అన్వేషించండి

NEET UG Exam Online: వచ్చే ఏడాది నుంచి ఆన్‌లైన్‌లోనే.. నీట్ రీఎగ్జామ్ అభ్యర్థులకు వారం గడువు: కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్

వచ్చే ఏడాది నీట్ యూజీ ఎగ్జామ్ ఆన్‌లైన్‌లోనే నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు.

న్యూఢిల్లీ: వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ (NEET UG) పరీక్షా విధానంలో కేంద్ర ప్రభుత్వం మార్పులకు శ్రీకారం చుట్టింది. వచ్చే ఏడాది నుంచి నీట్ పరీక్షను ఓఎంఆర్ (OMR) షీట్ విధానంలో కాకుండా పూర్తిగా ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. పేపర్ లీక్ వివాదాల నేపథ్యంలో పరీక్షా ప్రక్రియలో పారదర్శకతను పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.

నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. విద్యార్థుల ప్రయోజనాలే ప్రభుత్వ తొలి ప్రాధాన్యత అని, సోషల్ మీడియాలో కొందరు వ్యక్తులు అపోహలు సృష్టిస్తున్నారని అన్నారు. నీట్ యూజీ రీఎగ్జామ్ కోసం విద్యార్థులు తమ సౌలభ్యం ప్రకారం సిటీని ఎంచుకోవడానికి ఒక వారం సమయం లభిస్తుందని, Admit Cards జూన్ 14 న విడుదల చేస్తామని ఆయన వెల్లడించారు.

నీట్ పేపర్ లీక్ కేసుపై ధర్మేంద్ర ప్రధాన్ ఏమన్నారు?
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నీట్ పేపర్ లీకులపై స్పందించారు. 'విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభుత్వం ఫోకస్ చేసింది. ఎన్‌టీఏ నీట్ యూజీ ఎగ్జామ్ మే 3న నిర్వహించింది. మే 7న ఎన్‌టీఏకు ఒక అభ్యంతరం వ్యక్తమైంది. గెస్ పేపర్‌లోని కొన్ని ప్రశ్నలు ఈ ఏడాది నిర్వహించిన ఎగ్జామ్ పేపర్‌లో వచ్చాయని తెలిసింది. ఎన్‌టీఏ, ప్రభుత్వం వెంటనే దీనిపై దర్యాప్తు చేపట్టాయి.  ఈసారి పేపర్ లీక్ అయిందని మా దృష్టికి రాగానే, ఎడ్యుకేషన్ మాఫియా కుట్రల వల్ల అర్హులైన విద్యార్థులకు అన్యాయం జరగకూడదని భావించాం. అందుకే, నీట్ యూజీ ఎగ్జామ్ రద్దు చేస్తున్నట్లు మే 12న ప్రకటించాం' అని తెలిపారు.

Also Read: NEET UG 2026 Exam Date: జూన్ 21న నీట్ యూజీ 2026 రీఎగ్జామ్.. అధికారికంగా వెల్లడించిన ఎన్టీఏ

ఎలాంటి అవకతవకలను సహించేది లేదు
‘రద్దు చేసిన ఎగ్జామ్ వచ్చే నెలలో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నాం. జూ్ 21న రీఎగ్జామ్ నిర్వహించనున్నామని ఎన్టీఏ ప్రకటించింది. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడేవారిపై చర్యలు తీసుకునేందుకుగానూ ప్రభుత్వం ఈ కేసు దర్యాప్తును సిబిఐ (CBI)కి అప్పగించింది. అన్ని శాఖలు దీనిని తీవ్రంగా పరిగణించి రంగంలోకి దిగాయి. ఎలాంటి అవకతవకలను సహించేది లేదని’ ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు. 

22 లక్షల మంది అభ్యర్థులు..

నీట్ యూజీ పరీక్షకు సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మే 6న తాత్కాలిక ఆన్సర్ కీని విడుదల చేసింది. భారత్‌లోని 551 నగరాలతో పాటు విదేశాల్లోని 14 నగరాల్లోని మొత్తం 5,432 కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు సుమారు 22 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. అయితే, ఆన్సర్ కీ విడుదలైన తర్వాత చేతితో రాసిన ఒక గెస్‌ పేపర్‌ను అధికారులు స్వాధీనం చేసుకోవడంతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ గెస్‌ పేపర్‌లోని ప్రశ్నలను అసలు పరీక్షా పత్రంతో పోల్చి చూడగా, ఏకంగా 120 ప్రశ్నలు ఒకేలా ఉన్నట్లు గుర్తించారు. ఇందులో 90 బయాలజీ మరియు 30 కెమిస్ట్రీ ప్రశ్నలు ఉన్నట్లు అధికారులు గుర్తించి చర్యలు చేపట్టారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Khudiram Bose:18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
Fact Check: విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?
విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?
AP DSC Notification 2026: అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
Advertisement

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy:
"చేతబడి తిరగబడింది, అష్టదిగ్బంధమయ్యారు" బీఆర్‌ఎస్ నేతలపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Vishwanath And Sons Twitter Review - 'విశ్వనాథ్ అండ్ సన్స్' ట్విట్టర్ రివ్యూ: సూర్య సినిమా టాకేంటి? వెంకీ మళ్ళీ హిట్టు కొట్టాడా?
'విశ్వనాథ్ అండ్ సన్స్' ట్విట్టర్ రివ్యూ: సూర్య సినిమా టాకేంటి? వెంకీ మళ్ళీ హిట్టు కొట్టాడా?
Agadha Twitter Review - అగధ ట్విట్టర్ రివ్యూ: కాలయంత్రం క్లైమాక్స్ సూపర్... ఎంఎస్ రాజు థ్రిల్లర్ సినిమా ప్రీమియర్స్ రిపోర్ట్
అగధ ట్విట్టర్ రివ్యూ: కాలయంత్రం క్లైమాక్స్ సూపర్... ఎంఎస్ రాజు థ్రిల్లర్ సినిమా ప్రీమియర్స్ రిపోర్ట్
IND vs SL Spin Attack: లంకతో ఫస్ట్ టెస్ట్ లో ఇండియా స్పిన్ త్రయంతో అటాక్.. గాలే పిచ్ పై మోర్కెల్ న‌యా స్ట్రాటజీ!
లంకతో ఫస్ట్ టెస్ట్ లో ఇండియా స్పిన్ త్రయంతో అటాక్.. గాలే పిచ్ పై మోర్కెల్ న‌యా స్ట్రాటజీ!
YS Jagan Kurnool Tour: కర్నూలులో వైఎస్ జగన్ పర్యటన! ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టుపై నిప్పులు! జైల్లో తనను అవమానించారని కామెంట్స్!
కర్నూలులో వైఎస్ జగన్ పర్యటన! ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టుపై నిప్పులు! జైల్లో తనను అవమానించారని కామెంట్స్!
Pawan Kalyan: ఏనుగుల సంరక్షణలో  ఆంధ్రప్రదేశ్‌ నూతన అధ్యాయం! విశాఖలో జరిగిన ప్రపంచ ఏనుగుల దినోత్సవంలో పవన్  
ఏనుగుల సంరక్షణలో  ఆంధ్రప్రదేశ్‌ నూతన అధ్యాయం! విశాఖలో జరిగిన ప్రపంచ ఏనుగుల దినోత్సవంలో పవన్  
కర్మను మించినది ఏదీ లేదు! శని దేవుడు నేర్పించే 7 పాఠాలు!
కర్మను మించినది ఏదీ లేదు! శని దేవుడు నేర్పించే 7 పాఠాలు!
Embed widget