అన్వేషించండి

NEET UG 2026 Exam Date: జూన్ 21న నీట్ యూజీ 2026 రీఎగ్జామ్.. అధికారికంగా వెల్లడించిన ఎన్టీఏ

NEET UG 2026 | ఇటీవల రద్దు చేసిన నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ జూన్ 21న నిర్వహించనున్నారు. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటన చేసింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • పేపర్ లీక్ కారణంగా రద్దైన NEET UG 2026 పరీక్ష జూన్ 21న నిర్వహించనుంది.
  • అభ్యర్థులు రీ-ఎగ్జామ్ కోసం ఎటువంటి అదనపు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.
  • NTA అధికారులు త్వరలోనే కొత్త అడ్మిట్ కార్డులను విడుదల చేయనున్నారు.

న్యూఢిల్లీ: ఇటీవల రద్దు చేసిన నీట్ యూజీ 2026 ఎగ్జామ్ ను ఎన్టీఏ రీషెడ్యూల్ చేసింది. ప్రభుత్వం ఆమోదంతో NEET UG 2026  ఎగ్జామ్ జూన్ 21, 2026న నిర్వహించనున్నట్లు జాతీయ పరీక్షల సంస్థ (NTA) ప్రకటించింది. పరీక్షకు సంబంధించిన అప్‌డేట్‌లు మరియు సమాచారం కోసం అభ్యర్థులు, తల్లిదండ్రులు NTA అధికారిక కమ్యూనికేషన్ ఛానెల్‌లను చూడాలని సూచించింది. నేటి ఉదయం న్యూఢిల్లీలోని 19 తీన్ మూర్తి మార్గ్‌లో కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాబోయే NEET పరీక్షపై మీడియాకు వివరించనున్నారు. విద్యార్థులు రీఎగ్జామ్ కు ఎలాంటి ఎగ్జామ్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు.

మే 14న NEET పరీక్ష కోసం సన్నాహాలను అంచనా వేయడానికి కేంద్ర విద్యా మంత్రి అధికారిక నివాసంలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. నీట్ యూజీ కోసం సన్నద్ధత, ఏర్పాట్లను చెక్ చేయడానికి విద్యా రంగంలోని సీనియర్ అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. హాజరైన వారిలో ఉన్నత విద్యా కార్యదర్శి, పాఠశాల విద్యా కార్యదర్శి, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) డైరెక్టర్ జనరల్, సీబీఎస్ఈ ఛైర్‌పర్సన్, కేంద్ర విద్యాలయ సంఘటన్ (KVS)తో పాటు నవోదయ విద్యాలయ సమితి (NVS) కమీషనర్లు ఉన్నారు.

పేపర్ లీక్ కారణంగా NEET UG పరీక్ష రద్దు
పేపర్ లీక్ ఆరోపణలు రావడంతో 22 లక్షల మందికి పైగా అభ్యర్థులపై ప్రభావం చూపుతుందని  మే 3, 2026న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్వహించిన NEET UG 2026 ఎగ్జామ్ రద్దు చేశారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI)ఈ కేసు దర్యాప్తు చేపట్టింది. 

 NTA మే 6న NEET UG కోసం తాత్కాలిక ఆన్సర్ కీని విడుదల చేసింది. ఈ పరీక్ష భారత్‌లోని 551 నగరాల్లో, విదేశాలలో 14 నగరాల్లో 5,432 కేంద్రాల్లో నిర్వహించారు. దాదాపు 22.79 లక్షల మంది అభ్యర్థులు రిజిస్టర్ చేసుకున్నారు. అయితే ఆన్సర్ కీ విడుదలయ్యాక  చేతితో రాసిన గెస్‌ పేపర్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అందులో ఉన్న ప్రశ్నలను అసలు ఎగ్జామ్ పేపర్‌తో పోల్చి చూడగా ఏకంగా 120 ప్రశ్నలు మ్యాచ్ అయినట్టు గుర్తించారు. ఇందులో 90 బయాలజీ, 30 కెమిస్ట్రీ ప్రశ్నలు ఉన్నట్లు తెలుస్తోంది. 

ఫీజు అక్కర్లేదు.. పాత వివరాలతోనే అడ్మిట్ కార్డులు

 నీట్ యూజీ రీ-ఎగ్జామ్‌కు సంబంధించి అభ్యర్థులు గతంలో (మే 2026 పరీక్ష కోసం) సమర్పించిన వివరాలు, ఎంచుకున్న పరీక్షా కేంద్రాల సమాచారమే రీఎగ్జామ్‌కు కూడా వర్తిస్తుందని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) స్పష్టం చేసింది. ఈ క్రమంలో విద్యార్థులు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం గానీ, అదనంగా ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం గానీ లేదు. పాత హాల్ టికెట్లను రీ-ఎగ్జామ్ కు పనికిరావు. ఎన్టీఏ మళ్లీ కొత్త హాల్ టికెట్లు జారీ చేస్తుంది. ఎన్టీఏ త్వరలోనే కొత్త అడ్మిట్ కార్డులను జారీ చేస్తుందని అధికారులు వెల్లడించారు. 

Frequently Asked Questions

NEET UG 2026 రీ-ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది?

NEET UG 2026 రీ-ఎగ్జామ్ జూన్ 21, 2026న నిర్వహించనుంది. ఈ విషయాన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ప్రకటించింది.

NEET UG 2026 రీ-ఎగ్జామ్ కోసం అదనంగా ఫీజు చెల్లించాలా?

లేదు, NEET UG 2026 రీ-ఎగ్జామ్ కోసం అభ్యర్థులు ఎటువంటి అదనపు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. పాత వివరాలతోనే పరీక్ష రాయవచ్చు.

NEET UG 2026 పరీక్ష ఎందుకు రద్దు చేయబడింది?

పేపర్ లీక్ ఆరోపణల కారణంగా NEET UG 2026 పరీక్ష రద్దు చేయబడింది. ఈ కేసు దర్యాప్తును CBI చేపట్టింది.

NEET UG 2026 రీ-ఎగ్జామ్ కోసం కొత్త అడ్మిట్ కార్డులు ఎప్పుడు వస్తాయి?

NTA త్వరలోనే NEET UG 2026 రీ-ఎగ్జామ్ కోసం కొత్త అడ్మిట్ కార్డులను జారీ చేస్తుంది. పాత హాల్ టికెట్లు చెల్లవు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
Andhra Pradesh Assembly Sessions: ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
Andhra Pradesh Assembly Sessions: ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
Embed widget