అన్వేషించండి

Spirituality: నిత్యం తినే ఆహారంలో 5 రకాలైన దోషాలు, మీరు ఎలాంటి భోజనం చేస్తున్నారో తెలుసా!

టైమ్ టు టైమ్ తినేస్తున్నాం అనుకుంటున్నాం కానీ ఎలాంటి భోజనం చేస్తున్నామో ఎప్పుడైనా ఆలోచించారా.. అసలు మనం తినే ఆహారంలో ఐదు రకాలైన దోషాలుంటాయంటారు పండితులు. అవేంటో ఇక్కడ తెలుసుకోండి...

Spirituality: నిత్యం మనం తినే ఆహారంలో ఐదు రకాలైన దోషాలుంటాయి..అవి..
1.అర్ధ దోషం
2.నిమిత్త దోషం         
3.స్ధాన దోషం
4.గుణ దోషం   
5. సంస్కార దోషం

1.అర్ధ దోషం
సన్మార్గంలో సంపాదించని డబ్బుతో కొన్న పదార్థాలతో తయారు చేసిన ఆహారం భుజించడమే అర్థదోషం అంటారు.. మీకు అర్థమయ్యేందుకు ఈ చిన్న కథ...ఒక సాధువు  తన శిష్యుని ఇంటికి భోజనానికి వెళ్ళాడు. భోజనం చేస్తున్నప్పుడు ఎవరో వచ్చి ఆ శిష్యుడికి డబ్బు మూట ఇవ్వడం చూశాడు. భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ఆ గదిలో మూట చూసిన సాధువు మనసులో దుర్భుద్ధి కలిగింది. అందులోంచి కొంత మొత్తాన్ని తీసి తన సంచీలో దాచేసి ఆశ్రమానికి వెళ్లిపోయాడు. ఆ మర్నాడు పూజా సమయంలో తాను చేసిన దొంగతనం గుర్తొచ్చి సశ్చాత్తాపం చెందాడు. తను శిష్యుడి ఇంట్లో  దోషంతో కూడిన భోజనం చేయడం వల్లే తనకా దుర్భుద్ధి కలిగిందని..ఆ ఆహారం జీర్ణమై మలంగా విసర్జించిన తర్వాత మనసు నిర్మలమైనట్టు అర్థం చేసుకున్నాడు. వెంటనే తాను తస్కరించిన డబ్బు తీసుకుని శిష్యుడి ఇంటికి వెళ్లి జరిగింది చెప్పి ఇచ్చేసి..ఆ డబ్బు ఎలా సంపాదించావని అడిగాడు. శిష్యుడు తలవంచుకుని, "నన్ను క్షమించండి, స్వామి!  ఇది సన్మార్గంలో వచ్చిన డబ్బు కాదు" అన్నాడు. 

Also Read: ఈ రాశివారు ఈ రోజు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి రావొచ్చు, జనవరి 3 రాశిఫలాలు

2.నిమిత్త దోషం
చెడ్డ గుణాలు  ఉన్నవారు ఇచ్చింది  తినడం వల్ల మంచి గుణం నశించి నిమిత్త దోషం కలుగుతుంది. ఇందుకు ఉదారహణ ఈ కథ
భీష్ముడు కురుక్షేత్ర యుద్ధం  ముగిసే వరకూ అంపశయ్యపై ప్రాణాలతో ఉన్నాడు. ఆయన చుట్టూ ఉన్న పాండవులు, ద్రౌపది శ్రీ కృష్ణుడికి మంచి విషయాలు బోధించాడు. అప్పుడు ద్రౌపది కి ఓ సందేహం కలిగింది. ఇప్పుడు ఇంత వివేకంగా ఆలోచిస్తున్న భీష్ముడు అప్పుడు కురుసభలో వస్త్రాపహరణం జరుగుతున్నప్పుడు ఎందుకు ఎదిరించి మాట్లాడలేకపోయాడు అని మనసులో అనుకుంటుంది. ఆ ఆలోచన గ్రహించిన భీష్ముడు 'అమ్మా ! నేను అప్పుడు దుర్యోధనుని, ప్రాపకంలో వారిచ్చిన ఆహారం తిన్నాను. నా స్వీయ బుద్ధిని ఆ ఆహారం తుడిచిపెట్టింది. కొన్నాళ్లుగా ఆహారం తీసుకోపోవడంతో అంపశయ్యపై బాణాలతో శరీరం ఛిద్రమై ర్తం బిందువులుగా బయటకుపోయి పవిత్రుడినయ్యాను..అందుకే ఇప్పుడు మంచి మాటలు చెప్పగలుగుతున్నా అని సందేహం తీర్చాడు. 

అంటే..మనం తినే ఆహారాన్ని  వండేవారు కూడా మంచి స్వభావం కలిగి ఉండాలి. వండిన ఆహారాన్ని క్రిమికీటకాలు, పక్షులు జంతువులు ముట్టుకోకూడదు. ఆహారం మీద దుమ్ము, తల వెంట్రులకు పడకూడదు. అపరిశుభ్రమైన ఆహారం అసహ్యాన్ని కలిగిస్తే.. వక్రబుద్ధి, చికాకుతో వండిన భోజనం చేస్తే దుష్ట గుణాలు కలుగుతాయి.

Also Read:  కొత్త ఏడాదిలో మేషం నుంచి మీనరాశి వరకూ ఫలితాలు, 12 రాశుల వార్షిక ఫలితం

3. స్ధాన దోషం
దుర్యోధనుడు ఓసారి  యాభైఆరు రకాల వంటలు వండించి శ్రీ కృష్ణుని  విందు భోజనానికి పిలిచాడు. కాని కృష్ణుడు దుర్యోధనుని పిలుపును నిరాకరించి విదురుని యింటికి భోజనానికి వెళ్ళాడు. కృష్ణుని చూడగానే విదురుని భార్య సులభ సంతోషంగా ఆహ్వానించి ఉపచారాలు చేసింది.  తినడానికి ఏం పెట్టాలా అనే ఆలోచించి, ఆనందం-తొందరపాటు ఏకమైన ఆ క్షణం అరటి పండు ఒలిచి పండుకి బదులు తొక్క చేతికి అందించింది.  కృష్ణుడు దాన్ని తీసుకుని సంతోషంగా తిన్నాడు. ఇదిచూసిన విదురుడు భార్య సులభ వైపు కోపంగా చూడడంతో స్పందించిన కృష్ణుడు... "విదురా! నేను ఆప్యాయతతో  కూడిన ప్రేమకోసమే ఎదురు చూస్తున్నాను. నిజమైన శ్రద్ధా భక్తులతో యిచ్చినది కాయైనా, పండైనా, ఆకైనా, నీరైనా, ఏది యిచ్చినా సంతోషంగా తీసుకుంటా అన్నాడు. 

ఎక్కడైతే వంట చేస్తారో అక్కడంతా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉండాలి. వంటచేసేవారు,వండించేవారు కూడా మంచి మనసు కలిగి ఉండాలి. వడ్డించేటప్పుడు అంతే ప్రేమగా వడ్డించాలి. వంట చేసే సమయంలో అనవసర చర్చలు, వివాదాలు , అరుపులు కేకల మధ్య చేసిన వంట శరీరానిక మంచి చేయదు. యుద్ధరంగం, కోర్టులు, రచ్చబండలు ఉన్న చోట్ల వండిన వంటలు అంత మంచివి కాదంటారు పండితులు. 

4.గుణ దోషం 
మనం వండే ఆహారం సాత్వికంగా ఉండాలి. సాత్విక ఆహారం ఆధ్యాత్మికాభివృద్ధిని కలిగిస్తుంది. రజోగుణం కలిగించే ఆహారం మనిషిని మాయలో పడేస్తుంది,స్వార్థాన్ని పెంచుతుంది. 

5. సంస్కారదోషం 
ఆహారం వండే వారి సంస్కారం బట్టి దోషం ఏర్పడుతుంది. సంస్కారవంతుల చేతి వంట ఆరోగ్యాన్ని ఇస్తే సంస్కారహీనుల చేతి వంట లేని రోగాన్ని తెచ్చి పెడుతుంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra BJP New Chief: ఏపీబీజేపీకి త్వరలో కొత్త అధ్యక్షుడు - ఈ నలుగురిలో ఒకరికి చాన్స్
ఏపీబీజేపీకి త్వరలో కొత్త అధ్యక్షుడు - ఈ నలుగురిలో ఒకరికి చాన్స్
HYDRA: 'కొన్నిసార్లు మనసు చంపుకొని పనిచేయాల్సి వస్తోంది' - ఇళ్లను కూల్చాల్సిన అవసరం లేదన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్
'కొన్నిసార్లు మనసు చంపుకొని పనిచేయాల్సి వస్తోంది' - ఇళ్లను కూల్చాల్సిన అవసరం లేదన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్
AP Assembly: ఏపీ శాసనసభ నిరవదిక వాయిదా - 10 రోజుల్లో 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం
ఏపీ శాసనసభ నిరవదిక వాయిదా - 10 రోజుల్లో 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం
Life And Death Story: చనిపోయాడనుకుంటే చితిపై నుంచి లేచాడు - కొన్ని గంటల్లోనే మళ్లీ మృత్యుఒడికి, లైఫ్ అండ్ డెత్ స్టోరీ
చనిపోయాడనుకుంటే చితిపై నుంచి లేచాడు - కొన్ని గంటల్లోనే మళ్లీ మృత్యుఒడికి, లైఫ్ అండ్ డెత్ స్టోరీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Aus vs India First Test Day 1 Highlights | భారత పేసర్ల ధాటికి కుయ్యో మొర్రోమన్న కంగారూలు | ABP DesamAus vs Ind First Test First Innings | పెర్త్ లో పేకమేడను తలపించిన టీమిండియా | ABP Desamపేలిన ఎలక్ట్రిక్ స్కూటీ, టాప్ కంపెనీనే.. అయినా బ్లాస్ట్!ప్రసంగం మధ్యలోనే  ఏడ్చేసిన కాకినాడ కలెక్టర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra BJP New Chief: ఏపీబీజేపీకి త్వరలో కొత్త అధ్యక్షుడు - ఈ నలుగురిలో ఒకరికి చాన్స్
ఏపీబీజేపీకి త్వరలో కొత్త అధ్యక్షుడు - ఈ నలుగురిలో ఒకరికి చాన్స్
HYDRA: 'కొన్నిసార్లు మనసు చంపుకొని పనిచేయాల్సి వస్తోంది' - ఇళ్లను కూల్చాల్సిన అవసరం లేదన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్
'కొన్నిసార్లు మనసు చంపుకొని పనిచేయాల్సి వస్తోంది' - ఇళ్లను కూల్చాల్సిన అవసరం లేదన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్
AP Assembly: ఏపీ శాసనసభ నిరవదిక వాయిదా - 10 రోజుల్లో 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం
ఏపీ శాసనసభ నిరవదిక వాయిదా - 10 రోజుల్లో 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం
Life And Death Story: చనిపోయాడనుకుంటే చితిపై నుంచి లేచాడు - కొన్ని గంటల్లోనే మళ్లీ మృత్యుఒడికి, లైఫ్ అండ్ డెత్ స్టోరీ
చనిపోయాడనుకుంటే చితిపై నుంచి లేచాడు - కొన్ని గంటల్లోనే మళ్లీ మృత్యుఒడికి, లైఫ్ అండ్ డెత్ స్టోరీ
KTR: 'తెలంగాణలో అదానీకి సీఎం రేవంత్ రెడ్డి సహకారం' - ఆ ఒప్పందాలు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్
'తెలంగాణలో అదానీకి సీఎం రేవంత్ రెడ్డి సహకారం' - ఆ ఒప్పందాలు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్
CM Chandrababu: 'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Sidhu True Husband: మగ సావిత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ - దాదాపుగా చనిపోయిన భార్యను బతికించుకున్న వైనం తెలిస్తే మీరే ఒప్పుకుంటారు !
మగ సావిత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ - దాదాపుగా చనిపోయిన భార్యను బతికించుకున్న వైనం తెలిస్తే మీరే ఒప్పుకుంటారు !
Samantha: మగాళ్లు నిందించినప్పుడు తలెత్తుకుని నిలబడు... సమంత పోస్ట్ చేసిన కవిత రాసింది ఎవరో తెలుసా? 
మగాళ్లు నిందించినప్పుడు తలెత్తుకుని నిలబడు... సమంత పోస్ట్ చేసిన కవిత రాసింది ఎవరో తెలుసా? 
Embed widget