అన్వేషించండి

Yamuna pushkaralu 2026: రేపటి నుంచి యమునా నది పుష్కరాలు, ఘాట్ల వివరాలు, పుష్కర స్నాన ముహూర్తం సహా పూర్తి వివరాలు తెలుసుకోండి!

Yamuna river pushkaralu 2026 Dates: 12 నదులు, ఏడాదికోనదికి పుష్కరం వస్తుంది.. ప్రతి నదికి పన్నెండేళ్లకోసారి పుష్కరాలు జరుగుతాయి. ఈ ఏడాది (2026)లో యమునా నదికి పుష్కరాలు జరగనున్నాయి..ఆ వివరాలు మీకోసం..

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • 2026 జూన్ 2 నుండి 13 వరకు యమునా నది పుష్కరాలు జరుగుతాయి.
  • గురుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించినప్పుడు పుష్కరాలు ప్రారంభమవుతాయి.
  • ఆది, అంత్య పుష్కరాల్లో స్నానం చేయడం అత్యంత పుణ్యదాయకం.
  • వివిధ ప్రాంతాలలోని ప్రధాన ఘాట్లలో పుష్కర స్నానం చేయవచ్చు.

Yamuna pushkaralu 2026:  ప్రతి నదికి 12 సంవత్సరాలకు ఓసారి పుష్కరాలొస్తాయ్. ఈ ఏడాది (2026)లో యమునా నదికి పుష్కరాలు జరుగనున్నాయి

గురుగ్రహం కర్కాటక రాశిలోకి ప్రవేశించినప్పుడు యమునానదికి పుష్కరాలొస్తాయ్..

పుష్కర తేదీలు ప్రారంభం - 2026 జూన్ 2 మంగళవారం..ఈ రోజుని ఆది పుష్కరాలు అంటారు..మొదటి రోజు స్నానమాచరిస్తే అత్యంత పుణ్యఫలం అని భక్తుల విశ్వాసం

2026 జూన్ 13 శుక్రవారం పుష్కరాలు ముగింపు.. ఈ రోజు అంత్య పుష్కరాలు అంటారు..మొదటి రోజు స్నానం ఎంత పుణ్యఫలమో అంత్య పుష్కరాల్లో స్నానం ఆచరించడం కూడా అంతే పుణ్యఫలం అని భక్తుల విశ్వాసం

జూన్ 2 నుంచి జూన్ 13 వరకూ మొత్తం 12 రోజులు యమునా నదికి పుష్కరాలు జరుగుతాయి
 
జూన్ 1 సోమవారం అర్థరాత్రి దాటిన తర్వాత ఒంటిగంట 30 నిముషాలకు యమునా నదిలో పుష్కరుడు ప్రవేశిస్తాడు. ఆ మరుసటి రోజు ఉదయం జూన్ 2 నుంచి అరుణోదయం మొదలవుతుంది.  

పుష్కర స్నాన ముహూర్తం

పుష్కర స్నానం చేయాలి అనుకుంటే ప్రతి రోజూ బ్రహ్మముహూర్తంలో వేకువజామునే నాలుగున్నర నుంచి 6 గంటల వరకూ స్నానం ఆచరించాలి
 
ఆదిపుష్కరం జూన్ 2న సూర్యోదయానికి ముందే నాలుగున్నర గంటలకు ఘాట్ కి చేరుకోవాలి.. అంత్య పుష్కరం రోజు కూడా ఇదే సమయానికి పుష్క స్నానం ఆచరించాలి
 
తూర్పు లేదా ఉత్తర దిక్కు దిశగా తిరిగి పేరు, గోత్రం చెప్పుకుని మూడుసార్లు మునగాలి.. యమునా అష్టకం, యమునా స్తోత్రం చదవడం అత్యంత పుణ్యఫలం..

ప్రధాన ఘాట్లు వివరాలు

ఉత్తర ప్రదేశ్, హర్యానా, ఉత్తరాఖండ్ లో పుష్కరాలు జరుగుతాయి..

విశ్రామ్ ఘాట్ , మధుర: శ్రీ కృష్ణుడు, కంసుడిని హతమార్చి విశ్రమించిన స్థలం ఇది
 
కేశీ ఘాట్, బృందావనం: శ్రీ కృష్ణుడు కేశి రాక్షసుడిని చంపిన చోటు..ఇక్కడ సాయంత్రం సమయంలో యమునా ఆరతి కన్నుల పండువగా ఉంటుంది
 
త్రివేణి సంగమం , ప్రయాగ్ రాజ్: గంగా,యమునా, సరస్వతి సంగమ ప్రదేశం అత్యంత శక్తివంతమైన పుష్కర స్నాన ప్రదేశం

డాక్ పత్తర్ ఘాట్, హర్యానా: ఇక్కడ నీరు అత్యంత స్వచ్ఛంగా ఉంటుంది, వృద్ధులు -కుటుంబాలతో కలసి వెళ్లేవారికి ఇది అనువైన ప్రదేశం
 
యమనోత్రి , ఉత్తరాఖండ్:  యమునానది మూలం ఇక్కడే...శారీరకంగా సమర్థులుగా ఉన్నవారు ఇక్కడ ట్రెక్కింగ్ చేసి పుష్కర స్నానం చేయొచ్చు

నిగంబోధ్ ఘాట్, ఢిల్లీ: ఢిల్లీలో సౌకర్యవంతమైన ఘాట్ ఇది..స్థానికులు ఇక్కడ పుష్కర స్నానం చేయొచ్చు

ఇంకా మధురలో బెంగాలీ ఘాట్, ఆగ్రా లో ఘాట్ లలోనూ పుష్కరస్నానం చేయొచ్చు
 
ఆది పుష్కరం, అంత్య పుష్కరం రోజు అత్యంత రద్దీ ఉంటుంది.. అందుకే మధ్యలో తక్కువ రద్దీ ఉన్న సమయంలో పుష్కర స్నానం చేయడం ఉత్తమం. పుష్కర స్నానం, పితృ తర్పణం, పిండ ప్రదానం చేసి..యమునా ఆరతి దర్శించుకోవచ్చు. యుమునా పుష్కరాల కోసం ఏపీ, తెలంగాణ నుంచి స్పెషల్ ట్రైన్లు, బస్సులు, టూర్ ప్యాకేజీలు అందులుబాటులో ఉన్నాయి. వాతావరణం వేడిగా ఉంటుంది కాబట్టి..ముందస్తు ఏర్పాట్లు చేసుకునే పుష్కరాలకు వెళ్లడం మంచిది. హోటల్ రూమ్స్ ముందుగా బుక్ చేసుకోవాలి, వాతావరణంలో వేడి ఎక్కువగా ఉన్నందున సౌకర్యవంతంగా ఉన్న దుస్తులు తీసుకెళ్లండి. 

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. పండితులు చెప్పిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల నుంచి సేకరించి అందించిన వివరాలు ఇవి. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.

 

 

Frequently Asked Questions

2026లో యమునా పుష్కరాలు ఎప్పుడు జరుగుతాయి?

2026 జూన్ 2 నుండి జూన్ 13 వరకు యమునా పుష్కరాలు జరుగుతాయి. మొత్తం 12 రోజులు ఈ వేడుకలు ఉంటాయి.

యమునా పుష్కరాలకు ఏయే ప్రాంతాల్లో ప్రధాన ఘాట్లు ఉన్నాయి?

ఉత్తరప్రదేశ్, హర్యానా, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో ప్రధాన ఘాట్లు ఉన్నాయి. విశ్రామ్ ఘాట్, కేశీ ఘాట్, త్రివేణి సంగమం, డాక్ పత్తర్ ఘాట్, యమనోత్రి, నిగంబోధ్ ఘాట్ వంటివి ముఖ్యమైనవి.

పుష్కర స్నానం చేయడానికి సరైన సమయం ఏమిటి?

ప్రతిరోజూ బ్రహ్మముహూర్తంలో, అనగా వేకువజామున నాలుగున్నర నుంచి 6 గంటల మధ్య స్నానం చేయడం ఉత్తమం. ఆది మరియు అంత్య పుష్కరాల రోజు కూడా ఇదే సమయానికి స్నానం చేయాలి.

యమునా పుష్కరాల సమయంలో ఎలాంటి ఏర్పాట్లు చేసుకోవాలి?

వాతావరణం వేడిగా ఉంటుంది కాబట్టి, సౌకర్యవంతమైన దుస్తులు తీసుకెళ్లాలి. హోటల్ రూమ్స్ వంటివి ముందుగా బుక్ చేసుకోవడం మంచిది. ఏపీ, తెలంగాణ నుండి ప్రత్యేక ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

గురు గోచారం 2026: ఆశ్లేష నక్షత్రంలో గురుడు, ఈ 3 రాశులవారికి రహస్య శత్రువుల బెడద!
గురు గోచారం 2026: ఆశ్లేష నక్షత్రంలో గురుడు, ఈ 3 రాశులవారికి రహస్య శత్రువుల బెడద!
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!
Vallabhaneni Vamsi: బారికేడ్ల వెనుక పవర్ ఫుల్ నేత - వల్లభనేని వంశీకి సొంత పార్టీలో కనీస గౌరవం దక్కట్లేదా?
బారికేడ్ల వెనుక పవర్ ఫుల్ నేత - వల్లభనేని వంశీకి సొంత పార్టీలో కనీస గౌరవం దక్కట్లేదా?
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలాలు!
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలాలు!
Advertisement

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Pooja Murthy: బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Embed widget