అన్వేషించండి

NEET Paper Leak: రూ.140 కోసం నీట్ పేపర్ లీక్ అయిందా? - వెలుగులోకి సంచలన విషయాలు

Paper Leak Scam: రూ.140 తేడా వల్లనే లక్షల మంది భవిష్యత్తు బలి అయింది. నీట్ పేపర్ లీక్ వెనుక L1 మాయాజాలం వెలుగులోకి వచ్చింది.

NEET Paper Leak Scam: నీట్ పరీక్షా పత్రం లీకేజీ వ్యవహారంలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘోర వైఫల్యానికి కారణం కేవలం కొందరు వ్యక్తుల స్వార్థం మాత్రమే కాదు, ప్రభుత్వ టెండర్ల ప్రక్రియలో ఉన్న  L1  నిబంధన అని బయటకు వస్తున్న వివరాలను బట్టి స్పష్టమవుతోంది.   దేశవ్యాప్తంగా పరీక్షల నిర్వహణలో అపారమైన అనుభవం, అత్యాధునిక సాంకేతిక భద్రత కలిగిన TCS వంటి సంస్థను కేవలం  140 వ్యత్యాసం కారణంగా పక్కన పెట్టడం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. ఒక్కో అభ్యర్థికి TCS కోట్ చేసిన  రూ. 311కు బదులుగా, కేవలం  రూ.171కే నిర్వహిస్తామన్న EduQuest సంస్థకు కాంట్రాక్ట్ అప్పగించడమే కొంపముంచిందని తాజాగా గుర్తించారు. 

అవినీతిని అరికట్టడానికి, పారదర్శకతను పెంచడానికి ప్రభుత్వం తీసుకొచ్చిన  L1 అతి తక్కువ ధర కోట్ చేసిన వారికి కాంట్రాక్ట్ ఇవ్వడం విధానం ఇక్కడ శాపంగా మారింది. సిమెంట్, ఇనుము వంటి వస్తువుల కొనుగోలుకు ఈ సూత్రం పనికొస్తుందేమో కానీ, లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న అత్యంత రహస్యమైన పరీక్షా నిర్వహణకు ఇది ఏమాత్రం సరిపోదని ఎప్పటి నుంచో నిపుణులు హెచ్చరిస్తున్నారు.  తక్కువ ధర కోట్ చేసిన సంస్థలు లాభాల కోసం భద్రతా ప్రమాణాల్లో రాజీ పడటం, సిబ్బంది నాణ్యతను తగ్గించుకోవడం వంటి చర్యలకు పాల్పడతాయి. అదే ఇక్కడ EduQuest విషయంలో జరిగిందని, సైబర్ సెక్యూరిటీ వైఫల్యాలే పేపర్ లీక్‌కు దారితీశాయని స్పష్టమవుతోంది.

వ్యవస్థ తన నిబంధనల ప్రకారమే నడిచింది, కానీ ఆ నిబంధనే ఒక అసమర్థ సంస్థ లోపలికి రావడానికి తలుపులు తెరిచింది. TCS వంటి సంస్థలు పదేళ్ల అనుభవంతో తమ భద్రతా వలయాన్ని పటిష్టం చేసుకున్నాయి. అయితే, ప్రభుత్వం కేవలం అంకెల గణితాన్ని మాత్రమే చూసి, సాంకేతిక సామర్థ్యాన్ని  విస్మరించింది. నిబంధనల ప్రకారం పారదర్శకంగానే టెండర్లు కేటాయించినప్పటికీ, ఆ పారదర్శకత వెనుక దాగి ఉన్న ప్రమాదాన్ని గుర్తించలేకపోవడం వ్యవస్థా పరమైన అజ్ఞానమా లేక నిర్లక్ష్యమా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

కేవలం రూ.  140 పొదుపు చేయడానికి చూసిన ప్రభుత్వం, ఇప్పుడు దేశవ్యాప్తంగా పరీక్షల విశ్వసనీయతను కోల్పోవడమే కాకుండా, రీ-ఎగ్జామ్స్ నిర్వహణ కోసం వందల కోట్లు ఖర్చు చేయాల్సిన పరిస్థితి తెచ్చుకుంది. అంతకంటే ముఖ్యంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అనుభవిస్తున్న మానసిక క్షోభ వెలకట్టలేనిది. వ్యవస్థలో ఉన్న లొసుగులను వాడుకుని భద్రతతో రాజీపడే సంస్థలకు జాతీయ స్థాయి పరీక్షల బాధ్యత అప్పగించడం అంటే, విషపు గింజలను మనమే నాటుకోవడమే అనే విమర్శలు వస్తున్నాయి.   

ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి  L1 విధానానికి స్వస్తి పలికి క్వాలిటీ అండ్ కాస్ట్ బేస్డ్ సెలక్షన్ వంటి నాణ్యతకు పెద్దపీట వేసే పద్ధతులను అవలంబించాల్సిన అవసరం ఉందని నిపుణులు సలహాలిస్తున్నారు.  కేవలం ధరకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ పోతే, భవిష్యత్తులో మరిన్ని పరీక్షలు లీకేజీల బారిన పడే ప్రమాదం ఉంది. పరీక్షా నిర్వహణ అనేది కేవలం ఒక వ్యాపారం కాదు, అది దేశ భవిష్యత్తుకు సంబంధించిన నైతిక బాధ్యత అని గుర్తించినప్పుడే ఇలాంటి వ్యవస్థాగత లోపాలు   సరిదిద్దుకోవచ్చని అంటున్నారు.  

Advertisement

టాప్ హెడ్ లైన్స్

CPR Full Form in Telugu: సీపీఆర్‌ ఫుల్‌ఫామ్‌ ఏంటీ? ఎలా చేయాలి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
సీపీఆర్‌ ఫుల్‌ఫామ్‌ ఏంటీ? ఎలా చేయాలి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
Task Force for Exam Reforms: పరీక్షా విధానంలో సంస్కరణలు.. నందన్ నీలేకని నేతృత్వంలో హైపవర్డ్ టాస్క్‌ఫోర్స్: ప్రధాని మోదీ
పరీక్షా విధానంలో సంస్కరణలు.. నందన్ నీలేకని నేతృత్వంలో హైపవర్డ్ టాస్క్‌ఫోర్స్: ప్రధాని మోదీ
Paper Leak New Bill: పేపర్ లీక్‌ బిల్లు.. బాధ్యులకు 10 సంవత్సరాల జైలు శిక్ష, 1 కోటి రూపాయల జరిమానా !
పేపర్ లీక్‌ బిల్లు.. బాధ్యులకు 10 సంవత్సరాల జైలు శిక్ష, 1 కోటి రూపాయల జరిమానా !
Supreme Court: వీడియోలు చూసే తీరిక లేదు, మా టైమ్ వేస్ట్ చేయవద్దన్న సుప్రీంకోర్టు.. సీజేఐ వ్యాఖ్యలపై సీజేపీ ఆగ్రహం
వీడియోలు చూసే తీరిక లేదు, మా టైమ్ వేస్ట్ చేయవద్దన్న సుప్రీంకోర్టు.. సీజేఐ వ్యాఖ్యలపై సీజేపీ ఆగ్రహం
Advertisement

వీడియోలు

Jasprit Bumrah Fitness Cleared For Tests | ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన జస్ప్రీత్ బుమ్రా
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
Will Shami Play World Cup 2027? | గంగూలీ ప్లాన్ రిపీట్ చేయనున్న గిల్ ?
India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Godavari River Overflow: భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ - పూర్తిగా నిలిచిన రాకపోకలు
భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ - పూర్తిగా నిలిచిన రాకపోకలు
The Hundred League Hug: భారత్ పాక్ క్రికెటర్ల వైరల్ హగ్.. ఫాతిమా సనాకి షేక్ హ్యాండ్ ఇచ్చిన భార‌త మ‌హిళా స్టార్ క్రికెట‌ర్!
భారత్ పాక్ క్రికెటర్ల వైరల్ హగ్.. ఫాతిమా సనాకి షేక్ హ్యాండ్ ఇచ్చిన భార‌త మ‌హిళా స్టార్ క్రికెట‌ర్!
Pawan Kalyan onTiger Death: రాచర్ల అడవుల్లో పెద్దపులి మృతిపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం.. సమగ్ర విచారణకు ఆదేశం
Pawan Kalyan onTiger Death: రాచర్ల అడవుల్లో పెద్దపులి మృతిపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం.. సమగ్ర విచారణకు ఆదేశం
Revanth Reddy Criminal Waste Remarks: రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
PM Modi On CJP Protest: నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
Bhogapuram Airport Photos: 2203 ఎకరాలు.. 275 కి.మీ వేగంతో వీచే గాలులను తట్టుకునేలా నిర్మాణం.. భోగాపురం ఎయిర్‌పోర్ట్ విశేషాలివే
2203 ఎకరాలు.. 275 కి.మీ వేగంతో వీచే గాలులను తట్టుకునేలా నిర్మాణం.. భోగాపురం ఎయిర్‌పోర్ట్ విశేషాలు
Vijay Cinema Style Politics: తమిళనాడులో విజయ్ పొలిటికల్ గ్లామర్ - సీఎం స్థాయి పర్యటనలు, సినిమా స్టైల్ రీల్స్.. రాజకీయంగా లాభమా? నష్టమా?
తమిళనాడులో విజయ్ పొలిటికల్ గ్లామర్ - సీఎం స్థాయి పర్యటనలు, సినిమా స్టైల్ రీల్స్.. రాజకీయంగా లాభమా? నష్టమా?
CWG Javelin Glory: నీరజ్ చోప్రాకు సిల్వర్.. డెబ్యూట్ బాయ్ యష్ వీర్ సింగ్ కు బ్రాంజ్, రిజ‌ల్ట్స్ పై నీర‌జ్ స్పంద‌న ఇదే..!
నీరజ్ చోప్రాకు సిల్వర్.. డెబ్యూట్ బాయ్ యష్ వీర్ సింగ్ కు బ్రాంజ్, రిజ‌ల్ట్స్ పై నీర‌జ్ స్పంద‌న ఇదే..!
Embed widget