అన్వేషించండి

NEET Paper Leak: రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?

పేపర్ లీక్ ఆరోపణలతో నీట్ యూజీ 2026 పరీక్షలను కేంద్రం రద్దు చేసింది. ఇద్దరు మాస్టర్ మైండ్‌లను అదుపులోకి తీసుకున్నారు. ఇంత వరకు ఓకే కానీ రీ ఎగ్జామ్ ఎప్పుడు పెడతారనే టెన్షన్ విద్యార్థుల్లో ఉంది. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • నీట్ యూజీ పరీక్షలో ప్రశ్నపత్రం లీక్, 120 ప్రశ్నలు సరిపోలాయి.
  • పేపర్ లీక్ కేసులో కీలక సూత్రధారులు అరెస్ట్, సీబీఐకి విచారణ.
  • జూన్ నెలలో నీట్ యూజీ రీ-ఎగ్జామ్, కొత్త అడ్మిట్ కార్డులు జారీ.

NEET UG New Exam Date: భారత్‌లో వైద్య విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించే అతి పెద్ద ప్రవేశ పరీక్ష నీట్ యూజీ (NEET UG 2026) ప్రస్తుతం తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. మే 3వ తేదీన దేశవ్యాప్తంగా జరిగిన ఈ పరీక్షలో ప్రశ్నపత్రం లీక్ అయిందన్న ఆరోపణలు రావడంతో, అధికారులు పరీక్షను రద్దు చేయాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం సుమారు 22 లక్షల మంది విద్యార్థులపై ప్రభావం చూపుతోంది. ఈ కుంభకోణం వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు? విద్యార్థులు ఇప్పుడు ఏం చేయాలి? మళ్లీ పరీక్ష ఎప్పుడు ఉంటుంది? వంటి కీలక అంశాల గురించి తెలుసుకుందాం. 

పరీక్ష రద్దుకు కారణం ఏంటీ?

మే 3న నిర్వహించిన నీట్ పరీక్షలో అక్రమాలు జరిగినట్టు ప్రాథమిక విచారణలో తేలింది. ప్రధానంగా రాజస్థాన్‌కు చెందిన స్పెషల్ ఆపరేషన్ గ్రూప్‌ జరిపిన దర్యాప్తులో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దర్యాప్తు అధికారులు ఒక చేతితో రాసిన గెస్‌ పేపర్‌ స్వాధీనం చేసుకున్నారు. ఆ పత్రంలో ఉన్న ప్రశ్నలను అసలు పరీక్షా పత్రంతో పోల్చి చూడగా ఏకంగా 120 ప్రశ్నలు మ్యాచ్ అయినట్టు పోలీసులు గుర్తించారు. ఇందులో 90 బయాలజీ ప్రశ్నలు, 30 కెమిస్ట్రీ ప్రశ్నలు ఉన్నట్టు సమాచారం.  ఇంత భారీ స్థాయిోల ప్రశ్నలు ముందే బయటకు రావడంతో పరీక్ష పారదర్శకతపై నమ్మకం సన్నగిల్లింది. ఫలితంగా పరీక్ష రద్దుకు దారి తీసింది. 

నిందితులు ఎవరు? దర్యాప్తు ఎక్కడ వరకు వచ్చింది?

ఈ పేపర్ లీక్ వ్యవహారంలో కీలక సూత్రధారులుగా భావిస్తున్న మనీష్‌ యాదవ్, రాకేష్‌ మాండవ్రియాలను రాజస్థాన్‌ ఎస్‌ఓజీ పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. ఈ నెట్‌వర్క్ ఇంకా ఎంత మందికి విస్తరించిందనే కోణంలో విచారణ సాగుతోంది. అయితే ఈ కేసు తీవ్రతను పరిగణలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం, ఈ వ్యవహారాన్ని సమగ్రంగా విచారించేందుకు సీబీఐకి బాధ్యతలు అప్పగించింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ  కూడా సీబీఐకి సహకారం అందిస్తామని అవసరమైన రికార్డులు, సాక్ష్యాలు అందజేస్తామని స్ఫష్టం చేసింది. 

రీ ఎగ్జామ్‌ ఎప్పుడు ఉంటుంది?

పరీక్ష రద్దు కావడంతో విద్యార్థులంతా తదుపరి పరీక్ష తేదీ కోసం ఎదురు చూస్తున్నారు. అధికారిక సమాచారం ప్రకారం నీట్ యూజీ 2026 రీ- ఎగ్జా్‌ జూన్‌ నెలలో నిర్వహించే అవకాశం ఉంది. గతంలో 2024లో ఇలాంటి పరిస్థితుల్లో పరీక్ష రద్దు అయినప్పుడు జూన్ 23న రీ ఎగ్జామ్ నిర్వహించారు. కాబట్టి విద్యార్థులు జూన్ మాసంలో పరీక్షకు సిద్ధంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. పూర్తి స్థాయి ఫలితాలు ఈ రీ ఎగ్జామ్‌ పూర్తి అయిన తర్వాతే విడుదలవుతాయి. 

విద్యార్థులకు కీలక సమాచారం 

పరీక్ష రద్దు, రీ ఎగ్జామ్‌ప్రక్రియపై విద్యార్థులు, తల్లిదండ్రులకు ఉన్న సందేహాలను ఎన్టీఏ కొన్ని వివరణలు ఇచ్చింది. 

రీ ఎగ్జామ్‌ కోసం విద్యార్థులు కొత్తగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. మే 2026 పరీక్ష కోసం మీరు ఇచ్చిన వివరాలు, అభ్యర్థిత్వం, మీరు ఎంచుకున్న పరీక్షా కేంద్రాల సమాచారమే తదుపరి పరీక్షకు వర్తిస్తుంది. మళ్లీ ఫీజు కట్టాల్సిన పని లేదు. రీ ఎగ్జామ్‌ కోసం ఎటువంటి అనపు ఫీజు వసూలు చేయరు. అంతే కాకుండా గతంలో చల్లించిన ఫీజును రీ ఫండ్ చేస్తామని, ఎన్టీఏ తన అంతర్గత వనరులతోనే ఈ పరీక్షను మళ్లీ నిర్వహిస్తారు. 

పాత హాల్ టికెట్ చెల్లదు. రీ ఎగ్జామ్‌ కోసం ఎన్టీఏ కొత్త అడ్మిట్ కార్డులను జారీ చేస్తుంది. పరీక్ష తేదీలు, అడ్మిట్ కార్డుల షెడ్యూల్‌ను అధికారిక వెబ్‌సైట్ ద్వారా వెల్లడిస్తారు. సోషల్ మీడియాలో వచ్చే అనధికార వార్తలను నమ్మొద్దని ఎన్టీఏ హెచ్చరించింది. 

వైద్య విద్య అనేద దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైంది. ఒక సీటు కోసం లక్షలాది మంది పోటీ పడుతున్నారు. 22 లక్షల మంది హాజరైన పరీక్షలో ఇలాంటి అక్రమాలు జరగడం విద్యార్థుల మానిక స్థైర్యాన్ని దెబ్బతీస్తుంది. అయితే విద్యార్థులు నిరాశ చెందకుండా, రీ ఎగ్జామ్ కోసం తన ప్రిపరేషన్ కొనసాగించడం మంచిది. పరీక్షకు సంబంధించిన తాజా అప్‌డేట్ కోసం విద్యార్థులు ఎన్టీఏ హెల్‌పైన్ నెంబర్‌లు 011-40759000/011-68227700కు కాల్ చేయవచ్చు లేదా neetug2026@nta.ac.inకు మెయిల్ చేయవచ్చు. అధికారి సమాచారం కోసం neet.nta.nic.in వెబ్‌సైట్‌ను గమనిస్తూ ఉండాలి. 

మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Frequently Asked Questions

నీట్ యూజీ పరీక్షను ఎందుకు రద్దు చేశారు?

మే 3న జరిగిన నీట్ పరీక్షలో ప్రశ్నపత్రం లీక్ అయిందని, 120 ప్రశ్నలు ముందుగానే బయటకు వచ్చాయని ఆరోపణలు రావడంతో పరీక్షను రద్దు చేశారు.

పేపర్ లీక్ కేసులో ఎంత మందిని అరెస్టు చేశారు?

పేపర్ లీక్ కేసులో కీలక సూత్రధారులుగా భావిస్తున్న మనీష్ యాదవ్, రాకేష్ మాండవ్రియాలను రాజస్థాన్ పోలీసులు అరెస్టు చేశారు. దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది.

నీట్ యూజీ రీ-ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది?

అధికారిక సమాచారం ప్రకారం, నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ జూన్ నెలలో జరిగే అవకాశం ఉంది. విద్యార్థులు జూన్ మాసంలో పరీక్షకు సిద్ధంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

రీ-ఎగ్జామ్ కోసం విద్యార్థులు మళ్ళీ దరఖాస్తు చేయాలా?

లేదు, విద్యార్థులు రీ-ఎగ్జామ్ కోసం కొత్తగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. పాత దరఖాస్తు వివరాలు, అభ్యర్థిత్వం, పరీక్షా కేంద్రాల సమాచారమే వర్తిస్తుంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

MBBS Fees in India: MBBS చదువుకు ఎంత ఖర్చు అవుతుంది? ఎన్ని సంవత్సరాలు చదవాలి? 
MBBS చదువుకు ఎంత ఖర్చు అవుతుంది? ఎన్ని సంవత్సరాలు చదవాలి? 
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు- ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు
Telangana Police Jobs 2026: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
CPR Full Form in Telugu: సీపీఆర్‌ ఫుల్‌ఫామ్‌ ఏంటీ? ఎలా చేయాలి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
సీపీఆర్‌ ఫుల్‌ఫామ్‌ ఏంటీ? ఎలా చేయాలి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
Advertisement

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Khanapur MLA Wedma Bojju: ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
AP High Court Rejects CBI Probe on Mega DSC: మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
Harish Rao Black Magic Row: క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
Crop Insurance Scheme: రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
Udhayanidhi Stalin Bail: త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
Utnoor Gond Fort: ఎకో టూరిజం కేంద్రంగా గోండు రాజుల చారిత్రాత్మక కోట అభివృద్ధి
ఎకో టూరిజం కేంద్రంగా గోండు రాజుల చారిత్రాత్మక కోట అభివృద్ధి
ప్రీపెయిడ్ కస్టమర్లకు సైతం స్పాటిఫై ప్రీమియం సహా 3 సేవలు అందిస్తున్న Vi
ప్రీపెయిడ్ కస్టమర్లకు సైతం స్పాటిఫై ప్రీమియం సహా 3 సేవలు అందిస్తున్న Vi
Loan Trap: చదువుకు 4 లక్షలు, పెళ్లికి 10 లక్షలు.. అప్పుల ఊబితో తప్పని చిక్కులు- పరిష్కార మార్గాలివే
చదువుకు 4 లక్షలు, పెళ్లికి 10 లక్షలు.. Loan Trapతో తప్పని చిక్కులు- పరిష్కార మార్గాలివే
Embed widget