

మితిమీరిన ఆత్మవిశ్వాసం, దుబారా ఖర్చులు, ఒక పని పూర్తి చేయకుండానే మరో పని ప్రారంభించడం వంటి వాటికి దూరంగా ఉండాలి.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

18-08-2026 మంగళవారం మీ రాశిఫలాలు!
18-08-2026 మంగళవారం మీ రాశిఫలాలు!
16-08-2026 ఆదివారం మీ రాశిఫలాలు!
16-08-2026 ఆదివారం మీ రాశిఫలాలు!
మీన రాశి ఆగస్టు 16-22 వారఫలం
మీన రాశి ఆగస్టు 16-22 వారఫలం
కుంభ రాశి ఆగస్టు 16-22 వారఫలం
కుంభ రాశి ఆగస్టు 16-22 వారఫలం
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Embed widget