అన్వేషించండి

JEE Advanced 2026 Admit card: జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 అడ్మిట్ కార్డ్స్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోవాలి, పూర్తి ప్రక్రియ

JEE అడ్వాన్స్‌డ్ 2026 పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ముందుగానే తమ అడ్మిట్ కార్డ్, సిటీ స్లిప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఎగ్జామ్ సెంటర్‌కు ఫొటో గుర్తింపు కార్డు సైతం తప్పనిసరిగా తీసుకెళ్లండి.

JEE Advanced Admit card: దేశ వ్యాప్తంగా ఇంజనీరింగ్ కాలేజీలలో ఎంట్రన్స్ కోసం అతిపెద్ద, ప్రతిష్టాత్మకమైన విధానం JEE అడ్వాన్స్‌డ్. ఈ పరీక్ష JEE మెయిన్‌లో ఉత్తీర్ణులైన విద్యార్థుల కోసం, ఇప్పుడు IITలలో సీటు కోసం పోటీ పడాలనుకుంటున్నారు. IIT రూర్కీ ఈ సంవత్సరం JEE అడ్వాన్స్‌డ్ 2026ని నిర్వహిస్తుంది. ఈ పరీక్ష రాయమానికి విద్యార్థులు మొదట అడ్మిట్ కార్డ్‌లు, ఎగ్జామ్ సిటీ స్లిప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఈ డాక్యుమెంట్ విద్యార్థులకు చాలా అవసరం. అడ్మిట్ కార్డులు లేకుండా ఎగ్జామ్ సెంటర్‌లో అనుమతించరు. కనుక JEE అడ్వాన్స్‌డ్ 2026 అడ్మిట్ కార్డ్, సిటీ స్లిప్ ఎప్పుడు,  ఎలా లభిస్తాయో పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. 

JEE అడ్వాన్స్‌డ్ 2026 అడ్మిట్ కార్డ్స్ ఎప్పుడు వస్తాయి 

జేఈఈ అడ్మిట్ కార్డ్‌లు, సిటీ స్లిప్‌లు విద్యార్థులకు వారి ఎగ్జామ్ సెంటర్ గురించి సమాచారాన్ని అందిస్తాయి. విద్యార్థులు అప్లికేషన్ ఫాం నింపేటప్పుడు తమకు నచ్చిన సిటీని ఎంచుకున్నారు. ఇప్పుడు IIT రూర్కీ అందరు అభ్యర్థులకు ఎగ్జామ్ సిటీ డిటైల్స్ తెలియజేస్తుంది. ఈ అడ్మిట్ కార్డులు మే 11, 2026న విడుదల కానున్నాయి. పరీక్ష కోసం సిటీ స్లిప్‌ను డౌన్‌లోడ్ చేయడానికి లాస్ట్ డేట్ మే 17, 2026గా నిర్ణయించారు. 

JEE అడ్వాన్స్‌డ్ ముఖ్యమైన తేదీలు 

JEE అడ్వాన్స్‌డ్ 2026 ముఖ్యమైన తేదీలు ఇదివరకే నిర్ణయించారు. వీటిని అభ్యర్థులు గుర్తుంచుకోవాలి. ఇందులో అడ్మిట్ కార్డ్‌లు మే 11 నుండి అందుబాటులో ఉంటాయి. ఒకవేళ ఎవరికైనా స్క్రిబ్ అవసరమైతే, వారు మే 16 వరకు సెలక్ట్ చేసుకోవాలి. ఎగ్జామ్ మే 17న నిర్వహించనున్నారు. అభ్యర్థుల అన్సర్ షీట్లు మే 21న ప్రదర్శించనున్నారు. దీని ఆధారంగా తాత్కాలిక సమాధానాల కీ మే 25న విడుదల చేస్తారు. ఫైనల్ ఆన్సర్ కీ జూన్ 1న అందుబాటులో ఉంచుతారు.  

JEE అడ్వాన్స్‌డ్ 2026 అడ్మిట్ కార్డ్‌లో ఏముంటుంది.. 

జేఈఈ అడ్వాన్స్‌డ్ అభ్యర్థులు అడ్మిట్ కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసిన వెంటనే, ఇందులో అభ్యర్థి పేరు, రోల్ నంబర్, అప్లికేషన్ నంబర్, ఫోటో, సిగ్నేచర్, పుట్టిన తేదీ, కేటగిరీ, పరీక్షా కేంద్రం అడ్రస్, రిపోర్టింగ్ టైమ్ వంటి అన్ని వివరాలు ఉంటాయి. ఎగ్జామ్ సెంటర్‌లోకి ప్రవేశించడానికి, అభ్యర్థి ప్రింటెడ్ అడ్మిట్ కార్డ్, వ్యాలిడ్ అయ్యే ఫోటో గుర్తింపు కార్డును తీసుకెళ్లాలి. 

అడ్మిట్ కార్డ్‌లు, సిటీ స్లిప్‌లను ఇలా డౌన్‌లోడ్ చేయాలి
 
1. మొదట జేఈఈ అధికారిక వెబ్‌సైట్ jeeadv.ac.in ని సందర్శించండి.
 
2. రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్‌ ద్వారా లాగిన్ అవ్వండి. 
 
3. తరువాత డౌన్2లోడ్ అడ్మిట్ కార్డ్ / సిటీ స్లిప్ (Download Admit Card/City Slip) లింక్‌పై క్లిక్ చేయండి.
 
4. మీ అడ్మిట్ కార్డ్, సిటీ స్లిప్‌ను PDF రూపంలో డౌన్‌లోడ్ చేయండి.
 
5. దాన్ని ప్రింట్ తీసి మీ వద్ద ఉంచుకోవాలి.  
 
పరీక్షకు ప్రిపరేషన్, ట్రావెల్ ప్లాన్ 

అడ్మిట్ కార్డ్‌లు, సిటీ స్లిప్‌లు తీసుకున్న తర్వాత అభ్యర్థులు వారి ఎగ్జామ్ సెంటర్‌కు జర్నీ టైమ్, వసతి కోసం ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. దాంతో ఎగ్జామ్ రోజున ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎగ్జామ్ సెంటర్‌కు సకాలంలో చేరుకోవడానికి ప్రయాణానికి ముందుగానే ఏర్పాటు చేసుకోవాలి. జేఈఈ అడ్మిట్ కార్డ్, ఐడెంటిటీ కార్డ్ను మీతో ఉంచుకోండి. ఎగ్జామ్ సెంటర్, పరీక్షకు సంబంధించి రూల్స్ హాల్ టికెట్ మీద ఉన్నవి చదివి జాగ్రత్తగా పాటించాలి.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

MBBS Fees in India: MBBS చదువుకు ఎంత ఖర్చు అవుతుంది? ఎన్ని సంవత్సరాలు చదవాలి? 
MBBS చదువుకు ఎంత ఖర్చు అవుతుంది? ఎన్ని సంవత్సరాలు చదవాలి? 
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు- ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు
Telangana Police Jobs 2026: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
CPR Full Form in Telugu: సీపీఆర్‌ ఫుల్‌ఫామ్‌ ఏంటీ? ఎలా చేయాలి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
సీపీఆర్‌ ఫుల్‌ఫామ్‌ ఏంటీ? ఎలా చేయాలి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
Advertisement

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao Black Magic Row: క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
Udhayanidhi Stalin Bail: త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
Air India Phuket Delhi Flight: ఆకాశంలోనే షేక్ అయిన ఎయిర్ ఇండియా ఫుకెట్-ఢిల్లీ విమానం, ప్రయాణికులకు గాయాలు!
ఆకాశంలోనే షేక్ అయిన ఎయిర్ ఇండియా ఫుకెట్-ఢిల్లీ విమానం, ప్రయాణికులకు గాయాలు!
Udhayanidhi Stalin Reaction: అరెస్టు చేసిన తర్వాత ఉదయనిధి స్టాలిన్ తొలి రియాక్షన్ ఏంటి?
అరెస్టు చేసిన తర్వాత ఉదయనిధి స్టాలిన్ తొలి రియాక్షన్ ఏంటి?
శ్రీశైలంలో ఆ మూడు రోజులు స్పర్శ దర్శనం ఉండదు!
శ్రీశైలంలో ఆ మూడు రోజులు స్పర్శ దర్శనం ఉండదు!
Crime News: 30 సెకన్లలో 34 కత్తిపోట్లు! స్కూల్‌లోనే టీచర్‌ను పొడిచిన ముసుగు వ్యక్తి!
30 సెకన్లలో 34 కత్తిపోట్లు! స్కూల్‌లోనే టీచర్‌ను పొడిచిన ముసుగు వ్యక్తి!
Udhayanidhi Arrest: ఉదయనిధి అరెస్టుకు కారణం ఏంటీ? టీవీకే చేసిన ఫిర్యాదులో ఏముంది?
ఉదయనిధి అరెస్టుకు కారణం ఏంటీ? టీవీకే చేసిన ఫిర్యాదులో ఏముంది?
Udhayanidhi Arrest: ఉదయనిధి వివాదంపై మద్రాసు హైకోర్టుకు డీఎంకే! కీలక ఆదేశాలు వచ్చేలోపే అరెస్టు!
ఉదయనిధి వివాదంపై మద్రాసు హైకోర్టుకు డీఎంకే! కీలక ఆదేశాలు వచ్చేలోపే అరెస్టు!
Embed widget