అన్వేషించండి

NEET UG 2026 Fee Refund: NEET UG 2026 అభ్యర్థులకు అలర్ట్! ఫీజు రీఫండ్ లింక్‌ యాక్టివేట్‌! ఇలా అప్లై చేసుకోండి!

NEET UG 2026 Fee Refund: NEET UG 2026 విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది ఎన్టీఏ. ఫీజు రీఫండ్ ప్రక్రియను ప్రారంభించింది. అభ్యర్థులు మే 27 లోపు అధికారిక వెబ్‌సైట్‌లో తమ బ్యాంకు వివరాలు నమోదు చేయాలి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • నీట్ యూజీ 2026 పరీక్ష రద్దు, అభ్యర్థులకు ఫీజు రీఫండ్ ప్రక్రియ ప్రారంభం.
  • మే 27 లోపు బ్యాంకు వివరాలు నమోదు చేసుకొని రీఫండ్ పొందాలి.
  • బ్యాంకు ద్వారా నేరుగా ఛార్జ్ బ్యాక్ ప్రక్రియను ప్రారంభించవద్దని సూచన.
  • రద్దు చేసిన పరీక్ష జూన్ 21న, కొత్త హాల్ టికెట్లు జారీ.

NEET UG 2026 Fee Refund: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నీట్ యూజీ 2026 అభ్యర్థులకు సంబంధించిన కీలక నిర్ణయం తీసుకుంది. మే 3న జరిగిన పరీక్ష రద్దు కావడంతో, అభ్యర్థులకు ఫీజు రీఫండ్ చేసే ప్రక్రియను అధికారికంగా ప్రారంభించింది. దీనికి సంబంధించిన రీఫండ్ పోర్టల్ లింక్‌ ప్రస్తుతం neet.nta.nic.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. 

ఎందుకు డబ్బులు వెనక్కి ఇస్తున్నట్టు!

దేశవ్యాప్తంగా వైద్యవిద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీటి యూజీ 2026 పరీక్ష ఈ ఏడాది వివాదాలకు కేంద్ర బిందువైంది. మే 3న జరిగిన పరీక్ష పేపర్ లీక్ అయినట్టు నిర్దారణ కావడంతో విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఎన్టీఏ ఆ పరీక్షను రద్దు చేసింది. ఈ క్రమంలో, విద్యార్థులకు జరిగిన అసౌకర్యాన్ని పరిగణలోకి తీసుకొని, పాతి ఫీజును రీఫండ్ చేయడమే లేదా తదుపరి ప్రక్రియకు సంబంధించిన వెసులుబాటు కల్పించాలని నిర్ణయించింది 

రీఫండ్ ప్రక్రియ ఇదే 

రీఫండ్ ప్రక్రియ సజావుగా సాగాలంటే అభ్యర్థులు తమ బ్యాంకు వివరాలను సిద్ధం చేసుకోవాలి. ఈ స్టెప్స్ ఫాలో చేసి వివరాలు నమోదు చేసుకోవాలి. నమోదు చేయాల్సిన వివరాలు 

  • ఖాతాదారుని పేరు 
  • ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ 
  • బ్యాంకు అకౌంట్ నెంబర్ 
  • బ్యాంకు పేరు 
  • క్యాన్సిల్ చేసిన చెక్(ఇది ఆప్షనల్‌, కానీ అప్‌లోడ్‌ చేస్తే ధ్రువీకరణ ఈజీ అవుతుంది)

ముఖ్యమైన తేదీలు గడవు

అభ్యర్థులు గమనించాల్సిన ప్రధాన విషయం ఏంటంటే, ఈ రీఫండ్‌ కోసం దరఖాస్తు చేసుకోవడానికి సమయం చాలా తక్కువగా ఉంది. రీఫండ్ విండో మే 22న ప్రారంభమైంది. చివరి తేదీ మే 27.   ఈ గడువు దాటిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో మార్పులకు, కొత్తగా అప్లై చేసుకోవడానికి వీలు ఉండదు. 

రీఫండ్ కోసం దరఖాస్తు ఎలా చేయాలి?

అభ్యర్థులు ఎటువంటి పొరపాట్లు చేయకుండా రీఫండ్ పొందడానికి ఈ స్టెప్స్ ఫాలో కావాలి. మొదట ఎన్టీఏ అధికారిక వెబ్‌సైట్‌ neet.nta.nic.in విజిట్ చేయాలి. తర్వాత మీ నీట్ యూజీ 2026 లాగిన్ వివరాలతో పోర్టల్‌లో ప్రవేశించాలి. అక్కడ హోమ్‌పేజీలో కనిపిస్తున్న NEET UG 2026 Fee Refund Linkపై క్లిక్ చేయాలి. అక్కడ అడిగిన మీ బ్యాంకు వివరాలను జాగ్రత్తగా నింపాలి. వివరాలన్నీ సరి చూసుకున్న తర్వాత సబ్‌మిట్ బటన్‌పై క్లిక్ చేయాలి. ఒకసారి సబ్‌మిట్ చేసిన తర్వాత మళ్లీ మార్చుకోవడానికి అవకాశం ఉండదు. 

ఛార్జ్ బ్యాక్ వద్దు 

రీఫండ్ ప్రక్రియకు సంబంధించిన ఎన్టీఏ అభ్యర్థులకు ఒక గట్టి హెచ్చరిక జారీ చేసింది. అభ్యర్థులు తమ బ్యాంకు ద్వారా నేరుగా ఛార్జ్ బ్యాక్ ప్రక్రియను ప్రారంభించవద్దని సూచించింది. కేవలం ఎన్టీఏ వెబ్‌సైట్ ద్వారానే అధికారికంగా రీఫండ్ క్లెయిమ్ చేసుకోవాలని కోరింది. 

మళ్లీ పరీక్ష ఎప్పుడు 

రద్దు చేసిన నీట్ యూజీ పరీక్షను తిరిగి నిర్వహించేందుకు ఎన్టీఏ ఇప్పటికే ముహూర్తం ఖరారు చేసింది. జూన్ 21న జరిగే పరీక్ష కోసం కొత్త హాల్ టికెట్లు జారీ చేయనున్నారు. అభ్యర్థులు తమ అప్లికేషన్‌ నెంబర్, పుట్టిన తేదీని ఉపయోగించి అధికారిక వెబ్‌సైట్ నుంచి కొత్త హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలి. విద్యార్థులు తమ రీఫండ్ ప్రక్రియను మే 27లోపు పూర్తి చేసుకొని జూన్ 21న జరగబోయే పరీక్షలు సిద్ధం కావాలని నిపుణులు సూచిస్తున్నారు.    

Frequently Asked Questions

నీట్ యూజీ 2026 పరీక్ష రద్దు చేయడానికి కారణం ఏమిటి?

మే 3న జరిగిన నీట్ యూజీ 2026 పరీక్ష పేపర్ లీక్ అయినట్లు నిర్ధారణ కావడంతో, అభ్యర్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఆ పరీక్షను రద్దు చేసింది.

ఫిజు రీఫండ్ ప్రక్రియను ఎవరు ప్రారంభించారు?

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నీట్ యూజీ 2026 అభ్యర్థులకు సంబంధించిన ఫిజు రీఫండ్ ప్రక్రియను అధికారికంగా ప్రారంభించింది.

రీఫండ్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఎప్పుడు?

రీఫండ్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ మే 27. ఈ గడువు దాటిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ మార్పులు లేదా కొత్త దరఖాస్తులకు అవకాశం ఉండదు.

రీఫండ్ కోసం దరఖాస్తు చేయడానికి ఏమి అవసరం?

రీఫండ్ ప్రక్రియ సజావుగా సాగాలంటే అభ్యర్థులు తమ బ్యాంకు వివరాలను (ఖాతాదారుని పేరు, IFSC కోడ్, బ్యాంకు ఖాతా నంబర్, బ్యాంకు పేరు) సిద్ధం చేసుకోవాలి. క్యాన్సిల్ చేసిన చెక్ ఆప్షనల్.

రద్దు చేసిన నీట్ యూజీ పరీక్ష ఎప్పుడు తిరిగి నిర్వహించబడుతుంది?

రద్దు చేసిన నీట్ యూజీ పరీక్షను తిరిగి నిర్వహించడానికి NTA జూన్ 21న ముహూర్తం ఖరారు చేసింది. ఈ పరీక్ష కోసం కొత్త హాల్ టికెట్లు జారీ చేయబడతాయి.

టాప్ హెడ్ లైన్స్

Pilot Career : పైలట్ కావాలంటే 10 తర్వాత ఏం చదవాలి? కోర్సు, ట్రైనింగ్, జీతం పూర్తి వివరాలు ఇవే
పైలట్ కావాలంటే 10 తర్వాత ఏం చదవాలి? కోర్సు, ట్రైనింగ్, జీతం పూర్తి వివరాలు ఇవే
CBSE 10th Rules: సీబీఎస్ఈ 10వ తరగతి విద్యార్థులకు బిగ్ రిలీఫ్.. ఉత్తీర్ణత రూల్స్‌లో మార్పుల్లేవ్!
సీబీఎస్ఈ 10వ తరగతి విద్యార్థులకు బిగ్ రిలీఫ్.. ఉత్తీర్ణత రూల్స్‌లో మార్పుల్లేవ్!
Study in Germany: జర్మనీలో చదువు ఫ్రీ.. కానీ ట్యూషన్ ఫీజులు, అసలు ఖర్చుల గురించి తెలుసా?
జర్మనీలో చదువు ఫ్రీ.. కానీ ట్యూషన్ ఫీజులు, అసలు ఖర్చుల గురించి తెలుసా?
Local Reservation In Telangana: తెలంగాణలో స్థానికత అంశంపై సుప్రీంకోర్టు క్లారిటీ.. వారికి మాత్రమే లోకల్ రిజర్వేషన్
తెలంగాణలో స్థానికత అంశంపై సుప్రీంకోర్టు క్లారిటీ.. వారికి మాత్రమే లోకల్ రిజర్వేషన్ అని తీర్పు

వీడియోలు

India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్
Rohit Virat Final Match in Guwahati? | గౌహతి వేదికగా రోహిత్, కోహ్లీ చివరి మ్యాచ్?
Reason for Virat Kohli Test Retirement | విరాట్ టెస్ట్ రిటైర్మెంట్ వెనుక అసలు నిజం ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Finances: బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
AP NTR Bharosa New Pensions: ఏపీలో కొత్త పింఛన్ల చిక్కుముడి- 13 లక్షల దరఖాస్తులు - కూటమికి ఆర్థిక, రాజకీయ భారం - అసంతృప్తి తప్పదా?
ఏపీలో కొత్త పింఛన్ల చిక్కుముడి- 13 లక్షల దరఖాస్తులు - కూటమికి ఆర్థిక, రాజకీయ భారం - అసంతృప్తి తప్పదా?
Harish Rao Siddipet : సిరిసిల్ల తర్వాత సిద్ధిపేటపై రేవంత్ కన్ను - హరీష్ రావు కోటలో కాంగ్రెస్ రణభేరి ఫలిస్తుందా?
సిరిసిల్ల తర్వాత సిద్ధిపేటపై రేవంత్ కన్ను - హరీష్ రావు కోటలో కాంగ్రెస్ రణభేరి ఫలిస్తుందా?
YSRCP Local Elections Strategy: స్థానిక ఎన్నికల్లో జగన్ మార్క్ క్లాస్ - కూటమి విభేదాలపై వైఎస్సార్‌సీపీ పొలిటికల్ అటాక్ -
స్థానిక ఎన్నికల్లో జగన్ మార్క్ క్లాస్ - కూటమి విభేదాలపై వైఎస్సార్‌సీపీ పొలిటికల్ అటాక్ -
Weight Loss Journey : 100 కిలోల నుంచి 72 కిలోలు తగ్గిన డాక్టర్.. ఈ 3 అలవాట్లతో ఆరోగ్యంలో కూడా ఊహించని మార్పులు వచ్చాయట
100 కిలోల నుంచి 72 కిలోలు తగ్గిన డాక్టర్.. ఈ 3 అలవాట్లతో ఆరోగ్యంలో కూడా ఊహించని మార్పులు వచ్చాయట
MLA Chintamaneni Prabhakar: వెదురుపావులూరు టోల్ ప్లాజా ఘటనలో ఎమ్మెల్యే చింతమనేని ఏ సంబంధం లేదు, అసలేం జరిగిందంటే
వెదురుపావులూరు టోల్ ప్లాజా ఘటనలో ఎమ్మెల్యే చింతమనేని ఏ సంబంధం లేదు, అసలేం జరిగిందంటే
Flydubai Attack: నమాజ్ చేసుకుంటానని లేచి, వెనుక నుంచి గొడ్డలితో దాడి! ఏం జరిగిందో చెప్పిన స్మిత్ మచ్చర్‌
నమాజ్ చేసుకుంటానని లేచి, వెనుక నుంచి గొడ్డలితో దాడి! ఏం జరిగిందో చెప్పిన స్మిత్ మచ్చర్‌
Chickpeas Benefits : ఉదయాన్నే ఖాళీ కడుపుతో శనగలు తింటే కలిగే లాభాలివే.. రాత్రుళ్లు నానబెట్టి పచ్చిగా తినాలా? ఉడికించి తింటే బెటరా?
ఉదయాన్నే ఖాళీ కడుపుతో శనగలు తింటే కలిగే లాభాలివే.. రాత్రుళ్లు నానబెట్టి పచ్చిగా తినాలా? ఉడికించి తింటే బెటరా?
Embed widget