అన్వేషించండి

NEET Paper Leak: NEET UG 2026 పరీక్ష రద్దు చేసిన NTA .. పేపర్ లీకేజీ కేసుపై CBI దర్యాప్తు..

NEET UG 2026 Paper Leak: రాజస్థాన్‌లో వివాదం మొదలుకాగా, NEET UG 2026 పరీక్షను NTA రద్దు చేసింది. ఈ పరీక్షలోని 125 ప్రశ్నలు ఒక 'గెస్ పేపర్' ప్రశ్నలతో మ్యాచ్ కావడం దుమారం రేపింది.

న్యూఢిల్లీ: నీట్ యూజీ 2026 ఎగ్జామ్ రద్దు అయింది. ఈ విషయాన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మంగళవారం వెల్లడించింది. పేపర్ లీకేజీ ఆరోపణలతో విద్యార్థుల భవిష్యత్ దృష్టిలో ఉంచుకుని NTA  ఈ నీట్ యూజీ ఎగ్జామ్ రద్దు చేసినట్లు ప్రకటించింది. పేపర్ లీకేజీపై కొన్ని రోజులనుంచి దుమారం రేగగా, ఎన్టీఏ ఈ నిర్ణయం తీసుకుంది.

రాజస్తాన్‌లో మొదలైన వివాదం..
రాజస్థాన్‌లో నీట్ (NEET UG 2026) వివాదం చివరికి కొలిక్కి వచ్చింది. దాదాపు 125 ప్రశ్నలు లీకయ్యాయని.. ఆ క్వశ్చన్స్ ఓ శాంపిల్ పేపర్‌తో యథాతథంగా మ్యాచ్ కావడంతో వివాదం మొదలైంది.  అప్పటి నుండి ఎగ్జామ్ రద్దు అవుతుందని వినిపించింది. విద్యార్థుల భవిష్యత్ దృష్టిలో ఉంచుకుని ఎన్టీఏ మే 3న జరిగిన ఈ పరీక్షను రద్దు చేయడంతో పాటు మళ్లీ నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. నీట్ యూజీ ఎగ్జామ్ కొత్త తేదీని త్వరలోనే ప్రకటిస్తారు. విద్యార్థులు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎలాంటి అదనపు ఫీజు చెల్లించాల్సిన పనిలేదు. ఈ వ్యవహారంపై సిబిఐ (CBI) దర్యాప్తు చేయనుంది. విద్యార్థులు సోషల్ మీడియాలో వచ్చే వదంతులు నమ్మరాదని కేవలం అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని సూచించారు. 

పరీక్షకు సంబంధించిన ముఖ్యమైన విషయాలు:

నీట్ యూజీ (NEET UG) 2026 పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రద్దు చేసింది.

మే 3న జరిగిన పరీక్షను మళ్లీ నిర్వహిస్తారు.

ఎగ్జామ్ కొత్త తేదీని త్వరలోనే విడుదల చేస్తారు.

అడ్మిట్ కార్డులను మళ్లీ జారీ చేస్తారు.

విద్యార్థులు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు.

ఎలాంటి అదనపు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

ముందుగా జమ చేసిన ఫీజును తిరిగి చెల్లిస్తారు.

పరీక్షా కేంద్రం ఎంపిక మునుపటిలాగే ఉంటుంది.

ఈ కేసు దర్యాప్తును సిబిఐ (CBI)కి అప్పగించారు.

విద్యార్థులు కేవలం అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని అధికారులు సూచించారు.

రాజస్థాన్ సహా కొన్ని రాష్ట్రాల్లో సాధారణ శాంపిల్ పేపర్‌లో ఉన్న సుమారు 125 ప్రశ్నలు నీట్ పేపర్‌తో అచ్చుగుద్దినట్లు సరిపోలాయని వివాదం మొదలైంది. ఆ తర్వాత పరీక్ష నిర్వహణ, పేపర్ లీకేజీపై వరుసగా ప్రశ్నలు తలెత్తాయని ఎన్టీఏ తెలిపింది. ఏబీపీ న్యూస్ కథనం తర్వాత విచారణ, ధృవీకరణ జరిగింది. ప్రస్తుతం ఉన్న పరీక్షా ప్రక్రియను కొనసాగించలేమని గుర్తించడంతో, ఎన్టీఏ (NTA) నీట్ యూజీ ఎగ్జామ్ రద్దు చేయాలని నిర్ణయించింది.

పారదర్శకతకు కట్టుబడి ఉన్నామని తెలిపిన NTA
NTA తన 10 మే 2026 నాటి ప్రెస్ రిలీజ్ తర్వాత ఒక కొత్త ప్రకటన విడుదల చేసింది. అందులో 8 మేన NEET UG 2026కు సంబంధించిన కొన్ని అంశాలను విచారణ కోసం కేంద్ర సంస్థలకు పంపినట్లు పేర్కొంది. NEET UG పరీక్షకు సంబంధించి కొన్ని ఫిర్యాదులు, అవకతవకలు లేదా అనుమానాస్పద కార్యకలాపాలపై విచారణ జరగాలని భావించాం. ఎగ్జామ్ నిబద్ధత, విద్యార్థుల భవిష్యత్ కోసం ఈ అంశాలపై స్వతంత్ర విచారణ జరిపిస్తామని NTA తెలిపింది. అందుకే, వాస్తవాలను ధృవీకరించడానికి, బాధ్యులపై చర్యలు తీసుకోవడానికి ఈ వ్యవహారాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థలకు అప్పగించింది. జాతీయ స్థాయి పరీక్షలను“fair, secure and credible” గా నమ్మదగిన రీతిలో నిర్వహించడానికి తాము కట్టుబడి ఉన్నామని NTA ఓ ప్రకటనలో పేర్కొంది. దాంతోపాటు ఎగ్జామ్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. సీబీఐ ఈ కీలకమైన కేసును దర్యాప్తు చేసి నిజాలను వెలికితీయనుంది.

Frequently Asked Questions

నీట్ యూజీ 2026 పరీక్ష ఎందుకు రద్దు చేయబడింది?

పేపర్ లీకేజీ ఆరోపణల నేపథ్యంలో, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని NTA నీట్ యూజీ 2026 పరీక్షను రద్దు చేసింది.

రద్దు చేయబడిన నీట్ యూజీ 2026 పరీక్ష మళ్లీ ఎప్పుడు జరుగుతుంది?

కొత్త పరీక్ష తేదీని త్వరలోనే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ప్రకటిస్తుంది.

విద్యార్థులు నీట్ యూజీ 2026 పరీక్ష కోసం మళ్లీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలా?

విద్యార్థులు మళ్లీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు మరియు ఎలాంటి అదనపు ఫీజు చెల్లించాల్సిన పనిలేదు.

నీట్ యూజీ 2026 పరీక్ష రద్దు వ్యవహారంపై ఎవరు దర్యాప్తు చేస్తారు?

ఈ కేసు దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI)కి అప్పగించారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Top MBBS Colleges: ఎంబిబిఎస్ చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో టాప్ మెడికల్‌ కాలేజీలు ఏవి? ఫీజులు ఎలా ఉంటాయి?
ఎంబిబిఎస్ చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో టాప్ మెడికల్‌ కాలేజీలు ఏవి? ఫీజులు ఎలా ఉంటాయి?
NEET SUPREME COURT:నీట్-యూజీ విధానంలో భారీ మార్పులు!మెయిన్, అడ్వాన్స్‌డ్ మోడల్‌లో చేయనున్నట్టు సుప్రీంకోర్టు చెప్పిన కేంద్రం!
నీట్-యూజీ విధానంలో భారీ మార్పులు!మెయిన్, అడ్వాన్స్‌డ్ మోడల్‌లో చేయనున్నట్టు సుప్రీంకోర్టు చెప్పిన కేంద్రం!
NEET UG 2026 Counselling: ఎంబీబీఎస్‌ ఆల్‌ ఇండియా కోటా కౌన్సెలింగ్‌ నేటి నుంచి ప్రారంభం! కొత్త రూల్స్‌ ఇవే!
ఎంబీబీఎస్‌ ఆల్‌ ఇండియా కోటా కౌన్సెలింగ్‌ నేటి నుంచి ప్రారంభం! కొత్త రూల్స్‌ ఇవే!
Career Options After MBBS in Telugu: ఎంబిబిఎస్ తర్వాత  ఏ కోర్స్‌ చేయాలి? ఎంత ఖర్చు అవుతుంది?
ఎంబిబిఎస్ తర్వాత  ఏ కోర్స్‌ చేయాలి? ఎంత ఖర్చు అవుతుంది?
Advertisement

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Bhagwat on Gen-Z: జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
CJP Kya Bolti Public campaign: నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
JB Srinivas House Attacked: తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
Korean Kanakaraju Twitter Review : కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
2026 Women Asia Cup: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
Dhoni Ride KTM in Chennai: ధోనీ నడిపే కేటీఎం 390 డ్యూక్ ఫీచర్లు, ధర వింటే ఆశ్చర్యపోతారు!
ధోనీ నడిపే కేటీఎం 390 డ్యూక్ ఫీచర్లు, ధర వింటే ఆశ్చర్యపోతారు!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
Embed widget