Weekly Horoscope 19-25 December 2022 వారఫలాలు: ఈ రాశివారికి విజయంతో పాటూ సవాళ్లు తప్పవు
మేష రాశి ఈ వారం మేషరాశివారికి కొన్ని ఆర్థిక సవాళ్లుంటాయి. వారం మధ్యలో నష్టపోయే అవకాశం ఉంది. వైవాహిక జీవితంలోని సమస్యలు వారాంతానికి పరిష్కారం అవుతాయి. విద్యార్థులకు ఇప్పుడిప్పుడే చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. ఉద్యోగులు, వ్యాపారులు తమ లక్ష్యాన్నిచేరుకోవడం కష్టమవుతుంది.
వృషభ రాశి ఈ వారం అనారోగ్య సమస్యలను లైట్ తీసుకోవద్దు. ప్రేమికులు జాగ్రత్తగా ఉండాలి...హద్దులు దాటకండి. అవివాహితులు పెళ్లి దిశగా చేసే ప్రయత్నాలు సఫలం అవుతాయి. విద్యార్థులు క్రమశిక్షణ పాఠించాలి, ఆర్థిక వ్యవహారాలు పూర్తిచేయడంపై కొంత శ్రద్ధ పెట్టండి
మిథున రాశి మిథున రాశి వారు ఈ వారం వారి స్వభావంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వారం మధ్యలో వివాదాల పరిస్థితి కూడా రావొచ్చు. కార్యాలయ రాజకీయాలకు దూరంగా ఉండండి. మీ బాస్ దృష్టిలో మిమ్మల్ని తక్కువచేసేందుకు ప్రత్యర్థులు ప్రయత్నం చేయవచ్చు.
మిథున రాశి మిథున రాశి వారు ఈ వారం వారి స్వభావంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వారం మధ్యలో వివాదాల పరిస్థితి కూడా రావొచ్చు. కార్యాలయ రాజకీయాలకు దూరంగా ఉండండి. మీ బాస్ దృష్టిలో మిమ్మల్ని తక్కువచేసేందుకు ప్రత్యర్థులు ప్రయత్నం చేయవచ్చు. విద్యార్థులు తొందరపాటు తగ్గించుకోవాలి.
సింహ రాశి ఈ వారం సింహరాశివారికి విజయంతో పాటూ కొన్ని సవాళ్లను కూడా తీసుకొస్తోంది. ఆకస్మికంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం క్షీణించవచ్చు. కార్యాలయంలో మీపై వ్యతిరేకత పెరుగుతుంది కానీ మీరు మీ స్థానాన్ని బలంగా కాపాడుకోగలగుతారు.
కన్యా రాశి రాబోయే వారం మీకు ప్రత్యేకంగా ఉంటుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. డబ్బు కొరత తీరుతుంది. మీ ముఖ్యమైన పనులు ఆగవు. జీవిత భాగస్వామితో విభేదాలు రావొచ్చు. మాటల్లో వినయం కోల్పోకుండా చూసుకోండి. ప్రేమ భాగస్వామితో గడిపే అవకాశం లభిస్తుంది.
తులా రాశి వారం ఆరంభం అద్భుతంగా ఉన్నా ఆ తర్వాత కొన్ని ఇబ్బందులు తప్పవు. తల్లి ఆరోగ్యం పట్ల ఆందోళన ఉంటుంది. వారం చివరిలో విద్యార్థులు కొన్ని సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. కోర్సు పూర్తి చేయడంలో ఆటంకాలు ఏర్పడతాయి. గురువుతో వాదించవద్దు.
వృశ్చిక రాశి వారం ప్రారంభం మీకు సంతోషాన్నిస్తుంది. ఈ వారం మీరు మీ శత్రువులపై పైచేయి సాధిస్తారు. మీ ఆలోచనలు యజమానిని ఆకట్టుకుంటాయి. మీ ఇమేజ్‌ని బలోపేతం చేయడంలో మీరు విజయం సాధిస్తారు. సహోద్యోగుల విషయంలో అప్రమత్తంగా ఉండండి. మీ లక్ష్యంపై దృష్టి పెట్టండి.
ధనుస్సు రాశి ఈ రాశివారికి ఈ వారం ప్రత్యేకం.సూర్యుడి సంచారంతో పాటూ శుక్రుడు, బుధ గ్రహాలు కూడా మీ రాశిలో సంచరిస్తున్నాయి. త్రిగ్రాహి యోగం వల్ల కొన్ని విషయాల్లో లాభం ఉంటే, కొన్ని నష్టాలు కూడా ఎదుర్కోవాల్సి రావచ్చు. సంతానానికి సంబంధించి వైద్యలు సలహాలు తీసుకోవడం మంచిది.
మకర రాశి ఈ వారం శని సంచారం వల్ల మీరు కష్టానికి తగిన ఫలితం పొందుతారు. మీ పనితీరు పట్ల ఉన్నతాధికారులు సంతోషంగా ఉంటారు. విద్యార్థులు ఇప్పటికైనా చదువుపై శ్రద్ధ వహించాలి.ఆర్థిక పరిస్థితి బావుంటుంది. రావాల్సిన డబ్బు విషయంలో కొన్ని ప్రయత్నాలు చేయడం ద్వారా సక్సెస్ అవుతారు.
కుంభ రాశి ఈ వారం మీరు కొన్ని విషయాల్లో సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. శని సంచారం కారణంగా ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త వహించాలి. విద్యార్థులు లక్ష్య సాధనకు శ్రమించాల్సి ఉంటుంది. అనవసర విషయాలగురించి ఆరాటం తగ్గించుకుంటే మంచిది. వైవాహిక జీవితంలో కూడా కొంత గందరగోళం ఉండొచ్చు.
మీన రాశి ఈ వారం మీరు ఆనందంగా ఉంటారు. బృహస్పతి సంచారం మీకు కలిసొస్తుంది. ఇంట్లో ఏదైనా ఖరీదైన వస్తువును కొనుగోలు చేయవచ్చు. ఇంటా-బయటా గౌరవం పెరుగుతాయి. చదువుల కోసం విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులు విజయం సాధిస్తారు. వివాహంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి.