అన్వేషించండి

Fatty Liver : ఫ్యాటీ లివర్ మందు(ఆల్కహాల్) వల్ల మాత్రమే కాదు.. మైదా, మటన్ వంటి వల్ల కూడా కాలేయానికి నష్టమే

Fatty Liver Causes : చాలామంది కాలేయ ఆరోగ్యం ఆల్కహాల్ వల్లే చెడిపోతుంది అనుకుంటారు. కానీ ఇదే కాకుండా చాలా ఫుడ్స్, లైఫ్ స్టైల్ ఆరోగ్యంతో పాటు కాలేయాన్ని దెబ్బతీస్తాయని చెప్తున్నారు. అవేంటంటే..

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • కాలేయంలో కొవ్వు పెరగడం ఫ్యాటీ లివర్ కు కారణమవుతుంది.
  • చక్కెర పానీయాలు, వేయించిన, నిల్వ ఆహారాలు కాలేయంపై ప్రభావం చూపుతాయి.
  • మైదా, రెడ్ మీట్, అధిక ఉప్పు వాడకం కాలేయ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి.
  • ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామంతో కాలేయాన్ని కాపాడుకోవచ్చు.

Foods That Can Damage Your Liver : ఈరోజుల్లో ఫ్యాటీ లివర్ సమస్య వేగంగా పెరుగుతోంది. కేవలం మద్యం తాగే వారికే కాదు.. జీవనశైలి, తప్పు ఆహారపు అలవాట్లు, వ్యాయామం లేకపోవడం వల్ల కూడా చాలామందిలో ఈ సమస్య కనిపిస్తోంది. లివర్‌లో కొవ్వు అధికంగా పేరుకుపోతే దాన్ని ఫ్యాటీ లివర్ అంటారు. మొదట్లో లక్షణాలు పెద్దగా కనిపించకపోయినా.. నిర్లక్ష్యం చేస్తే లివర్ డ్యామేజ్, ఇన్‌ఫ్లమేషన్, సిరోసిస్ వంటి ప్రమాదకర సమస్యలకు దారి తీస్తుంది. 

కొన్ని రకాల ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల లివర్​తో పాటు పూర్తి ఆరోగ్యం దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిజానికి ఈ మధ్యకాలంలో ఫ్యాటీ లివర్​ కేసుల్లో నాన్ ఆల్కహాల్ బాధితులే ఎక్కువగా ఉన్నారని.. దీనికి కారణం వారు తీసుకుంటున్న ఫుడ్స్, లైఫ్​స్టైల్ అని అంటున్నారు. అందుకే ముఖ్యంగా కాలేయాన్ని దెబ్బతీస్తోన్న ఫుడ్స్​ జోలికి వెళ్లొద్దంటున్నారు. మరి కాలేయ ఆరోగ్యాన్ని ఎక్కువగా నాశనం చేస్తోన్న ఫుడ్స్ ఏంటో.. వాటిని ఎందుకు తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. 

షుగర్ డ్రింక్స్ 

సాఫ్ట్ డ్రింక్స్, ప్యాకెట్ జ్యూసులు, ఎనర్జీ డ్రింక్స్‌లో చక్కెర అధికంగా ఉంటుంది. ఇవి కాలేయంలో కొవ్వు పేరుకుపోయేలా చేస్తాయి. ముఖ్యంగా ఫ్రక్టోజ్ ఎక్కువగా ఉండే డ్రింక్స్ ఫ్యాటీ లివర్ ప్రమాదాన్ని పెంచుతాయి.

వేయించిన ఆహారాలు..

చాలామంది బయటి ఫుడ్ తినడానికి ఎక్కువ ఇష్టపడతారు. పకోడీలు, ఫ్రెంచ్ ఫ్రైస్, చిప్స్, ఫాస్ట్ ఫుడ్స్ వంటి డీప్ ఫ్రైడ్ ఐటమ్స్‌లో ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి లివర్‌పై ఒత్తిడి పెంచి కొవ్వు నిల్వలను పెంచుతాయి.

నిల్వ ఆహారం.. 

ప్యాకెట్ స్నాక్స్, ఇన్‌స్టంట్ నూడుల్స్, ప్రాసెస్డ్ మీట్ వంటి ఆహారాల్లో ఉప్పు, ప్రిజర్వేటివ్స్ అధికంగా ఉంటాయి. ఇవి లివర్ పనితీరును దెబ్బతీస్తాయి.

మద్యం

ఆల్కహాల్ లివర్‌కు అతిపెద్ద శత్రువుల్లో ఒకటి. తరచుగా మద్యం సేవించడం వల్ల లివర్ సెల్స్ దెబ్బతిని ఫ్యాటీ లివర్, హెపటైటిస్, సిరోసిస్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. 

మైదా ఫుడ్స్

మైదాతో తయారు చేసే బిస్కెట్లు, కేకులు, పిజ్జా, వైట్ బ్రెడ్ వంటి పదార్థాలు రక్తంలో షుగర్ లెవెల్స్‌ను వేగంగా పెంచుతాయి. దీంతో లివర్‌లో కొవ్వు నిల్వలు ఎక్కువగా పేరుకుంటాయి.

రెడ్ మీట్ 

మటన్, బీఫ్ వంటి రెడ్ మీట్‌ను తరచుగా ఎక్కువగా తింటే సాచ్యురేటెడ్ ఫ్యాట్ అధికంగా ఉండే ఫుడ్స్ శరీరంలో చేరుతుంది. ఇది లివర్ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపొచ్చు.

ఉప్పు 

అధికంగా ఉప్పు తీసుకుంటే కిడ్నీలే కాదు కాలేయం కూడా డ్యామేజ్ అవుతుంది. ఎందుకంటే ఉప్పు వల్ల శరీరంలో నీరు నిల్వ ఉండటం, రక్తపోటు పెరగడం వంటి సమస్యలు వస్తాయి. దీని ప్రభావం లివర్‌పైనా పడే అవకాశం ఉంటుంది.

లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే..

కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచాలంటే ఈ ఫుడ్స్​ జోలికి పోకూడదు. తప్పట్లేదు అనుకుంటే తగ్గించాలని చెప్తున్నారు. అలాగే ఫుడ్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ పండ్లు, కూరగాయలు డైట్లో చేర్చుకోవాలి. వ్యాయామం చేయడంతో పాటు తగినంత నీరు తాగాలి. ఒత్తిడిని తగ్గించుకునేందుకు ఫ్యాటీ లివర్ మొదట్లో సైలెంట్‌గా ఉండొచ్చు. కాబట్టి చిన్న లక్షణాలనైనా నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించడం మంచిది.

ఇలాంటి మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం దీనిని క్లిక్ చేయండి. 

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Breastfeeding Myths vs Facts : తల్లిపాలు ఇస్తే అలా జరుగుతుందా? ఈ అపోహల్లో నిజం ఎంత? నిపుణుల సూచనలు ఇవే
తల్లిపాలు ఇస్తే అలా జరుగుతుందా? ఈ అపోహల్లో నిజం ఎంత? నిపుణుల సూచనలు ఇవే
Pregnancy Test : పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
Advertisement

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
GHMC Elections: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
Chalasani Anjaneyulu: విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
Medical Student Brain Dead: రాజమండ్రి హిట్ అండ్ రన్ కేసులో విషాదం.. మెడికల్ విద్యార్థినికి బ్రెయిన్ డెడ్
రాజమండ్రి హిట్ అండ్ రన్ కేసులో విషాదం.. మెడికల్ విద్యార్థినికి బ్రెయిన్ డెడ్
PMFBY Last Date: రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!
రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!
IPL Hardik Trade: హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
Vishwanath And Sons Trailer: సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ వచ్చేసిందోచ్... హిట్టు కళ కనబడుతోందిగా
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ వచ్చేసిందోచ్... హిట్టు కళ కనబడుతోందిగా
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Care Health Insurance: తెలంగాణలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా, ప్రజలకు ఇబ్బందులే... షాక్ ఇచ్చిన టీఎస్‌హెచ్‌ఏ!
తెలంగాణలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా, ప్రజలకు ఇబ్బందులే... షాక్ ఇచ్చిన టీఎస్‌హెచ్‌ఏ!
Embed widget