IPL 2026 SRH VS RCB Result Update: ఆర్సీబీపై SRH ప్రతీకార విజయం.. ఎలిమినేటర్ కు అర్హత.. రాణించిన కిషన్, అభిషేక్ క్లాసెన్, మలింగా
RCBపై ఘన విజయం సాధించిన SRH.. టాప్-2లో నిలిచే అవకాశాన్ని త్రుటిలో కోల్పోయింది. ఓవరాల్ గా అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ లో సత్తా చాటి, ఎలిమినేటర్ కు ముందు ఆత్మవిశ్వాసాన్ని దక్కించుకుంది.

IPL 2026 SRH VS RCB Latest Update: ఐపీఎల్ 2026 సీజన్ లో డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలేంజర్స్ బెంగళూరుపై మాజీ చాంపియన్ సన్ రైజర్స్ హైదరాబాద్ ప్రతీకార విజయం సాధించింది. లీగ్ తొలి మ్యాచ్ లో ఆర్సీబీ చేతిలో ఎదురైన పరాజయానికి 55 పరుగులతో గెలుపొంది, రివెంజ్ తీర్చుకుంది. అంతకుముందు సొంతగడ్డ ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 255 పరుగులు చేసింది. వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ సూపర్బ్ ఫిఫ్టీ (46 బంతుల్లో 79, 8 ఫోర్లు, 3 సిక్సర్లు) తో మరోసారి టాప్ స్కోరర్ గా నిలిచాడు. బౌలర్లలో రసిక్ సలామ్ కు రెండు వికెట్లు దక్కాయి. అనంతరం ఛేజింగ్ ను ఓవర్లన్నీ ఆడిన ఆర్సీబీ.. 4 వికెట్లకు 200 పరుగులకు మాత్రమే పరిమితమైంది. రజత్ పతిదార్ కెప్టెన్ ఇన్నింగ్స్ (39 బంతుల్లో 56, 6 ఫోర్లు, 1 సిక్సర్) తో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇషాన్ మలింగాకు రెండు వికెట్లు దక్కాయి. ఈ పరాజయంతో లీగ్ దశలో 9 విజయాలు సాధించిన సన్.. మూడో స్థానానికి పరిమతమైంది. దీంతో నాలుగోస్థానంలో నిలిచే జట్టుతో ఎలిమినేటర్ ఆడేందుకు సిద్ధమైంది. మరో 25 పరుగుల తేడాతో గెలిచినట్లయితే, సన్ టాప్-2లో నిలిచేది. అప్పుడు క్వాలిఫయర్-1 ఆడే సువర్ణవకాశం దక్కి ఉండేది. కానీ సన్ మాత్రం.. చేజేతులా ఈ అవకాశాన్ని చేజార్చుకుంది. ఇక శనివారం జరిగే లీగ్ మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ తో పంజాబ్ కింగ్స్ తలపడనుంది.
Ending the league stage on a 𝐰𝐢𝐧𝐧𝐢𝐧𝐠 note 🤩🔥 pic.twitter.com/iw6Dh02udy
— SunRisers Hyderabad (@SunRisers) May 22, 2026
వ్యూహంతో ఆడిన ఆర్సీబీ..
భారీ టార్గెట్ చూసి బెంబేలెత్తిన ఆర్సీబీ వ్యూహాత్మకంగా బ్యాటింగ్ చేసింది. మ్యాచ్ గెలవడం కంటే కూడా, టాప్-2లో నిలవడం కోసమే బ్యాటింగ్ చేసినట్లుగా కనిపించింది. స్టార్టింగ్ లో ఛేజింగ్ కోసం ప్రయత్నించినా, రెండు వికెట్లు పడిన తర్వాత టాప్-2పైనే ఫోకస్ పెట్టి ఆడినట్లుగా అనిపించింది. ఇక ఈ మ్యాచ్ లో వెంకటేశ్ అయ్యర్ (44) ను ఓపెనర్ గా దింపి, ఫలితాన్ని సాధించింది. విరాట్ కోహ్లీ (15) తో కలిసి తను శుభారంభం అందించాడు. ఆరంభంలోనే బౌండరీలతో విరుచుకుపడిని అయ్యర్.. స్కోరు బోర్డును పరుగులెత్తించాడు. దీంతో తను క్రీజులో ఉన్నంత వరకు 15కి పైగా రన్ రేట్ తో ఆర్సీబీ పరుగులు సాధించింది. అయితే వరుస ఓవర్లలో వెంకటేశ్ ను మలింగా, కోహ్లీని షకీబ్ హుస్సేన్ ఔట్ చేసి ఆర్సీబీకి షాకిచ్చారు. దీంతో పవర్ ప్లే ముగిసేసరికి 75 పరుగులతో మంచి జోరు కనబర్చింది.
T(𝐖)O IN QUICK SUCCESSIONS 🔥🔥pic.twitter.com/s3FTqelP9k
— SunRisers Hyderabad (@SunRisers) May 22, 2026
పతిదార్ పోరాటం..
ఓపెనర్లు ఔటైన కాసేపటికే వన్ డౌన్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ (21) ఔట్ కావడంతో ఆర్సీబీ కష్టాల్లో పడింది. ఈ దశలో తన అనుభవాన్నంత రంగరించిన పతిదార్.. అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. నాలుగో వికెట్ కు క్రునాల్ పాండ్యా (41 నాటౌట్) తో కలిసి మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. క్రునాల్ యాంకర్ ఇన్నింగ్స్ ఆడగా, పతిదార్ కీలక దశలో బ్యాట్ ఝులిపించాడు. దీంతో టాప్-2 చేరుకోవడానికి అవసరమైన 165 పరుగుల మార్కును దాటించాడు. ఈ క్రమంలో 37 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకుని వెనుదిరిగాడు. మరోవైపు టిమ్ డేవిడ్ (15 నాటౌట్) తో కలిసి మరో వికెట్ పడకుండా, క్రునాల్ మ్యాచ్ ను ముగించాడు. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ లో నిలిచిన ఆర్సీబీ.. క్వాలిఫయర్-1కు అర్హత సాధించింది. ఈ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ తో అమీతుమీ తేల్చుకోనుంది. ఇక ఎలిమినేటర్ కు అర్హత సాధించిన సన్.. టాప్-4లో నిలిచిన జట్టుతో అమీతుమీ తేల్చుకోనుంది. ఇక ఈ మ్యాచ్ లోరెండు వికెట్లతో రాణించిన ఇషాన్ మలింగకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
Before You Go
Hardik Pandya Ruled Out of ODI | ఆఫ్ఘాన్ వన్డే సిరీస్‌కు హార్దిక్ దూరం ?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు



















