2023లో వృశ్చికరాశివారి జీవితంలో అప్ అండ్ డౌన్స్ రెండూ ఉంటాయి. చిన్న చిన్న ఇబ్బందులు వచ్చిన ఆ వెంటనే ఉపశమనం లభిస్తుంది. ఇబ్బందులతో పాటూ ఆనందం, శాంతి కూడా ఉంటాయి
కుటుంబ సమస్యలు ఈ ఏడాది మొత్తం మీపై ప్రభావం చూపిస్తాయి.వృత్తి జీవితంలో సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. విదేశాలకు వెళ్లాలి అనుకునేవారి కల 2023లో ఫలిస్తుంది.
ఉద్యోగులు క్రమశిక్షణతో పనులు నిర్వహిస్తేనే ప్రయోజనం పొందుతారు.ఉద్యోగంలో ప్రమోషన్ పొందుతారు కానీ జూన్ నెలలో చిన్న సమస్య ఎదురుయ్యే అవకాశం ఉంది. కెరీర్లో ఆకస్మికంగా హెచ్చుతగ్గులుంటాయి.
వివాహం పరంగా 2023 వృశ్చిక రాశికి మంచిది. సంవత్సరం ప్రారంభంలో వైవాహిక జీవితం చక్కగా సాగుతుంది కానీ రాను రాను సమస్యలు పెరుగుతాయి
ఆరోగ్యం పరంగా చూస్తే 2023లో వృశ్చిక రాశి వారికి బాగానే ఉంటుంది. తరచూ మీ జీవితంలో వచ్చే కొన్ని మార్పులు అనారోగ్య సమస్యలను తీసుకొస్తాయి. శారీరక సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు. అక్టోబర్ తర్వాత ఆరోగ్యం మెరుగుపడుతుంది.
2023 ఈ సంవత్సరం వృశ్చికరాశి ప్రేమికులకు ఒడిదొడుకులు తప్పవు. అవివాహితులకు పెళ్లిజరుగుతుంది కానీ ప్రేమికులకు మాత్రం ప్రతికూల ప్రభావాలు ఎదుర్కోక తప్పదు.
నోట్: ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు