ABP Desam


డిసెంబర్ 22 రాశిఫలాలు


ABP Desam


మేష రాశి
పనుల్లో బిజీగా ఉండడం వల్ల కుటుంబాన్ని పట్టించుకోలేరు. కానీ కొంత సమయాన్ని వెచ్చించడంతో పాటూ మీ వ్యక్తిగత జీవితంపై దృష్టి పెట్టండి. తల్లి ఆరోగ్యం పట్ల ఆందోళన ఉంటుంది. ఇతరుల పనుల్లో జోక్యం మానేయండి, ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి.


ABP Desam


వృషభ రాశి
వినయంగా ప్రవర్తించేందుకు ప్రయత్నించండి. అనవసర మాటలు వద్దు. మతం పట్ల ఆసక్తి పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ విషయాలలో మీ భాగస్వాముల చేతిలో మోసపోయే అవకాశాలు ఉన్నాయి...అప్రమత్తంగా ఉండండి. తండ్రి చేసిన అసంపూర్ణ కార్యాన్ని పూర్తి చేస్తారు.


ABP Desam


మిధున రాశి
ఈ రాశివారికి పాత వివాదాలు తొలగిపోతాయి. ఉద్యోగులు పనిపట్ల శ్రద్ధ వహించండి. కార్యాలయంలో మీపనికి కొంత అంతరాయం కలగొచ్చు. ఆర్థిక ప్రయోజనాలకు అవకాశం ఉంది.


ABP Desam


కర్కాటకం
ఈ రోజంతా బిజీబిజీగా ఉంటారు. సంతానికి సంబంధించిన అడ్డంకులు తొలగిపోతాయి. ఉద్యోగులు పదోన్నతి, బదిలీ పొందే అవకాశం ఉంది. అతిథుల రాక సంతోషాన్నిస్తుంది. ఖర్చులు పెరుగుతాయి.


ABP Desam


సింహ రాశి
ఈ రాశివారికి కారణం లేకుండా కోపంవస్తుంది. పరిస్థితిని అర్థం చేసుకుని నిర్ణయం తీసుకోండి. పొరపాటున చేసిన తప్పులతు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. స్నేహితుల నుంచి సహకారం అందుతుంది. ఇంటి అలంకరణ కోసం ఖర్చుచేస్తారు.


ABP Desam


కన్య
ఉద్యోగంలో ఎదురైన సమస్యలు తొలగిపోతాయి. జీవిత భాగస్వామి భావాలను గౌరవించండి. పిల్లల పురోగతి ద్వారా మీ ప్రత్యర్థులకు సమాధానం చెబుతారు. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. వ్యాపార విస్తరణకు అవకాశం ఉంది.


ABP Desam


తులా రాశి
మీ పనిని వ్యక్తిగత సమస్యలను లింక్ చేయకండి..దేనిపని దానిదే. పిల్లల కెరీర్ విషయంలో గందరగోళ పరిస్థితి ఉంటుంది. వ్యాపారులు జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం.


ABP Desam


వృశ్చిక రాశి
మంచి ఆలోచనను కోల్పోవద్దు..మిమ్మల్ని ప్రేమించేవారిని దూరం చేసుకోవద్దు. రాబోయే సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. మనసులో విషయాలకు సంబంధించి అనేక ఆలోచనలు వస్తాయి. జీవనోపాధి పెరుగుతుంది. ఇంటి పెద్దల ఆరోగ్యం క్షీణిస్తుంది.


ABP Desam


ధనుస్సు రాశి
ఆలోచించకుండా పనులు చేయొద్దు. జీవిత భాగస్వామితో సంతోష సమయం గడుపుతారు. ఈ రోజు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రేమ వ్యవహారంలో విజయం సాధిస్తామన్న ఆశఉంటుంది. ఆర్థిక విషయాలలో జాగ్రత్త అవసరం.


ABP Desam


మకర రాశి
మానసిక ఒత్తిడికి లోనవుతారు. మీరు అందరి కోసం ఆలోచిస్తారు కానీ ఎవరూ మిమ్మల్ని పట్టించుకోరు. ఆత్మీయుల నుంచి ఆప్యాయత లోపిస్తుంది. మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థికపరిస్థితి బావుంటుంది


ABP Desam


కుంభ రాశి
మీ ప్రవర్తనను మెరుగుపరచుకోండి. వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఇతరులకు హాని చేయవద్దు. తల్లిదండ్రుల మార్గదర్శకత్వం మీకు లభిస్తుంది. చెడిపోయిన సంబంధాలను సకాలంలో సరిచేసుకోవడం మంచిది. ఉద్యోగులు, వ్యాపారులకు సాధారణ ఫలితాలున్నాయి


ABP Desam


మీనరాశి
ఉద్యోగ స్థలంలో సహోద్యోగులతో విబేధాలు ఏర్పడతాయి. అవివాహితులకు ఇది అనుకూల సమయం.మానసిక ఒత్తిడి ఉంటుంది. ఉదర సంబంధిత వ్యాధులతో బాధపడతారు. వాహనం కొనుగోలు చేయాలనే ఆలోచన ఫలిస్తుంది.