Rohini Karte in 2026 Dates: రోహిణి కార్తె అంటే ఏంటి? 2026లో రోహిణి కార్తె ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? ఈ సమయంలో ఏం చేయకూడదు?
Rohini Karte in 2026 : రోహిణి కార్తె అంటే ఆ సయమంలో ఎండలకు రోళ్లు పగిలిపోతాయ్ అనే సామెత చెబుతుంటారు పెద్దలు.. అసలు రోహిణి కార్తె అంటే ఏంటి? ఈ సమయాన్ని ఎలా నిర్ణయిస్తారు...

Rohini Karte in 2026 Dates: రోహిణి కార్తె ఈ ఏడాది మే 25 సోమవారం ప్రారంభమై జూన్ 08 సోమవారం పూర్తవుతుంది.
సూర్యుడు నెల రోజులకు ఓ రాశి మారినట్టే...ప్రతి 13.5 రోజులకు ఓ నక్షత్రంలో సంచరిస్తాడు. సూర్య భగవానుడు రోహిణి నక్షత్రంలో సంచరించే ఆ 13 రోజులు రోహిణి కార్తె అంటారు. రోహిణి కార్తె అంటే వేసవికాలం ఉచ్ఛస్థాయిలో ఉన్నట్టు పరిగణిస్తారు. అందుకే రోహిణి కార్తెలో ఎండలకు రోళ్లు పగిలిపోతాయ్ అని తీవ్రత ఎలా ఉంటుందో చెబుతారు. ఈ సమయంలో వేడిగాలులు, తీవ్రమైన ఎండలు, ఉక్కపోత, అగ్నిప్రమాదాలు భయపెడతాయ్. ఈ సమయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
ఈ ప్రత్యేక కాలంలో సూర్య భగవానుడిని పూజించడం విశేష ప్రాముఖ్యత. ముఖ్యంగా ఈ తీవ్రత మొదలైన మొదటి 9 రోజులను నౌతప కాలం అని పిలుస్తారు. ఈ ఏడాది నౌతప కాలం మే 25 నుంచి జూన్ 8 వరకు ఉంటుంది. జ్యేష్ఠ మాసం శుక్ల పక్షంలో, సూర్యుడు రోహిణి నక్షత్రంలోకి ) ప్రవేశించినప్పుడు, ఆ క్షణం నుంచి తదుపరి పది నక్షత్రాల వరకు తీవ్రమైన వేడి కొనసాగితే ఆ తర్వాత సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని సూచన.
సూర్య భగవానుడిని ప్రసన్నం చేసుకోవడానికి, జాతకంలో సూర్యుని స్థానాన్ని బలపరచుకోవడానికి , ఉత్తమ ఆరోగ్యాన్ని సాధించడానికి నౌతప కాలాన్ని అత్యంత ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. ఈ సమయంలో ఉదయాన్నే నిద్రలేచి, స్నానం చేసి, సూర్య భగవానుడికి ప్రార్థనలు చేసి, సానుకూల శక్తి ప్రవాహాన్ని కొనసాగించడానికి సూర్య భగవానుడి శ్లోకాలు పఠించాలి. ఈ సమయంలో త్రాగునీటి స్టాల్ ఏర్పాటు చేయడం, నీరు, షర్బత్, సత్తు, మట్టి కుండలు, గొడుగులు, పత్తి బట్టలు, చేతి విసనకర్రలు , కాలానుగుణ పండ్ల వంటి వాటిని దానం చేయడం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు.
రోహిణి కార్తె సమయంలో వివాహం, గృహప్రవేశం వంటి శుభకార్యాలు జరపకూడదు, ఎందుకంటే అలా చేయడం వల్ల కుటుంబంలో శాంతి, సామరస్యం దెబ్బతింటాయి.
ఈ సమయంలో వీలైనంత తేలికగా, సులభంగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలి.
శుభ ఫలితాలు కలగడానికి, నౌతప సమయంలో పక్షులకు, జంతువులకు నీటిని ఏర్పాటు చేయాలి
వేడి, మసాలా, వేయించిన, మాంసాహార పదార్థాలను తినకపోవడమే ఆరోగ్యానికి మంచిది
అత్యవసరం అయితే తప్ప, ముఖ్యంగా మధ్యాహ్నం 12:00 గంటల నుంచి సాయంత్రం 4:00 గంటల మధ్య మండుటెండలో బయటకు వెళ్లవద్దు
అత్యవసరం అయితే తప్ప నౌతప సమయంలో ఎక్కువగా ప్రయాణాలు ప్లాన్ చేసుకోవడం మంచిది కాదు
రోహిణి కార్తె తర్వాత ముఖ్యమైన కార్తెలు మృగశిర కార్తె, ఆరుద్ర కార్తె...
మృగశిర కార్తె జూన్ 9 నుంచి జూన్ 22 వరకు ఉంటుంది - తొలకరి వానలు మొదలయ్యే సమయం ఇది...రైతులు పంట పండించేందుకు సిద్ధమవుతారు
ఆరుద్ర కార్తె జూన్ 23 నుంచి జూలై 6 వరకు ఉంటుంది -వర్షాలు ఎక్కువగా కురిసే కార్తె ఇది.. ఆరుద్ర వాన అదను వాన అనే సామెత ఉంది.. వ్యవసాయదారులకు పండుగ లాంటి సమయం ఇది
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. పండితులు చెప్పిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల నుంచి సేకరించి అందించిన వివరాలు ఇవి. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.
నిత్యం తినే ఆహారంలో 5 రకాలైన దోషాలుంటాయి..మీరు ఎలాంటి దోషం ఉన్న ఆహారం తీసుకుంటున్నారో తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
తిరుమలలో ఉన్నది రాతి విగ్రహం కాదు.. సజీవంగా నిల్చున్న శ్రీ వేంకటేశ్వరుడు - తిరుమలలో జరిగే సేవలేంటి? ఏ సేవలో ఏం చేస్తారు? ఏ సేవకు వెళితే మంచిది? ఈ వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















