అన్వేషించండి

JEE Main Paper 2 Results 2026: జేఈఈ మెయిన్స్ 2026 పేపర్‌ -2 ఫలితాలు విడుదల! స్కోర్ కార్డు డౌన్‌లోడ్‌ వివరాలు ఇక్కడ చూడండి!

JEE Main Paper 2 Results 2026: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జేఈఈ మెయిన్ 2026 పేపర్‌ -2 ఫలితాలను అధికారికంగా విడుదల చేసింది. పూర్తి ఫలితాలను jeemain.nta.nic.in వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • జేఈఈ మెయిన్ 2026 పేపర్ 2 ఫలితాలు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది.
  • ఆర్కిటెక్చర్, ప్లానింగ్ కోర్సుల ప్రవేశానికి ఈ పరీక్ష ఫలితాలు కీలకం.
  • విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ నుండి స్కోర్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
  • ఫలితాలతో పాటు మెరిట్ జాబితా, టాపర్ల వివరాలు కూడా వెల్లడయ్యాయి.

JEE Main Paper 2 Results 2026: దేశవ్యాప్తంగా ఆర్టిటెక్చర్‌ , ప్లానింగ్‌ కోర్సుల్లో చేరాలని ఆకాంక్షిస్తున్న వేలాది మంది విద్యార్థుల నిరీక్షణకు తెరపడింది. నేషనల్‌ టెస్టింగ్ ఏజెన్సీ, జేఈఈ మెయిన్ 2026 పేపర్ -2 ఫలితాలను అధికారికంగా వెల్లడించింది. దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ప్రవేశానికి ఈ పరీక్ష అత్యంత కీలకం. 

జేఈఈ మెయిన్ 2026 పేపర్‌ -2 ఫలితాలను మే 5 రాత్రి సమయంలో విడుదల చేశారు. అభ్యర్థులు తమ ఫలితాలను, స్కోరు కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి చెందిన అధికారిక పోర్టల్‌ jeemain.nta.nic.inలో చూడవచ్చు. ఎన్‌టీఏ ఈ ప్రక్రియను పూర్తిగా డిజిటల్‌ పద్ధతిలో నిర్వహించింది. తద్వారా విద్యార్థులు ఎక్కడి నుంచైనా తమ ఫలితాలను సులభంగా యాక్సెస్‌ చేయవచ్చు. 

ఫలితాలను డౌన్‌లౌడ్ చేసుకోవడం ఎలా

స్కోర్ కార్డు డౌన్‌లోడ్‌ ప్రక్రియను అభ్యర్థుల కోసం ఎన్‌టీఏ చాలా ఈజీ చేసింది. విద్యార్థులు ఈజీ స్టెప్స్‌ ఫాలో అయితే తమ మార్కులను తెలుసుకోవ్చచు. ముందుగా అధికారిక వెబ్‌సైట్‌ jemain.nta.nic.inను విజిట్ చేయాలి. హోమ్‌పేజీలో ఉన్న JEE Main BArh/BPlanning Scorecard PDF అనే లింక్‌పై క్లిక్ చేయాలి. లాగిన్ విండోలో అభ్యర్థి తన రిజిస్ట్రేషన్ నంబర్‌ లేదా రోల్ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయాలి. వివరాలు సమర్పించిన తర్వాత స్కోర్ కార్డు స్క్రీన్‌పై కనిపిస్తుంది. అభ్యర్థులు ఈ పీడీఎఫ్‌ ఫైల్‌ను డౌన్లోడ్ చేసుకొని, భవిష్యత్‌ అవసరాల కోసం ప్రింట్ తీసుకోవాలి. 

స్కోర్ కార్డులో ఉండే వివరాలు 

డౌన్‌లోడ్ చేసిన స్కోర్‌ కార్డులో అభ్యర్థి పేరు, రోల్ నంబర్‌, సబ్జెక్ట్‌ల వారీగా వచ్చిన ఎన్‌టీఏ స్కోరు, మొత్తం స్కోరు, క్వాలిఫైయింగ్ స్టేటస్ వంటి ముఖ్యమైన సమాచారం ఉంటుంది. అభ్యర్థులు తమ వివరాలన్నీ సరిగా ఉన్నాయో లేదో ఒకసారి సరి చూసుకోవాలి. 

మెరిట్ జాబితా, టాపర్ల వివరాలు 

ఫలితాలతోపాటు, ఈ ఏడాది అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన విద్యార్థుల మెరిట్‌ జాబితాను కూడా ఎన్‌టీఏ విడుదల చేసింది. టాపర్ల జాబితాను కూడా అధికారిక వెబ్‌సైట్‌ నుంచి పీడీఎప్‌ రూపంలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ జాబితాలో జాతీయ స్థాయిలో, రాష్ట్రాల వారీగా అగ్రస్థానంలో నిలిచిన విద్యార్థుల వివరాలు ఉంటాయి. 

జేఈఈ మెయిన్ పేపర్ 2 ప్రాముఖ్యత ఏంటీ?

జేఈఈ మెయిన్ పరీక్ష రెండు పేపర్లుగా జరుగుతుంది. పేపర్‌ 1 ఇంజినీరింగ్ ప్రవేశాల కోసం కాగా, పేపర్ -2 అనేది బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్‌, బ్యాచిలర్ ఆఫ్ ప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తారు. దేశంలోని ఎన్‌ఐటీలు, ఐఐఐటీలు, ఇతర కేంద్ర నిధులతో నడిచే సాంకేతిక విద్యా సంస్థల్లో ప్రవేశానికి ఈ ఫలితాలు ప్రామాణికంగా ఉంటాయి.  

Frequently Asked Questions

జేఈఈ మెయిన్ 2026 పేపర్-2 ఫలితాలు ఎప్పుడు విడుదలయ్యాయి?

జేఈఈ మెయిన్ 2026 పేపర్-2 ఫలితాలను మే 5 రాత్రి సమయంలో అధికారికంగా విడుదల చేశారు.

జేఈఈ మెయిన్ 2026 పేపర్-2 ఫలితాలను ఎక్కడ చూడవచ్చు?

అభ్యర్థులు తమ ఫలితాలను, స్కోరు కార్డులను జేఈఈ మెయిన్ అధికారిక పోర్టల్ jeemain.nta.nic.in లో చూడవచ్చు.

స్కోర్ కార్డు డౌన్లోడ్ చేసుకోవడానికి ఏ వివరాలు అవసరం?

స్కోర్ కార్డు డౌన్లోడ్ చేసుకోవడానికి అభ్యర్థి తన రిజిస్ట్రేషన్ నంబర్ లేదా రోల్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు అవసరం.

జేఈఈ మెయిన్ పేపర్-2 ఏ కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహిస్తారు?

జేఈఈ మెయిన్ పేపర్-2 అనేది బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ మరియు బ్యాచిలర్ ఆఫ్ ప్లానింగ్ కోర్సులలో ప్రవేశాల కోసం నిర్వహిస్తారు.

స్కోర్ కార్డులో ఏయే వివరాలు ఉంటాయి?

స్కోర్ కార్డులో అభ్యర్థి పేరు, రోల్ నంబర్, సబ్జెక్టుల వారీగా స్కోరు, మొత్తం స్కోరు, మరియు అర్హత స్థితి వంటి ముఖ్యమైన సమాచారం ఉంటుంది.

టాప్ హెడ్ లైన్స్

Jantar Mantar: నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
CM Revanth Reddy: ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
AP ZPTC Election Reservations: ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
Vijayasai Reddy Party: కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jantar Mantar: నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
CM Revanth Reddy: ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
AP ZPTC Election Reservations: ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
Vijayasai Reddy Party: కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
Hyderabad Crime News: బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
Drishyam 3 OTT : అజయ్ దేవగణ్ 'దృశ్యం 3' న్యూ రికార్డ్ - 450 కోట్ల సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్ ఎప్పుడు, ఏ ఓటీటీలోకి వస్తుందంటే?
అజయ్ దేవగణ్ 'దృశ్యం 3' న్యూ రికార్డ్ - 450 కోట్ల సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్ ఎప్పుడు, ఏ ఓటీటీలోకి వస్తుందంటే?
October Smartphones Launch: అక్టోబర్ 12 - 18 మధ్య ఫ్లాగ్‌షిప్ ఫోన్ల లాంచ్‌.. వన్‌ప్లస్ 16, రెడ్‌మ్యాజిక్ 12 ప్రో+ ఇంకా మరెన్నో!
అక్టోబర్ 12 - 18 మధ్య ఫ్లాగ్‌షిప్ ఫోన్ల లాంచ్‌.. వన్‌ప్లస్ 16, రెడ్‌మ్యాజిక్ 12 ప్రో+ ఇంకా మరెన్నో!
మీ కారు RCని వేరే రాష్ట్రానికి ట్రాన్స్‌ఫర్ చేయాలా? ఆన్‌లైన్‌లోనే పని పూర్తి.. కావాల్సిన పత్రాలు, ఫీజుల వివరాలివే!
వెహికల్‌ RCని ట్రాన్స్‌ఫర్‌ చేయడం ఎలా? పూర్తి ప్రాసెస్‌, ఫీజుల వివరాలు
Embed widget