సుదీర్ఘ చర్చల తర్వాత, మే 22న అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రపంచ దేశాలకు ఊరటనిచ్చింది.
USA Iran Peace Agreement:అమెరికా-ఇరాన్ మధ్య ముగిసిన పోరు! ప్రపంచానికి ఊరటనిచ్చిన శాంతి ఒప్పందం!
USA Iran Peace Agreement:ప్రపంచాన్ని వణికించిన అమెరికా-ఇరాన్ యుద్ధ మేఘాలు తొలగిపోయాయి. ఇరు దేశాల మధ్య కుదిరిన శాంతి ఒప్పందంతో ప్రపంచమంతా ఊపిరి పీల్చుకుంది.

- అమెరికా, ఇరాన్ మధ్య సైనిక దాడులు నిలిపివేసే ఒప్పందం కుదిరింది.
- ఇరాన్ అణు కార్యక్రమంతో ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభమైంది.
- ఏప్రిల్ 8న తాత్కాలిక కాల్పుల విరమణ, మే 22న ఒప్పందం ఖరారు.
- సైనిక దాడులు నిలిపివేత, సార్వభౌమాధికార గౌరవం ఒప్పందంలో అంశాలు.
USA Iran Peace Agreement: గత కొంతకాలంగా ప్రపంచాన్ని ప్రమాదపు అంచున నిలబెట్టిన అమెరికా-ఇరాన్ యుద్ధం ఎట్టకేలకు ముగిసింది. అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. ఈ కీలక పరిణామం ప్రపంచ దేశాలకు, ముఖ్యంగా గల్ఫ్‌్ ప్రాంతంలో నెలకున్న ఉద్రిక్తతలకు పెద్ద ఊరట అని చెప్పవచ్చు. సౌదీ అరేబియా మీడియా సంస్థ అల్‌హదత్ కథనం ప్రకారం రెండు దేశాల మధ్య సైనిక దాడులు పూర్తిగా నిలిపి వేసేందుకు అంగీకారం కుదిరింది. ఈ శాంతి ఒప్పందం ప్రపంచ దేశాలకు ఊరటనిచ్చింది.
యుద్ధం ఎప్పుడు ఎందుకు మొదలైంది
ఫిబ్రవరి 28న జరిగిన సైనిక చర్యతో యుద్ధం మొదలైంది. ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేస్తోందన్న ఆరోపణలతో అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై భీకర వైమానిక దాడులు ప్రారంభించాయి. దీనికి ప్రతిచర్యగా ఇరాన్ కూడా తీవ్రస్థాయిలో ఎదురు దాడికి దిగింది. పశ్చిమ ఆసియాలోని అమెరికా మిత్రదేశాలైన సౌదీ అరేబియా, ఖతార్, యూఏఈలతో పాటు ఇజ్రాయెల్ క్షిపణులతో దద్దరిల్లాయి. ఈ ఘర్షణ కేవలం రెండు దేశాల మధ్య కాకుండా, మొత్తం గల్ఫ్ ప్రాంత భద్రతను, ప్రపంచ చమురు సరఫరాలను ప్రమాదంలో పడేసింది.
ఒప్పందం ఎప్పుడు కుదిరింది?
సుదీర్ఘ కాలంగా సాగుతున్న ఈ ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఏప్రిల్ 8న అమెరికా-ఇరాన్ మధ్య ప్రాథమికంగా తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య శాంతి కోసం చర్చలు సాగుతూనే ఉన్నాయి. పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లో జరిగిన ముఖాముఖి చర్చలు విఫలమైనప్పటికీ పరోక్షంగా పలు దఫాలుగా చర్చలు కొనసాగాయి. చివరిగా మే 22న ప్రపంచ దేశాలు ఆశించినట్టు శాంతి ఒప్పందానికి తుది రూపం లభించింది. శుక్రవారం నాడు ఈ ఒప్పందం ఖరారు అయ్యింది.
ఒప్పందంలో ఏం ఉంది?
ఈ శాంతి సంధిలో అనేక అంశాలను ఇరు దేశాలు అంగీకరించాయి. ఇరు దేశాల మ్య అన్ని రకాల సైనిక దాడులను వెంటనే నిలిపేయాలి. పౌరులపై లేదా ఆర్థిక మౌలిక వసతులపై ఎట్టి పరిస్థితుల్లో దాడులు చేయకూడదు. ఒకరి దేశ సార్వభౌమాధికారాన్ని అంతర్గత వ్యవహారాలను మరొకరు గౌరవించాలి. పర్షియన్ గల్ఫ్ హార్ముజ్ జలసంధి, ఒమన్ గల్ఫ్‌లలో వాణిజ్య నౌకల రాకపోకలకు పూర్తి స్వేచ్ఛకు హామీ ఇవ్వాలి. వివాదాల పరిష్కారం కోసం ఇరు దేశాల ప్రతినిధులతో కూడిన సంయుక్త వ్యవస్థను ఏర్పాటు చేస్తారు.
అయితే ఈ డీల్‌లో ఇరాన్ యురేనియం నిల్వలు, అమెరికా విధించిన ఆంక్షల ప్రస్తావన లేకుండానే యుద్ధం ముగిసింది. ఇరాన్ ఈ ఒప్పందానికి కట్టుబడి ఉండే తీరును బట్టి అమెరికా క్రమంగా ఆర్థిక ఆంక్షలను ఎత్తివేసే అవకాశం ఉంది. యుద్ధం ఆగినప్పటికీ ఇంకా కొన్ని అంశాలపై స్పష్టత రాలేదు. అపరిష్కృతంగా ఉన్న అంశాలపై రాబోయే ఏడు రోజుల్లో చర్చలు ప్రారంభమవుతాయి. అధికారికంగా అమెరికా లేదా ఇరాన్ నుంచి ఇంకా ప్రకటన రావాల్సి ఉంది.
Before You Go
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
Frequently Asked Questions
అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం ఎప్పుడు కుదిరింది?
అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం ఎందుకు ప్రారంభమైంది?
ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేస్తోందన్న ఆరోపణలతో ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై దాడులు ప్రారంభించాయి. దీనికి ప్రతిచర్యగా ఇరాన్ ఎదురుదాడి చేసింది.
శాంతి ఒప్పందంలో ఇరు దేశాలు ఏయే అంశాలకు అంగీకరించాయి?
సైనిక దాడులను నిలిపివేయడం, పౌరులపై దాడులు చేయకపోవడం, సార్వభౌమాధికారాన్ని గౌరవించడం, వాణిజ్య నౌకల రాకపోకలకు స్వేచ్ఛకు హామీ ఇవ్వడం వంటి అంశాలపై ఇరు దేశాలు అంగీకరించాయి.
యుద్ధం ముగిసినా, కొన్ని అంశాలపై స్పష్టత ఎందుకు రాలేదు?
ఈ డీల్‌లో ఇరాన్ యురేనియం నిల్వలు, అమెరికా విధించిన ఆంక్షల ప్రస్తావన లేదు. ఈ అపరిష్కృతంగా ఉన్న అంశాలపై రాబోయే ఏడు రోజుల్లో చర్చలు ప్రారంభమవుతాయి.
ట్రెండింగ్ వార్తలు






















